మన సోషల్ మీడియాలో అందరి కంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు సినిమా స్టార్స్, ఇంకా స్పోర్ట్స్ స్టార్స్. అందులోనూ ముఖ్యంగా క్రికెటర్స్ కి అయితే ఇంకా ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుంది. వారిలో విరాట్ కోహ్లీ ఒకరు. విరాట్ కోహ్లీ తన సోషల్ మీడియా అకౌంట్ లో క్రికెట్ కి సంబంధించిన విషయాలతో పాటు పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు విరాట్ కోహ్లీ. ఇటీవల విరాట్ కోహ్లీ ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 100 మిలియన్లకు చేరింది. ఈ ఘనత సాధించిన మొదటి క్రికెటర్, అలాగే మొదటి ఇండియన్ విరాట్ కోహ్లీ. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఇంస్టాగ్రామ్ ఫాలోవర్లు 100 మిలియన్ దాటారు కూడా.
అయితే విరాట్ కోహ్లీ ఇంస్టాగ్రామ్ బయోలో ఒక పదం రాసి ఉంటుంది. ఆ పదం కార్పీడియం (carpediem). ఈ పదానికి అర్థం కొంత మందికి తెలిసి ఉండొచ్చు కొంత మందికి తెలియకపోయి ఉండొచ్చు. కార్పీడియం అనేది ఒక లాటిన్ పదం. ఇది carpe dium అనే పదాల నుండి వచ్చింది.
కార్పీడియం అంటే భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఆ రోజు మీద శ్రద్ధ పెట్టాలి అని అర్థం. ఇప్పుడు ఈ రోజులో ఉన్న ప్రతి మూమెంట్ ని ఎంజాయ్ చేయాలి అని అర్థం. ఇది విరాట్ కోహ్లీ ఇంస్టాగ్రామ్ బయోలో ఉండే కార్పీడియం అనే పదానికి అర్థం. విరాట్ కోహ్లీ ట్విట్టర్ అకౌంట్ లో బయోలో “ఎ ప్రౌడ్ హస్బెండ్ అండ్ ఫాదర్” అని ఉంటుంది.