చాలా మందికి జంతువులు అంటే అమితమైన ఇష్టం.ప్రతిఒక్కరికీ ఇంట్లో ఏదో ఒక జంతువు ఉంటుంది.అందులోనూ విశ్వాసం, ప్రేమ, అభిమానం మాత్రమే చూపించే కుక్కలు, పిల్లులు వంటి జంతువులను పెంచుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. ముఖ్యంగా కుక్కలు ఎటువంటి స్వార్థం లేకుండా యజమాని పట్ల ఎంతో ప్రేమగా, విశ్వాసంగా ఉంటాయి. కుటుంబ సభ్యులలో ఒకరిగా ప్రవర్తిస్తాయి.
పెంపుడు జంతువులను చాలా మంది వ్యక్తులు తమ పిల్లల్లా చూసుకుంటుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో లో బాగా వైరల్ అవుతుంది.ఓ మనిషికి, కుక్కకి మధ్య ఉన్న బంధం చూసి చాలా మంది ఎమోషనల్ అవుతున్నారు. ఇది కదా జంతువులకి మనుషుల మధ్య ఉండే ప్రేమ అంటూ ఆనందం.

ఇంతకీ వైరల్ అవుతున్న వీడియోలో ఏముంది అంటే…. ఓ చిన్న పెంపుడు కుక్క ఇంటి బయట కూర్చునుంది. కారులో నుంచి దిగిన తన యజమానిని చూసి సంతోషంతో తోక ఊపడం ప్రారంభించింది. అతడు దగ్గరకు వస్తున్న కొద్దీ ఆ పప్పీ ఆనందం రెట్టింపైంది. సంతోషంతో గెంతులు వేయడం ప్రారంభించింది. ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి తన పెంపుడు కుక్కను ముద్దు పెట్టుకున్నాడు. ఆ కుక్క కూడా తన యజమానిని చూసిన సంతోషంలో గెంతులు వేసింది. ఒక్కసారి కుక్కని చేరదీస్తే అవి జీవితం మనల్ని మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటాయి.విశ్వాసం చూపిస్తూ ప్రేమను కనబరుస్తాయి.

ఈ ఎమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 7.6 లక్షల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. 2.5 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు చాలామంది మంచి మంచి కామెంట్లు పెట్టారు.. ఎలాంటి షరతులూ లేని ప్రేమ అది, ఆ కుక్క ఎంత సంతోషపడుతోంది, ఆ ప్రేమలో కల్మషం లేదు, ఇలాంటి కుక్కలు ఉన్నప్పుడు ఇంటికి వెళ్లడం గొప్ప అనుభూతి అంటూ కామెంట్స్ చేశారు.మనం ఏదైనా ఒత్తిడిలో ఉన్నప్పుడు మనం పెంపుడు జంతువులతో కాసేపు సమయం వెచ్చిస్తే మన మనసు ఆహ్లాదంగా మారుతుందని వైద్యులు కూడా సూచిస్తున్నారు.
watch video :
Dad coming home from work is the best part of her day… 🥰❤️ pic.twitter.com/OUlCUGiJXd
— B&S (@_B___S) November 17, 2023
Also Read:నన్ను ఎందుకు దూరం పెడుతున్నారు అని భార్య అడిగేసరికి…ఆ భర్త చెప్పిన ఈ ఆన్సర్ కరెక్ట్ అంటారా.?









చిరంజీవి ఎవరి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టి, ఎన్నో కష్టాలు పడి, మెగాస్టార్ గా ఎదిగిన తీరు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. చిరంజీవి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి, స్టార్ హీరోగా ఎదిగి కోట్లాదిమంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నారు. ఆయన అసలు పేరు శివ శంకర వరప్రసాద్. 1955లో పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరులో ఆగష్టు 22న చిరంజీవి జన్మించారు. ఆయనకు చిన్నతనంలోనే నటన పై ఇంట్రెస్ట్ ఏర్పడింది. చదువు పూర్తి చేసుకొని చిరంజీవి 1976లో చెన్నైలో ఉన్న మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరి, నటనలో శిక్షణ తీసుకున్నారు.
చిరంజీవి 1978లో ‘పునాది రాళ్లు’ అనే చిత్రం ద్వారా హీరోగా మారారు. అయితే ఆ మూవీ కన్నా ముందు ‘ప్రాణం ఖరీదు’ అనే మూవీ విడుదల అయ్యింది. ఆ తరువాత బాపు దర్శకత్వంలో నటించిన ‘మనవూరి పాండవులు’ అనే మూవీతో చిరంజీవికి గుర్తింపు వచ్చింది. మోసగాడు, ఇది కథ కాదు, రాణీ కాసుల రంగమ్మ వంటి చిత్రాలలో చిన్న పాత్రలు, విలన్గా కూడా నటించి నటుడిగా చిరంజీవి గుర్తింపు తెచ్చుకున్నాడు.
1980లో చిరంజీవి హీరోగా నటించిన ‘మొగుడు కావాలి’ మూవీ విజయం సాధించి, తొలి సిల్వర్ జూబ్లీ సినిమాగా రికార్డు సృష్టించింది. తమ్మారెడ్డి భరద్వాజ ఈ మూవీని నిర్మించారు. ఆ తర్వాత ‘తిరుగులేని మనిషి’ మూవీలో చిరంజీవి ఎన్టీఆర్ తో కలిసి నటించారు. ఆ తర్వాత వచ్చిన ‘చట్టానికి కళ్లులేవు’ మూవీతో మాస్ హీరోగా మారారు. ఈ మూవీకి కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు.
రామయ్య వీధిలో కృష్ణయ్య, శుభలేఖ సినిమాలతో చిరంజీవి ఫ్యామిలీ ప్రేక్షకులకు చేరువయ్యారు. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఖైదీ మూవీతో ఆయన స్టార్ హీరోగా ఎదిగారు. ఆ తరువాత వరుస సినిమాలు చేస్తూ, ఎన్నో రికార్డులు బ్రేక్ చేస్తూ, మరెన్నో రికార్డులు క్రియేట్ చేస్తూ, టాలీవుడ్ లో ఎదురులేని టాప్ హీరోగా కొనసాగుతున్నారు.






