Joruga Husharuga Review: బేబీ హీరో “విరాజ్ అశ్విన్” హిట్ కొట్టాడా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Joruga Husharuga Review: బేబీ హీరో “విరాజ్ అశ్విన్” హిట్ కొట్టాడా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mounika Singaluri

Ads

బేబీ సినిమా తో మంచి క్రేజ్ తెచ్చుకున్న నటుడు విరాజ్ అశ్విన్ హీరోగా నటించిన జోరుగా హుషారుగా సినిమా నేడు విడుదల అయింది.ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం…!

Video Advertisement

  • నటీనటులు: విరాజ్ అశ్విన్, పూజిత పొన్నాడ, సిరి హన్మంతు, మధు నందన్, సాయికుమార్, రోహిణి, బ్రహ్మజీ, జెమినీ కిరణ్, చంద్రికా థాకూర్ తదితరులు
  • దర్శకత్వం: అనుప్రసాద్
  • నిర్మాత: నిరీష్ తిరువీడుల
  • మ్యూజిక్: ప్రణీత్ నంబూరి
  • సినిమాటోగ్రాఫర్: మహి రెడ్డి పొందుగుల
  • ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్
  • బ్యానర్: శిఖర, అక్షర ఆర్ట్స్ ఎల్ఎల్‌పీ
  • సమర్పణ: శ్రీమతి నివేదిత
  • రిలీజ్ డేట్: 2023-12-15

joruga husharuga review

కథ:

సంతోష్(విరాజ్ అశ్విన్) ఆనంద్(మధునందన్) ఆఫీస్ లో పని చేస్తుంటాడు. సంతోష్ లవర్ నిత్య(పూజిత పొన్నాడ) అతనికి చెప్పకుండా అతని ఆఫీస్ లో టీంలీడ్ గా జాయిన్ అవుతుంది. దీంతో సంతోష్ షాక్ అయి తమ లవ్ గురించి ఆఫీస్ లో ఎవ్వరికి తెలియకూడదు, తెలిస్తే జాబ్స్ తీసేస్తారు అని చెప్తాడు. ఆనంద్ పెళ్లి కావట్లేదని బాధపడుతూ ఉంటాడు. ఆఫీస్ లో సుచిత్ర(సిరి హనుమంత్) ఆనంద్ ని ఇష్టపడుతుంది. వీళ్ళిద్దర్నీ కలిపితే బాస్ మెచ్చుకొని తనకి కావాల్సిన శాలరీ హైక్ ఇస్తాడని ఆనంద్, సుచిత్రని కలపడానికి సంతోష్ ట్రై చేస్తాడు.

joruga husharuga review

కానీ ఆనంద్ తప్పుగా అర్ధం చేసుకొని సంతోష్ లవర్ నిత్యని ప్రేమిస్తాడు. మరో పక్క ఊళ్ళో చేనేత కార్మికుడిగా ఉన్న సంతోష్ తండ్రి(సాయి కుమార్) 20 లక్షలు అప్పు చేస్తే ఆ అప్పు కొడుకు కడతాడని ఎదురు చూస్తూ ఉంటాడు. మరి సంతోష్ తండ్రి అప్పు తీర్చాడా? సంతోష్ – నిత్యల ప్రేమ కథ ఏమైంది? సుచిత్ర లవ్ ఆనంద్ కి చెప్పిందా? సంతోష్ – నిత్యల ప్రేమ కథ ఆఫీస్ లో తెలిసిందా? తెలియాలి అంటే మిగిలిన కథ తెరపై చూడాల్సిందే.

joruga husharuga review

రివ్యూ:

మొదటి హాఫ్ అంతా ఆఫీస్ లో విరాజ్ – పూజిత మధ్య లవ్ సీన్స్, ఆఫీస్ లో కొన్ని కామెడీ సీన్స్, హీరో హీరోయిన్స్ లవ్ ఎవ్వరికి తెలియకూడదు అని సాగుతుంది. మధ్యలో విరాజ్ తల్లితండ్రులుగా సాయి కుమార్ – రోహిణి సీన్స్ చూపిస్తారు. ఫస్ట్ హాఫ్ కొద్దిగా బోర్ కొడుతుంది. ఇంటర్వెల్ కి మధునందన్ సుచిత్రని ప్రేమిస్తాడు అనుకుంటే నిత్యని ప్రేమిస్తాడు అని చెప్పి ఓ కన్ఫ్యూజన్ లో ట్విస్ట్ తో బ్రేక్ ఇస్తారు.

joruga husharuga review

ఇక సెకండ్ హాఫ్ అంతా హీరో వాళ్ళిద్దర్నీ కలపడానికి ట్రై చేయడం, వీళ్ళ లవ్ గురించి చెప్పకపోవడంతో హీరో – హీరోయిన్స్ మధ్య మనస్పర్థలు, ఊళ్ళో తండ్రీకొడుకుల ఎమోషన్ చూపిస్తారు. చివరి అరగంట మాత్రం కొంచెం కామెడీతో నవ్వుకోవచ్చు. కొంచెం ఎమోషన్ కూడా వర్కౌట్ అవుతుంది.హీరో విరాజ్ అశ్విన్, హీరోయిన్ పూజిత పొన్నాడ తమ తమ పాత్రల్లో బాగా నటించారు. వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ, ఇగో సీన్స్ వర్కవుట్ అయ్యాయి. సోను ఠాకూర్ తన అందంతో కాసేపు మెప్పించింది. అమాయకమైన అమ్మాయి రోల్ లో సిరి హనుమంత్ ఫర్వాలేదనిపించింది.

joruga husharuga review

మధునందన్, రాజేష్ ఖన్నా, బ్రహ్మాజీ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. సాయి కుమార్, రోహిణి పత్రాలు చిన్నవే అయినా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాయి. కెమెరా విజువల్స్ మాత్రం బాగున్నాయి. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపించినా సాంగ్స్ మాత్రం యావరేజ్ అనిపిస్తాయి. కథ పరంగా ఇంట్రెస్ట్ గా ఉన్నా దర్శకుడు స్క్రీన్ ప్లేని ఇంకొద్దిగా బాగా రాసుకుంటే బాగుండేది అనిపిస్తుంది. మొత్తంగా జోరుగా హుషారుగా సినిమా.. ఓ ప్రేమకథకు అదనంగా ఫాదర్ సెంటిమెంట్ జోడించి కొంచెం కన్ఫ్యూజన్ తో నవ్వించి మెప్పించడానికి ట్రై చేశారు.

ప్లస్ పాయింట్స్:

  • విరాజ్ నటన
  • సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్

మైనస్ పాయింట్స్:

  • కథ
  • స్క్రీన్ ప్లే
  • అక్కడక్కడా బోరింగ్ సీన్స్

రేటింగ్:

2.5/5

ఫైనల్ గా:

కొంచెం జోరు…కొంచెం హుషారు…

watch trailer :


End of Article

You may also like