గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో ఎక్కడ చూసినా వినిపిస్తున్న పేరు కుమారి ఆంటీ. ఈమె ఫుడ్ స్టాల్ చాలా ఫేమస్ అయిపోయింది. సెలబ్రిటీలు కూడా సినిమా ప్రమోషన్ కోసం ఈమె ఫుడ్ స్టాల్ కి వెళ్తున్నారు.
కొన్ని రోజుల నుండి కుమారి ఆంటీ ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. ఇప్పుడు కుమారి ఆంటీ గురించి మరొక న్యూస్ ప్రచారంలోకి వచ్చింది.
కుమారి ఆంటీ బిగ్ బాస్ లోకి వెళ్తున్నారు అని అన్నారు. మామూలుగా ఎవరైనా కొంచెం ఫేమస్ అయిన వారికి బిగ్ బాస్ ఆహ్వానాలు అందుతాయి. ఇప్పుడు కుమారి ఆంటీకి కూడా అలాగే అయ్యింది అన్నారు. కానీ ఈ వార్తలో నిజం లేదు అని అంటున్నారు. ఒక వేళ అలాంటి ఆఫర్ వచ్చినా కూడా కుమారి ఆంటీ వెళ్లరు అని అంటున్నారు. అయితే ప్రస్తుతం కుమారి ఆంటీ మాత్రం చర్చల్లో నిలిచారు. పోలీసులు రావడం, ఫుడ్ స్టాల్ తీసేయాలి అని చెప్పడం, ఆ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్మిషన్ ఇవ్వడం, ఇవన్నీ జరిగాయి. ఇన్ని రోజుల్లో ఎన్నో ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు.
ఎంతో మంది కుమారి ఆంటీకి మద్దతు కూడా పలికారు. కష్టపడి వచ్చిన మనిషిని ఇలా చేయడం ఏంటి అని అన్నారు. అయితే మరి కొంత మంది మాత్రం, కుమారి ఆంటీ ఇప్పుడు చాలా పాపులర్ అయిపోయారు కాబట్టి శ్రీదేవి డ్రామా కంపెనీకి కచ్చితంగా వెళ్తారు అని అంటున్నారు. ఎందుకంటే సాధారణంగా ఇలా గుర్తింపు తెచ్చుకున్న కొంతమందిని శ్రీదేవి డ్రామా కంపెనీలో పిలుస్తారు. కాబట్టి కుమారి ఆంటీ కూడా శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక ఎపిసోడ్ లో అతిథిగా అయిన వెళ్లే అవకాశం ఉంది ఏమో అని అంటున్నారు.