ఒకప్పుడు ధనికులు మాత్రమే విమాన ప్రయాణం చేసేవారు. అయితే ప్రస్తుతం సామాన్యులకు కూడా విమాన ప్రయాణం అందుబాటులోకి వచ్చింది. అందువల్ల సుదూర ప్రాంతాలకు వెళ్ళేవారు ఎక్కువగా విమాన ప్రయాణాన్నే ఎంచుకుంటున్నారు. ఇక దేశం నుండి ఇంకో దేశానికి వెళ్లాలనుకునేవారు ఎయిర్‌పోర్టుకు వెళ్లి సంతోషంగా విమానాలను ఎక్కి వెళ్తున్నారు.
దాని వల్ల ఎయిర్‌పోర్టుల సంఖ్యకు పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలో అగ్ర దేశాల లిస్ట్ లో చేరిన 5 దేశాల్లో విమాన పాసింజర్స్ సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉండడంతో ఆ దేశాలలో విమానాశ్రయాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇక ప్రపంచ దేశాలలో అగ్రరాజ్యం అమెరికా మొదటి స్థానంలో ఉంది. ప్రతి ఏడాది ఎయిర్‌పోర్టుల ద్వారా మిలియన్ల కొద్ది ప్రజలు విమానాల్లో ప్రయాణిస్తున్నారు.
అమెరికా:
అగ్రరాజ్యం అమెరికాలో ప్రపంచంలోనే అత్యధికంగా 14,712 ఎయిర్‌పోర్టులు ఉన్నాయి. ఇక వీటిలో 102 అంతర్జాతీయంగా ప్రయాణించే సౌకర్యాన్ని కలగచేస్తున్నాయి
బ్రెజిల్:
వెయ్యికి పైగా ఎయిర్‌పోర్టులు కల దేశాల్లో బ్రెజిల్ 4,093 ఎయిర్‌పోర్టులు కలిగి 2వ స్థానంలో ఉంది. ఇక వీటిలో 23 అంతర్జాతీయంగా ప్రయాణించే సౌకర్యాన్ని కలగచేస్తున్నాయి.
మెక్సికో:
మెక్సికో 1714 ఎయిర్‌పోర్టులు కలిగి 3వ స్థానంలో ఉంది. ఇక వీటిలో 36 అంతర్జాతీయంగా ప్రయాణించే సౌకర్యాన్ని కలగచేస్తున్నాయి.
కెనడా:
కెనడాలో 1467 ఎయిర్‌పోర్టులు ఉన్నాయి. వెయ్యికి పైగా విమానాశ్రయాలు కల దేశాల్లో కెనడా 4వ స్థానంలో నిలిచింది. కెనడా స్వచ్ఛమైన పర్యావరణానికి పేరు గాంచింది. అందువల్ల ఇక్కడికి ప్రపంచం నలుమూలల నుండి ఏడాది పొడవున మిలియన్ల కొద్ది పర్యాటకులు వస్తుంటారు.
రష్యా:
రష్యాలో 1218 ఎయిర్‌పోర్టులు ఉన్నాయి. వెయ్యికి పైగా విమానాశ్రయాలు కల దేశాల్లో రష్యా 5వ స్థానంలో ఉంది. రష్యా రాజధాని మాస్కోలో ఒక మీడియం, 2 ప్రధాన ఎయిర్‌పోర్టులు ఉన్నాయి. ఏడాదికి 80 మిలియన్లకు పైగా పాసింజర్స్ వీటి సర్వీసులను ఉపయోంచుకుంటున్నారు.
Also Read: స్టాంప్ పేపర్లలో ఉన్న ఈ రకాల గురించి తెలుసా? ఏ స్టాంప్ పేపర్ ని ఏ అవసరం కోసం వాడతారంటే?









మిథున్ చక్రవర్తి అసలు పేరు గౌరంగ చక్రవర్తి. ఆయన 1950లో జూన్ 16న పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో బెంగాలీ దిగువ మధ్యతరగతి హిందూ ఫ్యామిలిలో జన్మించారు. అతని తల్లిదండ్రులు బసంత కుమార్ చక్రవర్తి, శాంతి రాణి చక్రవర్తి దంపతులకు. అతను ఓరియంటల్ సెమినరీలో చదువుకున్నాడు మరియు తరువాత తన బీఎస్సి కోల్‌కతాలోని స్కాటిష్ చర్చి కళాశాల చేశాడు. ఆ తరువాత, పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుండి పట్టభద్రుడయ్యాడు.
బెంగాల్ లో నక్సలైట్ ఉద్యమం మొదలైన తరువాత ఇతర వేలాది బెంగాలీ యువకుల లాగానే, మిథున్ కూడా 1960ల చివరలో నక్సల్ పోరాటంలోకి వెళ్లారు. కోల్‌కతాలో నక్సలైట్ పోరాటం జరిగే టైమ్ లో చారు మజుందార్‌తో పనిచేశారు. అయితే నక్సలైట్ల పై పోలీసుల అణిచివేత వల్ల మిథున్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఆయన నక్సలైట్ గా మరడంతో ఆయన ఫ్యామిలీ ఆందోళనకు గురైంది. అదే సమయంలో మిధున్ సోదరుడు యాక్సిడెంట్ లో మరణించడంతో తిరిగి ఇంటికి వచ్చిన మిథున్ మళ్ళీ అటు వైపు చూడలేదు.
ఆ తరువాత సినిమాలలో నటించాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. కానీ అవకాశాలు అంత తేలికగా రాలేదు. ఒక్క పూట భోజనం కూడా దొరికేది కాదు. కొరయోగ్రాఫర్ హెలెన్ దగ్గర చేరారు. స్టేజ్ పై డ్యాన్స్ చేసేవాడు. తన డ్యాన్స్ చూసి అయినా సినిమాలో ఛాన్స్ ఇస్తారేమో అని. ఎన్ని రోజులు 1976లో మృగయా మూవీతో మిథున్ చక్రవర్తి బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీతో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకుని సంచలనం సృష్టించారు. ఆ తరువాత పలు సినిమాలలో నటించినా, 1982లో వచ్చిన ‘డిస్కో డాన్సర్’ మూవీతో సూపర్స్టార్డమ్ అందుకున్నాడు.
దేశంలోనే తొలి వందకోట్ల మూవీగా సంచలనం సృష్టించింది. ఈ మూవీతో ఇండియాలోనే కాకుండా రష్యాలో కూడా పాపులారిటీ పొందారు. డ్యాన్స్ స్టార్‌గా పేరు వచ్చింది. ఆ తరువాత ఎన్నో హిట్ సినిమాలు చేసి అగ్రహీరోగా మారారు. ఓ దశలో వరుసగా 33 సినిమాలు ఫ్లాప్ అయినా ఆయన స్టార్ డమ్ చెక్కచెదరలేదు. 1979లో నటి యోగీతా బాలిని వివాహం చేసుకున్నాడు. వీరికి నలుగురు పిల్లలు మిమోహ్, ఉష్మే చక్రవర్తి , నమషి చక్రవర్తి , దత్తపుత్రిక దిశాని చక్రవర్తి. రాజకీయాలలో ఎంట్రీ ఇచ్చిన మిథున్ ప్రస్తుతం బిజెపిలో కొనసాగుతున్నారు.
జైలర్ మూవీలో కు విలన్ గా, సూపర్ స్టార్ రజనీకాంత్ తరువాత ఈ మూవీలో నటనతో ఆకట్టుకున్న వ్యక్తి మలయాళ యాక్టర్ వినాయగన్. ఇతను నటుడు మాత్రమే కాదు మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ కూడా. ఎక్కువగా మలయాళ సినిమాలలో నటించే వినాయగన్ పలు తమిళ చిత్రాలలో కూడా నటించారు
వినాయకన్ తొలిసారిగా 1995లో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళంలో వచ్చిన ‘మాంత్రికం’ మూవీలో నటించాడు. వినాయకన్ తర్వాత కలి, ఒరుతీ, ట్రాన్స్, మరియు పద వంటి సినిమలలో నటించారు. 2016లో, దర్శకుడు రాజీవ్ రవి తెరకెక్కించిన ‘కమ్మటిపాడమ్‘ లో గంగ పాత్రలో తన నటనకు గాను వినాయకన్ ఉత్తమ నటుడిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు.
తమిళంలో వినాయకన్ నటించిన ఏడవ సినిమా జైలర్. ఆయన క్యారెక్టర్ ఈ మూవీలో ఎంత క్రూరంగా ఉంటుందో రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కనిపిస్తుంది. వినాయకన్ తెలుగులో కూడా నటించాడు. అయితే అతను ఒకే ఒక్క సినిమాలో మాత్రమే నటించారు. నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా రూపొందిన ‘అసాధ్యుడు’. అనే సినిమాలో విలన్ నటించాడు.
మహిళా తన శరీరంలో మరో ప్రాణికి జీవం పోసే సమయం, అంటే గర్భం ధరించే సమయంలో ఆమె శరీరంలో పలు మార్పులు కనిపిస్తుంటాయి. ఈ మార్పులు సహజంగా ప్రెగ్నెన్సీ సమయంలో ప్రతి స్త్రీలోను కనిపిస్తాయి. కానీ అందరిలోనూ ఒకేలాంటి లక్షణాలు కనిపించాలని లేదు. గర్భధారణ మొదట్లోనే ఈ మార్పులు మొదలవుతాయి. ప్రెగ్నెన్సీ వచ్చినపుడు పీరియడ్స్ ఆగిపోతాయి. ఇదే గర్భధారణకు ముఖ్యమైన సంకేతం. అయితే ఇతర కారణాల వల్ల కూడా ఇలా జరిగే ఛాన్స్ ఉంటుంది.
ప్రెగ్నెన్సీ సమయంలో ఉదయం లేవగానే వీక్ గా అనిపించడం, వికారంగా ఉండడం, తిన్న వెంటనే వాంతులు అయినట్లుగా అనిపిస్తుంది. నోటికి రుచిగా అనిపించదు. పుల్లని ఆహార పదార్ధాలు తినాలనిపిస్తుంది. మామూలు సమయంలో కన్నా ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువ సార్లు టాయిలెట్‌కి వెళ్తుంటారు. ప్రెగ్నెన్సీ టైమ్ లో రక్త ప్రవాహం పెరుగుతుంది. అది తలనొప్పి రావడానికి కారణమవుతుంది. ప్రెగ్నెన్సీ మొదట్లో కనిపించే ముఖ్యమైన లక్షణాలలో ఇది కూడా ఒకటి. ప్రెగ్నెన్సీ సమయంలో బాడీ టెంపరేచర్ సాధారణ ఉష్ణోగ్రత కన్నా ఎక్కువగా ఉంటుంది.
అది మాత్రమే కాకుండా ఈ టైమ్ లో వారి మానసిక స్థితి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంటుంది. చికాకు పెరుగుతుంది. అలాగే గర్భధారణ సమయంలో శరీరంలో హార్మోన్లలో మార్పులు ప్రారంభం అవుతాయి. దానివల్ల శరీర భాగాల్లో మార్పు పెరుగుదల కనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు కనిపించినపుడు యూరిన్ టెస్ట్ కిట్ లేదా ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్స్ ద్వారా ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకోవచ్చు. కానీ, కొన్నిసార్లు ఈ కిట్ సరైన ఫలితాన్ని చూపదు. డాక్టర్‌ను సంప్రదించి ప్రెగ్నెన్సీని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది.
సాలూరు శ్మశాన కమిటీ సభ్యులు మాట్లాడుతూ శ్మశాన అభివృద్ధి కోసం మా కమిటీ నిధులను సేకరిస్తుంటుందని తెలిపారు. నిధుల సేకరణలో భాగంగానే తెలంగాణ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌ను సూర్యాపేట కలెక్టర్ ద్వారా తమ కమిటీ సంప్రదించింది. అలా ఎంపీ లింగయ్య ‘ఎంపీ ల్యాడ్స్’ నిధుల నుండి 10 లక్షల రూపాయలు సాలూరు శ్మశాన అభివృద్ధి పనులకు ఇచ్చారు. అయితే ఆ నిధులు సాలూరు పురపాలక సంఘానికి 2023 డిసెంబర్లో చేరాయి. దాంతో గత వారం నుండి సాలూరు శ్మశానంలో పనులు చేపట్టారు.
ఈ విషయం హాట్ టాపిక్ గా మారిన నేపథ్యంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ “రాజ్యసభ సభ్యులు తమ నిధులతో దేశంలో ఎక్కడైనా అభివృద్ధి పనులకు సహాయం చేయవచ్చు. ఆ క్రమంలోనే సాలూరు శ్మశాన అభివృద్ధి కోసం నిధులు ఇచ్చానని వెల్లడించారు. ఇది మంచి పని, చిన్న పని కావడంతో ఇచ్చాను. ఈ విషయంలో రాజకీయం లేదని అన్నారు.