ప్రముఖ సంగీత దర్శకుడు మాస్ట్రో ఇళయరాజా తన సంగీతంతో భారతదేశ వ్యాప్తంగా ఖ్యాతి గడించారు. ఇళయరాజా పాటంటే ఇప్పటికీ చెవి కోసుకుంటారు. ఇళయరాజా కుటుంబం అంతా సంగీతానికే అంకితం అయిపోయారు.
ఇళయరాజా కుమారులు కార్తీక్ రాజా,యువన్ శంకర్ రాజాలు సంగీత దర్శకులుగా రాణిస్తున్నారు. ఇళయరాజా కూతురు భవతారిణి కూడా ఇదే ఫీల్డ్ లో కొనసాగుతున్నారు. అయితే నిన్న ఇళయరాజా కూతురు భవతారిణి అకస్మాత్తుగా మరణించారు. ఈ వార్త విని యావత్తు సంగీత అభిమానులు అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. అసలు ఇళయరాజా కూతురు చనిపోవడానికి కారణం ఏంటి…?

భవతారిణి నిన్న శ్రీలంకలో హాస్పిటల్లో మరణించారు. గత కొద్దిగ కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న భవతారిణి శ్రీలంక హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు. ఇళయరాజా కూడా శ్రీలంకలో కాన్సర్ట్ నిమిత్తం తన ట్రూప్ తో శ్రీలంకలోనే ఉన్నారు. భవతారిణి మరణించడంతో సంగీత అభిమానులు సినీ ఇండస్ట్రీ వారు ఇళయరాజా కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

భవతారిణి కూడా తండ్రి లాగానే సంగీతంలో రాణించారు. పలు సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేశారు అలాగే సింగర్ గా కూడా చాలా సినిమాల్లో పాటలు పాడారు. ఇక భవతారిణి తెలుగులో గుండెల్లో గోదావరి సినిమాలో ఒక పాట పాడారు. ఈ సినిమాకి ఇళయరాజా సంగీతం అందించడం విశేషం. తెలుగులో ఆమె మ్యూజిక్ డైరెక్టర్ పనిచేసిన చిత్రం అవును. ఈ చిత్రం 2003 సంవత్సరంలో వచ్చింది. ఇక అన్ని భాషల్లో కలిపి భవతారిణి 100కు పైగా పాటలు పాడారు. ఇక భవతారిణి భర్త శబరి రాజ్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో పని చేస్తూ ఉంటారు.



నిఖిల్ విజయేంద్ర సింహ పేరు సోషల్ మీడియా మరియు యూట్యూబ్ ఫాలో అయ్యేవారికి సుపరిచితం. యూట్యూబర్‌గా కెరీర్ ప్రారంభించి, కాస్కో అనే సెలబ్రిటీ టాక్ షోతో అతి తక్కువ సమయంలోనే పాపులర్ అయ్యారు. ఈ ప్రోగ్రామ్ హిట్ కావడంతో నిఖిల్ పాపులారిటీ అనూహ్యంగా పెరిగింది. మెగాడాటర్ నిహారిక, మంచు లక్ష్మి, వితిక, హారిక వంటివారికి నిఖిల్ ఫ్రెండ్ కూడా. సినీ సెలెబ్రెటీ పార్టీల్లో నిఖిల్ కనిపిస్తూ ఉంటాడు. నిఖిల్ మూవీ ప్రమోషన్స్ మూవీ యూనిట్ ను ఇంటర్వ్యూలు ఇస్తారు. నిఖిల్ సోషల్ మీడియా మరియు యూట్యూబ్ లో యాక్టివ్ గా ఉంటారు.
నిఖిల్ విజయేంద్ర సింహ 1996లో సెప్టెంబర్ 18న విశాఖపట్నంలో జన్మించారు. అతని తండ్రి రియల్ ఎస్టేట్ రంగంలో ఉండగా, తల్లి ఒక ఎన్జీవో కోసం పనిచేయడమే కాకుండా, ఖాజాగూడలో దిబ్బరోట్టి అనే రెస్టారెంట్‌ను కూడా నిర్వహిస్తోంది. నిఖిల్ 2018లో గీతం యూనివర్శిటీ నుండి బికాం (ఆనర్స్) పూర్తి చేసిన తర్వాత హైదరాబాద్‌కు వచ్చారు. తమ్మడ మీడియాలో పని చేయడం ప్రారంభించాడు. అలా ‘మహతల్లి’ ఛానెల్లో షార్ట్ ఫిల్మ్‌లలో కనిపిస్తూ యాక్టింగ్ లో ప్రవేశించాడు.
2019లో, నిఖిల్ తన సొంత యూట్యూబ్ ఛానెల్ ‘కాస్కో’ని మొదలుపెట్టి, తక్కువ సమయంలోనే నాలుగు లక్షలమంది సబ్స్క్రైబర్లను సంపాదించాడు. అందులో కంటెంట్, ఛాలెంజ్ వీడియోలు, ఫన్నీ వీడియోలు, సెలబ్రిటీ హోమ్ టూర్లతో పాటు సెలబ్రిటీలతో ఎంగేజింగ్ వీడియోలతో చాలా పాపులర్ అయ్యారు. 2020లో, నిఖిల్ తన ఫ్రెండ్ భానుతో కలిసి సొంత ప్రొడక్షన్ హౌస్ ‘రాయుడు చిత్రాలు’ స్థాపించాడు. నిహారిక కొణిదెల, అనసూయ భరద్వాజ్ వంటి ప్రముఖ నటీనటులు లీడ్ రోల్స్ లో వెబ్ సిరీస్‌ని నిర్మించారు. అంతేకాకుండా ‘హాయ్ నాన్న’ దర్శకుడు శౌర్యువ్ యువరాజ్ సింహ నిఖిల్ కి సొంత అన్నయ్య అని సమాచారం.



అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట అంగరంగ వైభవంగా ప్రధాని మోడీ చేతులమీదుగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమనికి సంబంధించిన ఫొటోలు, రాముడి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ప్రస్నవదనంతో చిరునవ్వును కలిగి, బాల రాముడి విగ్రహం ముగ్ద మనోహరంగా భక్తులకు దర్శనం ఇస్తోంది. రెండవ రోజు నుండి సాధారణ భక్తులకు అనుమతి ఇవ్వడంతో అయోధ్య రాముడిని చూడడానికి భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తుతున్నారు.
తాజాగా అయోధ్య రాముడి గురించిన ఒక వార్త నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. తమిళనాడులో హీరోహీరోయిన్ల పై వారి ఫ్యాన్స్ అభిమానం హద్దులు దాటి ఉండడం సాధారణ విషయమే. అయితే ఇప్పుడ ఆ అభిమానం పరిధులు దాటి వెళ్తోంది. తమిళ లెజెండరి యాక్టర్ కెప్టెన్ విజయ్ కాంత్, అయోధ్య బాల రాముడి విగ్రహానికి పోలికలు ఉన్నాయని ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.
రామ్ లల్లా సుందర ముఖారవిందం పై కోలీవుడ్ లో రచ్చ జరుగుతోంది. బాలక్ రామ్ విగ్రహం కళ్ళు మరియు నవ్వు తమ అభిమాన హీరో విజయ్ కాంత్ ను పోలి ఉన్నట్టు చెబుతున్నారు. కళ్లు అచ్చుగుద్దినట్టుగా తమ హీరో కళ్ళలా ఉన్నాయని, విజయ్ కాంత్ కళ్ళను, రాముడి కళ్ళను పోల్చుతూ కెప్టెన్ ఫ్యాన్స్ ఈ ఫోటోను వైరల్ చేస్తున్నారు.




