మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాల్లో ఇప్పటి కూడా ప్రేక్షకులకు ఎంతో గుర్తుండిపోయిన సినిమా ఇంద్ర. 2002 లో వచ్చిన ఈ సినిమాకి బి. గోపాల్ గారు దర్శకత్వం వహించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ గారు నిర్మించారు. ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే హీరోయిన్లుగా నటించారు.
ఈ సినిమాకి ఒకటి కాదు యాక్షన్, డైలాగ్స్, చిరంజీవి పర్ఫామెన్స్, డాన్స్, పాటలు, ఇలా ప్రతి ఒక్క ఎలిమెంట్ హైలెట్ గా నిలిచాయి. దాంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఆ టైంలో ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసింది ఇంకా ఎన్నో రికార్డ్స్ బ్రేక్ చేసింది. సినిమా విడుదలకి 15 సంవత్సరాల పైన గడిచినా కూడా ఇప్పటికి కూడా ఇంద్ర సినిమా గురించి మాట్లాడుతూ ఉంటారు.
అయితే ఇంద్ర సినిమా అప్పట్లో 35 కేంద్రాలలో 175 రోజులు ఆడి రికార్డ్ సృష్టించింది. ఇది మాత్రమే కాకుండా ఇంద్ర సినిమా ఖాతాలో ఇంకొక రికార్డ్ కూడా ఉంది. అదేంటంటే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక టికెట్లు అమ్ముడుపోయిన ఒకే ఒక్క తెలుగు మూవీ ఇంద్ర. ఆ టైం లోనే వరల్డ్ వైడ్ గా దాదాపు రెండు కోట్లకు పైగా టికెట్లు అమ్ముడు అయ్యాయట.
దాదాపు 18 సంవత్సరాల క్రితం, ప్రపంచ వ్యాప్తంగా అది కూడా రెండు కోట్ల టిక్కెట్లు అంటే చిన్న విషయం కాదు కదా? ఇన్ని రికార్డు సొంతం చేసుకుంది కాబట్టే ఇంద్ర సినిమా ఇప్పటికి కూడా ప్రజల్లో ఉండిపోయింది. అంతే కాకుండా ఈ సినిమా డైలాగ్స్ గురించి కూడా ఇప్పటికీ చాలామంది మాట్లాడుకుంటారు.