చంద్రముఖి సినిమాకి సీక్వెల్ గా తాజాగా చంద్రముఖి 2 సినిమా వచ్చింది. లారెన్స్, కంగనా రనౌత్ ప్రధానాపాత్రలు పోషించిన ఈ సినిమాకి చంద్రముఖి డైరెక్షన్ చేసిన పి.వాసు డైరెక్షన్ చేశారు. వడివేలు, రాధిక శరత్‌కుమార్, లక్ష్మీ మీనన్, మహిమ నంబియార్, సృష్టి డంగే, సుభిక్ష కృష్ణన్, సురేశ్ చంద్ర, విఘ్నేష్ కీలకపాత్రలు పోషించారు.ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విజేత ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించారు.
లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.ఎన్నో అంచనాలను నడుమ వచ్చిన ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఓటిటి లో విడుదలైన కూడా అనుకున్న స్థాయి స్పందన రాలేదు. పైగా ఈ సినిమా భారీగా ట్రోల్స్ కి గురి అయింది.

అయితే ఇప్పుడు చంద్రముఖి 2 టీవీలో ప్రసారం కావడానికి సిద్ధమయింది.చంద్రముఖి-2 సినిమా తెలుగు వెర్షన్ జెమినీ ఛానెల్లో డిసెంబర్ 31 తేదీన సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది. ఈ తేదీపై ప్రకటన కూడా వచ్చేసింది. మరోవైపు, చంద్రముఖి-2 తమిళ వెర్షన్ సన్ టీవీ ఛానెల్లో జనవరి 1 (2024) సాయంత్రం 6.30 గంటలకు ప్రసారం అవుతుంది.
అయితే థియేటర్ లో, ఓటిటి లోను ఫ్లాప్ అయినా ఈ చిత్రం టీవీలో ఏ మేరకు ఫలితం రాబడుతుందో వేచి చూడాలి. ఇక చంద్రముఖి 2 కధ విషయానికి వస్తే…చంద్రముఖి ఆత్మ తిరిగి రావడంతో వేటయ్యపాలెం ప్యాలెస్‌కు వచ్చే రాధికా శరత్‌కుమార్ కుటుంబంలో సమస్యలు ఎదురవడం, రాఘవ లారెన్స్ ఆ సమస్యను పరిష్కరించడం చుట్టూ చంద్రముఖి-2 చిత్రం కథ తిరుగుతుంది. చంద్రముఖి మళ్లీ ఎందుకు తిరిగి వచ్చింది.. చివరికి పరిష్కారం దొరికిందా అన్నదే చంద్రముఖి 2 ప్రధాన కథగా ఉంది





ఈ సినిమాలో దినేష్ తేజ్ హీరోగా, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్స్ గా నటించారు. ఈ చిత్రాన్ని కొమ్మాలపాటి సాయి సుధాకర్ విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించారు. ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే, గణేష్ (దినేష్ తేజ్) విశాఖపట్నం దగ్గరలో ఉన్న పల్లెటూరికి చెందిన మిడిల్ క్లాస్ యువకుడు. అతనికి సినిమాలంటే పిచ్చి. ఎప్పటి కైనా దర్శకుడు కావాలని కలలు కంటుంటాడు. గణేష్ జీవితంలోకి ఆ ఊరి అమ్మాయి దివ్య (పాయల్ రాధాకృష్ణ) ఎంట్రీ ఇస్తుంది. ఇద్దరు ప్రేమలో పడతారు.
కానీ వారి లవ్ కు దివ్య అమ్మ కనకమ్మ (ఝాన్సీ) అడ్డుగా నిలుస్తుంది. ఆమె అప్పటికే దివ్యకు కాళీ (శత్రు) తో పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతుంది. విషయం తెలిసిన దివ్య, గణేష్ దగ్గరికి వెళ్ళి పెళ్లి గురించి చెప్పి ఎలాగైనా ఆపమని కోరుతుంది. కానీ దర్శకుడు కావాలనుకున్న గణేష్ కు ఏం చేయాలో అర్ధం కాదు. పెళ్లి కన్నా కెరీర్ ముఖ్యమని సినిమా ఛాన్స్ కోసం హైదరాబాద్ వెళతాడు.
సలార్ మూవీ హిట్ తో పాపులర్ అయిన నటినటులలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు శ్రియా రెడ్డి. ఆమె సలార్ లో రాజమన్నార్ కుమార్తె, రాధా రామ మన్నార్ క్యారెక్టర్ లో అద్బుతంగా నటించి మెప్పించారు. ఈ మూవీ ముందు కోలీవుడ్ లో మాత్రమే పాపులర్ అయిన శ్రియా రెడ్డి, ఈ మూవీ రిలీజ్ అయ్యాక దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. పాన్ ఇండియా స్టేటస్ పొందారు.
తన నటనతో అందర్నీ ఆమె వైపుకు తిప్పుకున్నారు. దాంతో ఆమె గురించి తెలుసుకోవ డానికి నెట్టింట్లో ఆరా తీస్తున్నారు.ఈ క్రమంలో ఆమె నటించిన తిమిరి తెలుగులో పొగరు సినిమా ట్రెండింగ్ లోకి వచ్చింది. ఈ చిత్రం 2006 లో రిలీజ్ అయ్యింది. కోలీవుడ్ స్టార్ విశాల్ ఈ మూవీలో హీరోగా నటించారు. రీమాసేన్ హీరోయిన్ గా నటించగా, ఈశ్వరి పాత్రలో శ్రియా రెడ్డి నటించారు. ఈ చిత్రలో ఈశ్వరిగా శ్రియా రెడ్డి తన నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు.
ఈశ్వరి పాత్రలో ఒదిగిపోయి, హీరోతో పోటీ పడి నటించారు. ఈ మూవీ ట్రెండింగ్ లోకి రావడానికి మరో కారణం జైలర్ సినిమాలో విలన్ గా నటించిన వినాయకన్. పొగరు సినిమాలో వినాయకన్ నటించాడు. ఈశ్వరి పాత్రకు సహకరించే పాత్రలో మాయిగా వినాయకన్ నటించారు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ, వీరిద్దరు సలార్, జైలర్ చిత్రాలతో పాపులర్ అయ్యారు.
ప్రభాస్, శృతిహాసన్ జంటగా నటించిన సలార్ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించాడు. జగపతిబాబు, శ్రీయా రెడ్డి, ఈశ్వరి రావు, బాబీ సింహా, ప్రమోద్ పంజు ఇతర కిలక పాత్రలలో నటించారు. ఈ చిత్రం తొలి షోతోనే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని, భారీ కలెక్షన్స్ సాధిస్తోంది. ఈ చిత్రమలో నటించిన నటీనటులు దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. అలాంటివారిలో ప్రమోద్ పంజు ఒకరు.
సలార్ లో వరద రాజమన్నార్ తమ్ముడు బాచి మన్నార్ పాత్రలో నటించి, మెప్పించాడు. ప్రమోద్ పంజు కన్నడంలో పాపులర్ యాక్టర్. 1990లో జనవరి 10న జన్మించాడు. మాండ్య జిల్లాకు చెందినవాడు. ప్రమోద్ పంజు మద్దూరులోని సెయింట్ ఆన్స్ ఉన్నత పాఠశాలలో చదువును పూర్తి చేశాడు. సురానా కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. 2015 లో శాండల్ వుడ్ లో అడుగుపెట్టాడు.
ప్రమోద్ నటించిన మొదటి సినిమా గీతా బ్యాంగిల్ స్టోర్‌లో 11 సెప్టెంబర్ 2015న విడుదలైంది. ఆ తర్వాత 2019లో కన్నడ చిత్రం ప్రీమియర్ పద్మినిలో నటించాడు. మట్టే ఉద్భవ, అతను బుల్లితెర పై చుక్కి, పునర్వివాహ వంటి సీరియల్స్ లో నటించి, పాపులర్ అయ్యాడు. ప్రమోద్ మహాదేవి సీరియల్లో శివుడిగా నటించాడు. ఈ ఏడాది సలార్ పార్ట్ 1 లో నటించి, మరింత పాపులర్ అయ్యారు.
విజయ్‌కాంత్ అసలు పేరు విజయరాజ్ అళగరస్వామి నాయుడు. ఆయన 1952లో మదురైలో ఆగస్టు 25న జన్మించారు. కోలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన ముద్రను వేశారు. తమిళ సినీ లెజెండ్ లలో ఒకరిగా నిలిచిపోయారు. తన సినీ జీవితంలో తమిళ భాషలో మాత్రమే నటించి, కెప్టెన్ ప్రభాకర్ సినిమాతో కెప్టెన్ గా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్రవేశారు. ఇనిక్కుం ఇలామైతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన విజయ్‌కాంత్, తన కెరీర్ లో సుమారు 150కి పైగా చిత్రాలలో నటించారు. విజయ్‌కాంత్ నటించిన అనేక సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి. ఆయన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే.
ప్రజలకు సేవ చేయడం కోసం రాజకీయాలలో విజయ్‌కాంత్ ఎంట్రీ ఇచ్చారు. 2005లో సెప్టెంబరు 14న డిఎండికె (దేశీయ ముర్పొక్కు ద్రావిడ కళగం) అనే పార్టీని స్థాపించాడు. తెలుగులో ద్రావిడ జాతీయాభివృద్ది సమాఖ్య అని అర్ధం. 2006 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో డిఎండికె పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేయగా, విజయ్‌కాంత్ పోటీ చేసిన స్థానం మాత్రమే విజయం సాధించింది.
2011 అసెంబ్లీ ఎలెక్షన్స్ లో ఎఐఎడిఎంకె పార్టీతో పొత్తు పెట్టుకుని, 41 స్థానాలలో పోటీ చేశారు. విజయ్‌కాంత్ పోటీ చేసిన 41 స్థానాల్లో 29 గెలుచుకోని డిఎండికె పార్టీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా డిఎంకె కన్నా ఎక్కువ స్థానాలను డిఎండికె గెలుచుకుంది. విజయ్‌కాంత్ రెండోసారి ఎమ్మెల్యే పదవిని చేపట్టాడు. ప్రతి పక్షనాయకుడిగా ఉన్నారు. ఆ తరువాత 2016లో జరిగిన ఎలెక్షన్స్ లో అపజయం పొందాడు. ఆ తరువాత అనారోగ్య సమస్యలతో ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన కన్నుమూయడంతో తమిళ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
