Ads
2023 వన్డే ప్రపంచ కప్ టోర్నమెంట్ ముగిసింది. ఫైనల్ మ్యాచ్ లో అనూహ్యంగా భారత్ ఓటమి పాలు అయ్యింది. ఆస్ట్రేలియా వరుసగా ఆరోసారి ప్రపంచ కప్పును గెలుచుకుంది. 150 కోట్ల భారత్ అభిమానుల ఆశలన్నీ ఆవిరయ్యాయి. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ భారత్ అభిమానులకు గుండె కొత్త మిగిల్చింది.
Video Advertisement
ఎన్నో అంచనాలతో ప్రపంచ కప్ లోకి అడుగుపెట్టిన భారత్ జట్టు….ఆ అంచనాలు అన్ని నిజం చేస్తూ లీగ్ దశలో బాగా పర్ఫామ్ చేసి సెమీఫైనల్ లో కూడా న్యూజిలాండ్ ను ఓడించి ఫైనల్ కి చేరుకుంది. ఇక ఫైనల్ ఒకటి గెలిస్తే కప్పు మన సొంతం అనుకున్న తరుణంలో ఓటమిపాలై ఆశలన్నీ ఆవిరి చేసింది.
అసలు భారత్ ఓడిపోవడానికి గల ముఖ్య కారణాలను ఒకసారి పరిశీలిస్తే…
1. టాస్ ఓడిపోవడం:టాస్ ఓడిపోవడమే భారత్ కి పెద్ద దెబ్బ అయ్యింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా పిచ్ పరిస్థితులకు తగ్గట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆ పరిస్థితులను క్యాష్ చేసుకున్న బౌలర్లు భారత్ టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ ను పెవిలియన్ కు పంపించారు.
2.టాప్ ఆర్డర్ వైఫల్యం:ఇప్పటివరకు జరిగిన అన్ని లీగ్ మ్యాచ్ లలో బాగా పెర్ఫాన్ చేసిన భారత టాప్ ఆర్డర్,ఫైనల్లోకి వచ్చేసరికి చేతులెత్తేసింది. రోహిత్ శర్మ అవుట్ అవ్వడంతోటే ఆస్ట్రేలియా కి అదును దొరికేసింది. తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్ కూడా వెనువెంటనే ఔట్ అయ్యిపోయారు.
3.కోహ్లీ – రాహుల్ అవుట్ అవ్వడం:భారత్ ఓపెనర్ లందరూ అవుట్ అయి వెళ్లిపోగా కోహ్లీ, కే.ఎల్ రాహుల్ క్రీజ్ లో పుంజుకుని మంచి పార్టనర్ షిప్ తీసుకువచ్చారు. అయితే వారు కూడా అవుట్ అవడంతో భారత్ పెద్ద స్కోర్ చేయలేకపోయింది. వారు గనుక చివర వరకు క్రేజ్ లో ఉంటే భారత్ 300 దాకా స్కోర్ చేసేది.
4. వర్క్ అవుట్ అవ్వని స్ట్రాటజీ:అహ్మదాబాద్ పిచ్ పైన భారత్ టీం అనుకున్న స్ట్రాటజీ అవలేదు. మరోపక్క ఆస్ట్రేలియన్ టీం స్ట్రాటజీ బాగా వర్క్ అయింది.
5. బౌండరీలు లేకపోవడం:రోహిత్ శర్మ ఉండగా ఇండియన్ టీం కి నాలుగు బౌండరీలు వచ్చాయి. తర్వాత ఇన్నింగ్స్ మొత్తం కలిపితే నాలుగు బౌండరీలు మాత్రమే వచ్చాయి.
కొన్ని బౌండరీలు వచ్చి ఉంటే మంచి స్కోర్ వచ్చేది.
6. పెద్ద పార్టనర్ షిప్ లు లేకపోవడం:ఇండియన్ టీం లో పెద్ద మైనస్ ఏంటంటే పెద్ద పెద్ద పార్టనర్ షిప్ లు నమోదు చేయకపోవడం.కోహ్లీ రాహుల్ తప్పితే మంచి పార్టనర్ షిప్ అనేది లేదు.
7. ఆస్ట్రేలియా అగ్రెసివ్ బ్యాటింగ్:సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ దిగిన ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ లు అగ్రెసివ్ బ్యాటింగ్ చేశారు ఎక్కడ కూడా ఇండియన్ బౌలర్ కి ఛాన్స్ ఇచ్చింది లేదు. హెడ్ ఒక్కడే టీమ్ ని ఒంటి చేత్తో గెలిపించేసాడు.
8. డ్యూ ఫ్యాక్టర్:సెకండ్ ఇన్నింగ్స్ లో డ్యూ ఫ్యాక్టర్ అనేది ఆస్ట్రేలియాకి బాగా కలిసి వచ్చింది. దాంతో బంతి బ్యాట్ మీదకి రావడంతో మంచి పనులు చేయగలిగారు.
ఏదేమైనా ఇండియన్ టీం అయితే మంచి ప్రదర్శన కనబరిచింది. ఎవరికి పేరు పెట్టడానికి లేదు. అయితే మనమే ఇంత బాధ పడుతుంటే 11 మంది ప్లేయర్లు ఎంత బాధ పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇండియన్ టీంకి150 కోట్ల భారత అభిమానుల మద్దతు ఎప్పుడు ఉంటుంది.
Also Read:చివరికి ఈ ఆస్ట్రేలియా కెప్టెన్ అన్నట్టుగానే చేసాడుగా.? క్రౌడ్ విషయంలో అలాగే జరిగింది.!
End of Article