తాజాగా జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత ఆస్ట్రేలియా చేతిలో ఓటమి చెందింది. మ్యాచ్ అనంతరం భారత్ ఆటగాళ్లందరూ డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లి కళ్ళంట నీళ్లు పెట్టుకున్నారు. అయితే ఆ రోజు ఎవరూ భోజనం చేయలేదని ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదని భారత బౌలర్ మహమ్మద్ షమీ చెప్పుకొచ్చాడు. ఓటమిని ప్రతి ఒక్కరూ జీర్ణించుకోలేకపోయామని అన్నాడు.
అయితే ఎవ్వరూ ఊహించిన విధంగా అప్పుడు డ్రెస్సింగ్ రూమ్ లోకి భారత ప్రధాని నరేంద్ర మోడీ విచ్చేసారని, మోడీ వచ్చి ప్రతి ఒక్కరితో మాట్లాడి ధైర్యాన్ని కల్పించారని, మా భుజం తట్టి ప్రోత్సహించారని అన్నాడు. ఆరోజు మోడీ రావడం మాకు కొంత ఊరట ఇచ్చిందని చెప్పుకొచ్చాడు. అలాంటి సమయంలో తమకి అది ఎంతో మద్దతుగా నిలిచిందని అన్నాడు.
అయితే వరల్డ్ కప్ లో మహమ్మద్ షమీ ప్రదర్శనకు గాను తాజాగా షమీని అర్జున అవార్డుకు సిఫార్సు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అర్జున అవార్డు భారత ప్రభుత్వం తరపున ఆటల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన వారికి అందిస్తారు.