2015 లో వచ్చిన బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా భజరంగీ భాయిజాన్. సల్మాన్ ఖాన్, కరీనా కపూర్ నటించిన ఈ సినిమాకి కబీర్ ఖాన్ దర్శకత్వం వహించారు. కె. వి. విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. ఈ సినిమాలో మున్ని (షాహిదా) పాత్రలో నటించిన అమ్మాయి మీ అందరికీ గుర్తుండే ఉంటుంది.

తన పేరు హర్షాలీ మల్హోత్రా. 2008 లో జన్మించిన హర్షాలీ మల్హోత్రా కుబూల్ హై,లౌట్ ఆవో త్రిష సీరియల్స్ లో నటించింది. అలాగే సావధాన్ ఇండియా లో కూడా నటించింది. అంతే కాకుండా ఫేర్ అండ్ లవ్లీ, పియర్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హార్లిక్స్ లాంటి అడ్వర్టైజ్మెంట్స్ లో కూడా నటించింది.
2015 లో బజరంగీ భాయిజాన్ సినిమాతో, సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఈ సినిమాతో ఒక్క బాలీవుడ్ లో మాత్రమే కాకుండా నేషనల్ వైడ్ గా అభిమానులను సంపాదించుకుంది హర్షాలీ మల్హోత్రా. తర్వాత నాస్తిక్ అనే ఒక సినిమాలో నటించింది.
దివాలి సందర్భంగా పండుగను జరుపుకుంటున్న ఫోటోలను ఇటీవల హర్షాలీ మల్హోత్రా తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసింది. దాదాపు ఐదు సంవత్సరాల తరువాత హర్షాలీ మల్హోత్రా మళ్లీ మన ముందుకు రావడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
#1
#2
#3
#4





#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18

వైరల్ అవుతున్న వివరాల ప్రకారం టాప్ 5 లో ఉండే కంటెస్టెంట్స్ అభిజిత్, లాస్య, సోహెల్, అవినాష్, అఖిల్. టాప్ 2 లో అభిజిత్, లాస్య ఉంటారు అని, లాస్య రన్నరప్ అవ్వగా, సీజన్ విజేతగా అభిజిత్ నిలుస్తారు అనే వార్త ప్రచారం అవుతోంది. ఈ వార్తలో ఎంత నిజముందో తెలుసుకోవాలంటే గ్రాండ్ ఫినాలే వరకు ఆగాల్సిందే.
గత వారం వీకెండ్ ఎపిసోడ్ విషయానికి వస్తే, శనివారం దివాలి అవ్వడంతో ఎపిసోడ్ సరదాగా సాగింది. ఆదివారం ఎలిమినేషన్ లో భాగంగా మెహబూబ్ బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి రావడంతో ఎపిసోడ్ చాలా ఎమోషనల్ గా నడిచింది. ఇంక ఈ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ జరగనుంది.
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
#19
#20
రాజీవ్ కనకాల ఇటీవల ప్రముఖ యూట్యూబ్ ఛానల్ సుమన్ టీవీకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో తన కుటుంబంలో జరిగిన విషాదంపై రాజీవ్ కనకాల మాట్లాడుతూ “ఒకేసారి ముగ్గురు కుటుంబ సభ్యులని కోల్పోవడం చాలా బాధాకరంగా ఉంది. ఆ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కానీ జీవితం అన్నాక ఇవన్నీ తప్పవు అని ధైర్యం తెచ్చుకున్నాం.
తనకి క్యాన్సర్ సోకిన తర్వాత మెల్లగా అనారోగ్యం నుండి కోలుకుంటోంది ఇప్పుడు సేఫ్ అనుకుంటున్నాం. నేను మధురైలో నారప్ప షూటింగ్ లో ఉన్నాను. లాక్ డౌన్ కి రెండు రోజుల ముందు నేను వచ్చాను. మా బావ ఫోన్ చేసి పాపాయికి బాలేదు అని చెప్పారు. నేను వెంటనే వెళ్లాను. నా చెల్లెలు బతికే ఛాన్సెస్ లేవు అన్నారు. ఆ సమయంలో తనకి జాండీస్ రావడంతో జాండీస్ తగ్గేంతవరకు కీమోథెరపీ కష్టం అన్నారు. తరువాత రెండు రోజుల్లో శ్రీలక్ష్మి లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది.
మా మేనకోడళ్ళు ఇద్దరు ధైర్యవంతులు. చాలా బాగా అర్థం చేసుకుంటారు. వాళ్ళని మా ఇంటికి తీసుకువద్దామని అనుకున్నాం. కానీ వాళ్లకు వాళ్ల ఇంటితో ఉన్న అనుబంధం కారణంగా రాము అని చెప్పి వాళ్ళ నాన్న దగ్గర ఉన్నారు. మేము వాళ్లతో తరచుగా ఫోన్ లో మాట్లాడుతూ, అలాగే వాళ్ళ ఇంటికి వెళ్లి వస్తూ ఉంటాం. సుమతో వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ గా ఉంటారు” అని అన్నారు.



#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#15




అందులో కొన్ని సినిమాలు మంచి ఫలితాలను ఇచ్చాయి. కొన్ని మాత్రం అనుకున్నంతగా అలరించలేకపోయాయి. దానికి కారణం అవి థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం రూపొందించినవి కావడమే. కానీ ఆకాశం నీ హద్దురా మాత్రం ఓటీటీ లో చూసినా కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇలాంటి సినిమాలు థియేటర్లో చూస్తే ఇంకా మంచి రెస్పాన్స్ వస్తుంది అనుకోండి. అది వేరే విషయం.
ఈ సినిమాకి సూర్య పర్ఫామెన్స్ హైలైట్ గా నిలిచింది. అంతే కాకుండా హీరోయిన్ గా అపర్ణ బాలమురళి, అలాగే ముఖ్య పాత్రల్లో నటించిన ఊర్వశి, పరేష్ రావల్ కూడా చాలా బాగా నటించారు. డిజిటల్ రిలీజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ సినిమాకి దాదాపు అందరూ పాజిటివ్ గా చెప్పినా కూడా, కొంత మంది మాత్రం కొన్ని పాయింట్స్ మైనస్ గా నిలిచాయని అంటున్నారు.
మామూలుగా సూర్యకి, శ్రీనివాస మూర్తి డబ్బింగ్ చెప్తారు. ఇప్పుడు కాదు. చాలా సంవత్సరాల నుండి సూర్యకి మనం శ్రీనివాస మూర్తి గొంతు వింటున్నాం. మధ్యలో కొన్ని సినిమాలకు మాత్రమే డబ్బింగ్ మారింది. అంటే, బ్రదర్స్ సినిమాలో ఒక పాత్రకి సూర్య డబ్బింగ్ చెప్పుకోగా, ఇంకొక పాత్రకి కార్తీ డబ్బింగ్ చెప్పారు. సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమాలో కూడా తండ్రి పాత్ర పోషించిన సూర్య పాత్రకి శ్రీనివాస్ మూర్తి డబ్బింగ్ చెప్పగా, కొడుకు పాత్ర పోషించిన సూర్యకి వేరే డబ్బింగ్ ఆర్టిస్ట్ డబ్ చేశారు.
ఇంతకు ముందు విడుదలైన గ్యాంగ్ సినిమాకి సూర్య తనే డబ్బింగ్ చెప్పుకున్నారు. కానీ మెజారిటీ సూర్య సినిమాల్లో మనం విన్నది శ్రీనివాస మూర్తి గొంతు. కాబట్టి సూర్య అంటే సాధారణంగా శ్రీనివాస మూర్తి గొంతే మనకి స్ట్రైక్ అవుతుంది. కానీ ఈ సినిమాకి నటుడు సత్యదేవ్ డబ్బింగ్ చెప్పారు. ముందు ట్రైలర్ చూసినప్పుడు సత్యదేవ్ వాయిస్ సూర్యకి సూట్ అవ్వలేదు అన్నారు. సినిమాకి అదే మైనస్ పాయింట్ అయ్యింది అని అన్నారు.
మనం ఎన్నో సినిమాలకి శ్రీనివాస్ మూర్తి వాయిస్ విన్నాం కాబట్టి, ఆ వాయిస్ కి అలవాటు పడిపోయాం. అందుకే కొంచెం డిఫరెంట్ గా అనిపించింది అని, సినిమా విడుదలైన తర్వాత ముందు 5 – 10 నిమిషాలు డబ్బింగ్ అడ్జెస్ట్ చేసుకోవడానికి టైం పట్టినా కూడా, తర్వాత సెట్ అయ్యింది అని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.