ఈ 4 “వరల్డ్ కప్ విన్నర్ కెప్టెన్స్” మధ్య… ఈ కామన్ పాయింట్ గమనించారా..? అది ఏంటంటే..?

ఈ 4 “వరల్డ్ కప్ విన్నర్ కెప్టెన్స్” మధ్య… ఈ కామన్ పాయింట్ గమనించారా..? అది ఏంటంటే..?

by Mounika Singaluri

Ads

2023 క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీ నిన్నటితో ముగిసింది. ఆస్ట్రేలియా వరుసగా ఆరోసారి ప్రపంచ కప్ విన్నర్ గా నిలిచింది. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ట్రోఫీని తీసుకుని సహచరులతో కలిసి సంబరాలు చేసుకున్నాడు. అయితే ఇప్పటివరకు ఒకసారి వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ లిస్ట్ తిరిగేస్తే అందరి మధ్య ఒక కామన్ పాయింట్ కనిపిస్తుంది. నిన్నటి వరకు ఫైనల్ మ్యాచ్ ముందు కూడా ఈ కామన్ పాయింట్ ను చాలామంది ఇంటర్నెట్ లో వైరల్ చేశారు.

Video Advertisement

ఆ పాయింట్ ప్రకారం చూస్తే ఆస్ట్రేలియా కప్పు కొడుతుందని చాలామంది చెప్పారు. కానీ ఇది అసలు జరగని పని అని కొందరైతే కొట్టి పడేసారు గానీ చివరికి దాని లెక్క ప్రకారం చూస్తే ఆస్ట్రేలియ నే కప్పు గెలిచింది.

worldcup captains ఇంతకీ ఆ కామన్ పాయింట్ ఏంటంటే వరల్డ్ కప్ గెలిచే కెప్టెన్ కి అంతకు ముందు సంవత్సరం పెళ్లయి ఉండడం… ఇది ఇప్పటివరకు జరిగిన అన్ని వరల్డ్ కప్స్ కి వర్తించింది.

1. రిక్కీ పాయింటింగ్:

2003లో ఆస్ట్రేలియా వరల్డ్ కప్ నెగ్గింది .అప్పుడు ఆస్ట్రేలియా టీం కెప్టెన్గా రీక్కీ పాయింటింగ్ ఉన్నాడు. 2002లోనే రిక్కీ పాయింటింగ్ పెళ్ళి జరిగింది.

3.ఎంఎస్ ధోని:

2011లో ఇండియా వరల్డ్ కప్ నెగ్గింది. అప్పటి ఇండియన్ టీం కెప్టెన్ గా ఎంఎస్ ధోని ఉన్నాడు. ధోని పెళ్లి 2010లో సాక్షి తో జరిగింది.

3. మోర్గాన్:

2019లో ఇంగ్లాండ్ వరల్డ్ కప్ నెగ్గింది. అప్పటి ఇంగ్లాండ్ టీం కెప్టెన్ గా మోర్గాన్ ఉన్నాడు.అతని పెళ్లి 2018 లో జరిగింది.

4.పాట్ కమ్మిన్స్:

pat cummins

ఇప్పుడు 2023 లో ఆస్ట్రేలియా కప్పు నెగ్గింది. అయితే ఇప్పటి ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ పెళ్లి 2022లో జరిగింది.ఇప్పుడు ఇది ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. దీన్ని అదునుగా చేసుకుని చాలామంది భారత అభిమానులు 2027లో ఇండియా కప్ నెగ్గలి అంటే అప్పటి కెప్టెన్ కి 2026 లో పెళ్లి చేయాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇది యాదృచ్ఛికంగానే జరిగింది తప్ప దీన్ని నమ్ముకుంటే ఇక ప్లేయర్లు కష్టపడి ఆడాల్సిన పని ఏముంది అంటూ మరికొందరు వాదన విడిపిస్తున్నారు. ఫైనల్ మ్యాచ్ కి ముందు ఎన్నో ప్రిడిక్షన్ లు తీసుకోవచ్చారు. ఎన్ని కంపేరిజన్ లు వచ్చిన కూడా ఫైనల్ లో రాణించిన టీం కి కప్పు దక్కుతుంది.

 

Also Read:ఈ ప్లేయర్ ఉండి ఉంటే… కచ్చితంగా కప్ కొట్టే వాళ్ళం ఏమో..?


End of Article

You may also like