పుష్ప సినిమాలో కేశవ క్యారెక్టర్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు జగదీష్ భండారి. మచ్చ మచ్చ అంటూ సినిమా మొత్తం అల్లు అర్జున్ పక్కనే ఉంటూ నవ్విస్తూ సపోర్ట్ చేస్తూ మంచి నటన కనబరిచాడు.
అయితే జగదీష్ పుష్ప పార్ట్ 2 లో కూడా భాగమై ఉన్నాడు. ఇప్పటికే షూటింగ్ లో పాల్గొంటున్నారు కూడా. పుష్ప 2 సినిమాలో జగదీష్ పాత్ర చాలా కీలకమని చెబుతున్నారు. అయితే ఇటీవల ఈ నటుడు ఒక పోలీస్ కేస్ లో ఇరుక్కున్నాడు. ఒక జూనియర్ ఆర్టిస్ట్ జగదీష్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అని మనో వేదనకు గురై ఆత్మహత్య చేసుకుంది.

తనకి అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి నమ్మించి మోసం చేశారని, తన పర్సనల్ ఫోటోలు దగ్గర పెట్టి బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారని సూసైడ్ చేసుకుంది. అమే కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు జగదీష్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేసి జైలుకు తరలించారు. అయితే ఇప్పుడు జగదీష్ జైల్లో ఉండడం వల్ల పుష్ప2 షూటింగ్ నిలిచిపోయింది. ఈ కారణంగా కీలక సన్నివేశాలు షూటింగ్ పెండింగ్ లో పడిపోయాయి. జగదీష్ బయటకి వస్తే తప్ప అవి షూట్ చేసే అవకాశం లేకపోవడంలో చేసేదేం లేక పుష్ప టీం 15 లక్షలు ఖర్చుపెట్టి జగదీష్ కి బెయిల్ ఇచ్చి బయటకు తీసుకు వచ్చారు. దీనివల్ల ఇంపార్టెన్స్ సీన్స్ షూటింగ్ అంత కూడా ఒకేసారి పూర్తి చేయాలని టీం డిసైడ్ అయిందట






తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణంలో, పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డీనరీ బస్సులలో మహిళలు తెలంగాణలో ఎక్కడి నుండి మరెక్కడికైనా ఉచితంగా జర్నీ చేయవచ్చు. దీంతో మహిళలు ఆటోలు, క్యాబ్ లలో ప్రయాణం చేయడం లేదు. దీంతో ఆటోలు, క్యాబ్ లు నడుపుకుని జీవనం సాగించేవారు విలపిస్తున్నారు. ఫ్రీ జర్నీ కావడంతో చిన్న పనికి కూడా మహిళలు ఆర్టీసీ బస్సుల్లోనే వెళ్తున్నారు.
బస్సులలో డబ్బులు చెల్లించి ప్రయాణం చేసే వారికి చాలా ఇబ్బంది ఎదురవుతుంది. రీసెంట్ గా నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఒక వ్యక్తి ఆందోళన చేశాడు. మగవారికి బస్సులో ఒక్క సీటు కూడా దొరకడం లేదంటూ మండిపడ్డాడు. సీట్లన్నీ మహిళలే ఆక్రమిస్తే మేమేలా ప్రయాణం చేయాలంటూ ప్రశ్నించాడు. అంతే కాకుండా బస్సు వెళ్ళకుండా అడ్డుగా నిలబడి తన నిరసన తెలిపాడు. తాజాగా ఓ యువతి బస్టాండ్ లో ఏడుస్తున్న వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. జగిత్యాలకు చెందిన ఆ యువతి కాలేజ్ లో చదువుతుంది. కాలేజీకి ఆమె బస్సులో వెళ్తుంది.
ఫ్రీ జర్నీ వల్ల తనకు రోజు సీటు దొరకట్లేదని కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె కాలేజీకి వెళ్ళేటపుడు 40 నిమిషాలు, తిరిగి ఇంటికి వచ్చేప్పుడు 40 నిమిషాలు పడుతుంది. రోజు బస్సులో సీటు దొరకక గంటకు పైన నిలబడాల్సి వస్తుందని వెక్కి వెక్కి ఏడ్చింది. రోజూ టైమ్ కి కాలేజీకి వెళ్లలేకపోతున్నామని చెప్పింది. ‘బస్సులో ఉచిత ప్రయాణం చేసి నాలాంటి వాళ్లు జర్నీ చేయకుండా చేస్తున్నారు. ఇదే మా ఊరికి చివరి బస్సు, కొత్త బస్సు మాకు కావాలి’ అంటూ ఏడ్చింది. ఆ యువతి ఎక్కే బస్సు పూర్తిగా నిండిపోయి మహిళలు కూడా ఫుడ్ బోర్డ్ పై జర్నీ చేస్తున్నారు.


రవితేజ హీరోగా హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ ఆదివారం హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. భాగ్యశ్రీ చీరకట్టులో ఉన్న ఫోటోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ ఫోటోలో ఆకట్టుకొనేలా కనిపించింది. ప్రస్తుతం ఆమె ఫోటో నెట్టింట్లో వైరల్గా మారింది.
భాగ్యశ్రీ బోర్సే పూణెకు చెందిన నటి, మోడల్. 33 ఏళ్ళ భాగ్యశ్రీ మోడల్ గా రాణిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే నైజీరియాలో లాగోస్ లో చదువుకుంది. ఇండియా తిరిగి వచ్చిన తరువాత బిజినెస్ మేనేజ్మెంట్ డిగ్రీ పూర్తి చేసింది. ఆ టైమ్ లో మోడలింగ్ కెరీర్ గా ఎంచుకుంది. ఒక ఎజెన్సీతో పనిచేసింది. అలా పలు బ్రాండ్లకు భాగ్యశ్రీ అంబాసిడర్ గా పని చేసింది. క్యాడ్బరీ డైరీ మిల్క్ సిల్క్ ప్రకటనతో భాగ్యశ్రీ పాపులర్ అయ్యింది.
రీసెంట్ గా ‘యారియాన్ 2’ తో బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఈ చిత్రంలో రాజ్యలక్ష్మిగా తన నటనతో యూత్ ను ఆకట్టుకుంది. యారియన్ 2 మూవీలో భాగ్యశ్రీ బోర్సే నటన చూసి, హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ మూవీలో హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. మిస్టర్ బచ్చన్ సినిమా నుండి భాగ్యశ్రీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.