బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ఈ ఏడాది పఠాన్, జవాన్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. షారూఖ్ నటించిన లేటెస్ట్ మూవీ డంకీ మరి కొద్ది గంటలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీతో షారూఖ్ హ్యాట్రిక్ అందుకోవాలని ఎదురుచూస్తున్నాడు.
పాపులర్ బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కించిన ఈ చిత్రం కోసం షారూఖ్ ఫ్యాన్స్, సినీ లవర్స్ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ రివ్యూ మరియు బీఎఫ్ఎఫ్సీ సెన్సార్ రిపోర్ట్ కూడా బయటకు వచ్చింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ప్రముఖ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్ లో షారుక్ ఖాన్, తాప్సి జంటగా నటించిన సినిమా డంకీ. ఈ మూవీలో విక్కీ కౌశల్, బోమన్ ఇరానీ, విక్రమ్ కొచ్చర్ మరియు అనిల్ గ్రోవర్ కీలక పాత్రలలో నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్లు ఈ మూవీ పై ఆసక్తిని రేకెత్తించాయి. షారుక్ హీరోగా నటించడం, రాజ్ కుమార్ హిరానీ లాంటి దిగ్గజ దర్శకుడు దర్శకత్వం వహించడంతో ఈ మూవీ పై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ మూవీ డిసెంబర్ 21న ఆడియెన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలో డంకీ ఫస్ట్ రివ్యూ వచ్చింది.
ట్రైలర్ తో మూవీ పై ఆసక్తి ని క్రియేట్ చేసిన, రాజ్ కుమార్ హిరానీ ఆడియెన్స్ అంచనాలను మాత్రం అందుకోలేక పోయాడంటూ టాక్. ప్రధమార్ధం చెత్తగా ఉందని, ఇక ద్వితీయార్ధం ఎమోషనల్ సీన్స్ తో నెట్టుకొచ్చారట. కొన్ని సీన్స్, అలాగే ఎమోషనల్ సీన్స్ ఆడియెన్స్ కదిలిస్తాయని, మిగతాది బోర్ ఫీల్ అయ్యేలా ఉందట. హిరానీ ఎప్పటిలానే ఈ చిత్రంతో కూడా సందేశం ఇచ్చాడట.
మున్నాభాయ్ ఎంబీబీఎస్ నుండి సంజు వరకు అద్భుతమైన చిత్రాలు తీసిన రాజ్ కుమార్ హిరానీ ఈ సినిమా విషయంలో తడబడ్డట్టు సమాచారం. మరో వైపు డంకీ మూవీ పై బీఎఫ్ఎఫ్సీ సెన్సార్ రిపోర్ట్ ఇచ్చింది. ఈ మూవీలో బలమైన హిం-స, లైం-గి-క బెదిరింపులు, భయానక, ఆ-త్మ-హ-త్య, అడల్ట్ కామెడీ మరియు డ్రగ్స్ వంటి అంశాలు ఉన్నాయని షాకింగ్ సెన్సార్ రిపోర్ట్ ఇచ్చింది.
Also Read: సలార్ టిక్కెట్లు కోసం గంటల తరబడి లైన్లో ఉన్నారు… ఓటు వేయమంటే వెయ్యరు…

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ ఎడిషన్ వేలం డిసెంబర్ 19న దుబాయ్‌లోని కోకాకోలా ఎరీనాలో ప్రారంభం అయ్యింది. ఈ వేలంలో 214 మంది భారతీయ ఆటగాళ్లు, 119 విదేశీ ఆటగాళ్లతో కూడిన మొత్తం 333 మంది ఆటగాళ్లు 77 స్లాట్ల కోసం పోటీపడ్డారు. అయితే దుబాయ్ లో నిర్వహించిన ఈ వేలంకు మల్లికా సాగర్ నిర్వాహకురాలుగా వ్యవహరించారు. అయితే ఐపీఎల్ వేలం నిర్వాహకురాలుగా ఓ మహిళను నియమించడం ఇదే మొదటిసారి.
మల్లికా సాగర్‌కు వేలం నిర్వహించడంలో చాలా అనుభవం ఉంది. గతంలో ఆమె మహిళల ప్రీమియర్ లీగ్ నిర్వాహకురాలుగా వ్యవహరించింది. మహిళల ప్రీమియర్ లీగ్ 2003, 2024 సీజన్లతో పాటుగా, ఆమె కబడ్డీ ప్రీమియర్ లీగ్ ఆక్షన్స్ కూడా నిర్వహించారు. ఆమె వేలం నిర్వహించిన తీరు పై పెద్ద ఎత్తున్న ప్రశంసలు వచ్చాయి. దాంతో ఆమెను ఐపీఎల్ వేలంకు సెలక్ట్ చేశారు.
ఆమె ముంబైకి చెందిన వ్యక్తి. ఆమె ఆర్ట్ హిస్టరీ స్టడీస్ ను ఫిలడెల్ఫియాలో బ్రైన్ మావర్ కళాశాలలో పూర్తి చేసింది. 2001లో 26 సంవత్సరాల వయసులో వేలం సంస్థ క్రిస్టీస్‌లో మల్లిక కెరీర్‌ను మొదలుపెట్టింది. క్రిస్టీస్ లో మల్లికా సాగర్ తొలి ఇండియన్ ఆక్షనీర్ గుర్తింపు పొందింది. మల్లికా తన 22 ఏళ్ళ అనుభవంలో అనేక వేలంలు నిర్వహించింది. సమకాలీన భారతీయ ఆర్ట్ వేలంను నిర్వహించిన మొదటి వ్యక్తి మల్లికనే. క్రికెట్ వేలం గురించి ఆక్షనర్ హ్యూ ఎడ్మీడ్స్ వేలం వీడియోలు చూసి నేర్చుకున్నట్లుగా మల్లికా సాగర్ తెలిపారు.









ఐపీఎల్ వేలం ఎప్పడూ సంచలనాలకు కేరాఫ్ గా నిలుస్తుందన్న విషయం తెలిసిందే. ప్రతి వేలంలోనూ గత రికార్డులు బ్రేక్ చేస్తూ వచ్చింది. అలాగే ఈసారి కూడా గత వేలం రికార్డులను బద్దలు కొట్టింది. గత వేలం అత్యధిక ధర రికార్డును ఈసారి ఇద్దరు ఆసీస్ ప్లేయర్లు బ్రేక్ చేశారు. కోల్‌కతా రూ. 24.75 కోట్లకు మిచెల్ స్టార్క్‌ను సొంతం చేసుకోగా, సన్‌రైజర్స్ రూ. 20.50 కోట్లకు కమిన్స్‌ను సొంతం చేసుకుంది. ఎప్పటిలానే ఈసారి కూడా అన్క్యాప్డ్ ప్లేయర్స్ ను ఫ్రాంఛైజీలు కోట్లు పోసి సొంతం చేసుకున్నాయి.
వారిలో ఒకరు శుభమ్ దూబే. రూ. 20 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన శుభమ్ దూబేను రాజస్థాన్ రాయల్స్ రూ.5.8 కోట్లకు కొనుగోలు చేసింది. దాంతో రాత్రికి రాత్రే దూబే కోటీశ్వరుడిగా మారాడు. దూబే విదర్భ జట్టు తరుపున ఆడతాడు. లోయర్ మిడిలార్డర్ బ్యాటర్ అయిన దూబే పవర్ఫుల్ లెఫ్టాండర్ మరియు మంచి ఫినిషర్. రీసెంట్ గా జరిగిన సయ్యద్ ముస్తాక్ టోర్నీలో అద్భుతంగా ఆడిన శుభమ్ దూబే పేరు మారుమ్రోగింది. దాంతో ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీలు దూబే కోసం పోటీ పడ్డాయి. ఫైనల్ గా రాజస్థాన్ రాయల్స్ రూ. 5.80 కోట్లకు దక్కించుకుంది.
రాజస్థాన్ రాయల్స్ జట్టు డైరెక్టర్ ఆఫ్ హై పెర్ఫామెన్స్ జుబిన్ భరూచా శుభమ్ దూబే గురించి మాట్లాడుతూ, విదర్భ నుంచి వచ్చిన దూబే లైఫ్ లో ఉన్న కష్టాలు, క్రికెటర్ యశస్వి జైశ్వాల్‌కు వంటివే అని అన్నారు. శుభమ్ దూబే వద్ద ఈ ఏడాది కనీసం బ్యాట్ కొనడానికి కూడా డబ్బు లేదని చెప్పినట్లుగా వెల్లడించాడు. వేలంలో అతడిని కొనడానికి ప్రయత్నిస్తామని వెల్లడించారు. భరూచా, చెప్పినట్లుగానే రాజస్థాన్ రాయల్స్ దూబేను కొనుగోలు చేసింది.