Ads
ఆస్ట్రేలియా టీం అంటే అగ్రేషన్ కి పెట్టింది పేరు. కానీ కొన్ని కొన్ని సార్లు ఆగ్రేషన్ కూడా గీత దాటి వెళ్లి ఆరోగెన్స్ గా మారుతుంది. 2000 నుంచి 2007 సంవత్సరం వరకు ఆస్ట్రేలియా టీం కి రిక్కీ పాంటింగ్ కెప్టెన్ గా ఉన్నాడు. అయితే అప్పటి వాళ్ళ బిహేవియర్ కారణంగా ఎన్నో విమర్శలు మూటగట్టుకున్నారు. 1998లో ఆస్ట్రేలియా కి వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ స్టీవ్ వాగ్ నుండి రిక్కీ పాంటింగ్ కెప్టెన్సీ తీసుకున్న దగ్గర నుండి దూకుడుగా ఉండేవాడు.
Video Advertisement
ఇతనితోపాటు మాథ్యూ హెడెన్, ఆడం గిల్క్రిస్ట్ లాంటి వారు కూడా దూకుడుగా వ్యవహరిస్తూ వాళ్ళంతట వాళ్లే స్లెడ్జింగ్ కూడా పాల్పడేవారు. అలాంటి ఒక ఘటనే 2006 ఛాంపియన్స్ ట్రోఫీ అప్పుడు చోటుచేసుకుంది.
2006లో ముంబై వేదిక వెస్టిండీస్ కి ఆస్ట్రేలియా కి మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. అప్పుడు ఆస్ట్రేలియా టీం కి అప్పటి బీసీసీఐ చైర్మన్ శరద్ పవార్ ట్రోఫీ అందించడానికి స్టేజ్ మీదకు వచ్చాడు. అప్పటికి ఇంకా ట్రోఫీ ఇవ్వకపోవడంతో రిక్కీ పాంటింగ్ వేలు చూపిస్తూ ట్రోఫీ ఇవ్వాలంటూ సైగ చేశాడు. శరద్ పవార్ ట్రోఫీ ఇచ్చాక ఫోటోలు దిగాలంటు పాంటింగ్ స్టేజ్ మీద నుండి కిందకి గెంటాడు.
I think you got the wrong clip. pic.twitter.com/Jpw4vbnxrg
— Pinch Reporter (@uniqueYS13) November 20, 2023
అప్పటి పాంటింగ్ బిహేవియర్ చాలా విమర్శలు మూటగట్టుకుంది. ఈ ఘటన పైన శరద్ పవార్ స్పందిస్తూ అది ఒక స్టుపిడ్ థింగ్ అంటూ తీసి పడేశారు.అప్పుడు టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ఉన్న దిలీప్ వెంగాస్కర్ స్పందిస్తూ ఇలాంటి బిహేవియర్ ని కేవలం అన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ నుండి మాత్రమే ఎక్ష్పెక్ట్ చేస్తామంటూ కామెంట్ చేశారు.అయితే అప్పటి ఆస్ట్రేలియా బిహేవియర్ కి ప్రతీకారం నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్ లో తీర్చుకున్నారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ కి నరేంద్ర మోడీ ట్రోఫీ అందించి తర్వాత కిందికి దిగి వెళ్లారు. ట్రోఫీ ఇచ్చే సమయంలో ఆస్ట్రేలియన్ టీం ఎవ్వరిని స్టేజ్ మీదకి రానివ్వలేదు. ట్రోఫీ తీసుకున్నాక కెప్టెన్ చాలా సేపు దిక్కులు చూస్తూ నిల్చున్నాడు. నరేంద్ర మోడీ అందరికీ విషెస్ చెప్పి వెళ్లాక గాని ఎవరిని ఫోటో సెషన్ కి అలో చేయలేదు.ఆస్ట్రేలియన్ టీం కి బాగా బుద్ధి చెప్పారు అంటూ పలువురు ప్రశంసిస్తున్నారు.
Watch Video:
This is the unedited clip! pic.twitter.com/xUgVJTLSTV
— Abhinav Prakash (@Abhina_Prakash) November 19, 2023
ALSO READ : “ఆస్ట్రేలియా”తో వరల్డ్ కప్ ఫైనల్ లో ఇండియా ఓడిపోవడానికి 10 కారణాలు ఇవే…ఆ స్ట్రాటజీ పని చేయలేదు.!
End of Article