యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కలెక్షన్స్ లో దూసుకుపోతుంది.
ప్రభాస్ కి తగ్గ సినిమా పడిందంటూ ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నార్త్ లో కూడా ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో అక్కడ అభిమానులను విపరీతంగా అలరిస్తుంది.

అయితే సలార్ కంటే ఒక రోజు ముందు షారుక్ ఖాన్ నటించిన డంకీ సినిమా కూడా విడుదలైంది. నార్త్ లో థియేటర్లన్నీ కూడా డంకీ సినిమాకే కేటాయించారు. మల్టీప్లెక్స్ లో కూడా అన్ని షోలు డంకీ సినిమాకి కేటాయించడంతో సలార్ నిర్మాతలు సీరియస్ అయ్యారు. దీంతో సౌత్ లో మల్టీప్లెక్స్ లకు తమ సినిమా ఇవ్వమంటూ డిసైడ్ అయ్యారు. దీంతో దిగి వచ్చిన మల్టీప్లెక్స్ ల వారు సలార్ కి కూడా కొన్ని థియేటర్లు కేటాయించారు.

అయితే డంకీ సినిమాకి హిట్ టాక్ వచ్చిన కూడా ఎమోషనల్ కంటెంట్ అంటూ పేరు వచ్చింది. సలార్ సినిమా విడుదలైన తర్వాత నార్త్ లో పరిస్థితి మారిపోయింది. సలార్ సినిమా ముందు డంకీ సినిమా నిలబడలేకపోయింది. దీంతో నార్త్ లో మేజర్ థియేటర్లన్నీ డంకీ ని తీసేసి సలార్ ను ప్రదర్శించడం మొదలుపెట్టారు. ప్రభాస్ దెబ్బకి షారుక్ ఖాన్ నిలబడలేకపోయాడు అంటూ ప్రభాస్ అభిమానులు తెలివి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క దెబ్బతో సినిమా మొత్తం మారిపోయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.




పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ పార్ట్ 1 డిసెంబర్ 22న రిలీజ్ అయ్యి, బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తోంది. అయితే కొందరు కేజీఎఫ్ స్థాయిలో సెన్సేషనల్ టాక్ తెచ్చుకోలేక పోయిందని విమర్శిస్తున్నారు. కాగా ప్రస్తుతం సలార్ మూవీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఇక ఈ చిత్రంలో ప్రభాస్, శృతి హాసన్ తొలిసారిగా జంటగా నటించారు.
జర్నలిస్ట్ ఆద్య క్యారెక్టర్ లో శృతి హాసన్ నటించింది. ఈ మూవీలో కీలకమైన పాత్రలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించగా ఇతర పాత్రలలో జగపతి బాబు, ప్రభాస్ తల్లిగా ఈశ్వరీ రావు, శ్రియా రెడ్డి, బాబీ సింహా నటించారు. ఈ మూవీలో బాబీ సింహా శౌర్యాంగ గిరిజనుడు అయిన భారవగా నటించారు.
ఖాన్సార్లోని దొరలలో ఒకరైన రాజ మన్నార్ అల్లుడు, రాధా రామకు భర్తగా నటించారు. ఈ చిత్రంలో ఒక సన్నివేశంలో బాబీ సింహా చేతిలో ఐఫోన్ ఎక్స్ మోడల్ ఉంటుంది. అయితే ఈ సీన్ 2010 లో జరుగుతుంది. అప్పటికి ఇంకా ఐఫోన్ ఎక్స్ మోడల్ రాలేదు. కొత్త మోడల్ ఐఫోన్ ఎలా ఉపయోగిస్తారు. ఇలాంటి మిస్టేక్స్ చూసుకోవాలి కదా డైరెక్టర్ గారు అంటూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.









