2023 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఇండియన్ ఓపెనర్ శుభ్ మన్ గిల్ ప్రదర్శన అభిమానులను బాగా నిరాశపరిచింది. రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ దిగి బాగా పెర్ఫార్మ్ చేసేవాడు. ఒక పక్క నుండి రోహిత్ కి సహకారం అందిస్తూనే మంచి పరుగులు రాబట్టేవాడు. అయితే నిన్న జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో గిల్ నాలుగు పరుగులకే అవుట్ అయిపోయాడు. స్టార్క్ బౌలింగ్ లో జంపాకి క్యాచ్ ఇచ్చి పేవిలియన్ కి చేరుకున్నాడు.

Video Advertisement

అయితే ఇప్పుడు గిల్ ఔట్ అయిన విధానం చూసి చాలామంది సచిన్ తో కంపేర్ చేస్తున్నారు. ఇంతకీ ఆ కంపేరిజన్ ఎందులో అంటే 2003 ప్రపంచ కప్ ఫైనల్లో కూడా ఇండియా ఆస్ట్రేలియా తో తలపడింది. అప్పుడు సచిన్ టెండూల్కర్ ఓపెనర్ గా బరిలోకి దిగి నాలుగు పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. మెక్ గ్రత్ బౌలింగ్ లో క్యాచ్ అవుట్ అయ్యాడు.

score card

ఇప్పుడు అందరూ కూడా ఇదే కంపారిజన్ చేస్తున్నారు. 2003లో సచిన్ ఏ విధంగా అవుట్ అయ్యాడో 2023 లో గిల్ అదే విధంగా ఔట్ అయ్యాడని అంటున్నారు. ఈ కంపారిజన్ అంతా ఎందుకు తీసుకొస్తున్నారు అంటే గిల్, సచిన్ టెండూల్కర్ కూతురు సారా ఇద్దరూ లవ్ లో ఉన్నారనే వార్త బయట చెక్కర్లు కొడుతుంది. అదే నిజమైనట్టు గిల్ ఆడిన ప్రతిసారి సారా స్టేడియం కొచ్చి ఎంకరేజ్ చేస్తూ కనిపించేది. గిల్ మంచి ప్రదర్శన చేసినప్పుడు కెమెరా మెన్ కూడా సారని ఫోకస్ చేసేవాడు. ఒకసారి ఇన్నింగ్స్ లో అయితే గిల్ ఫీల్డింగ్ చేస్తుండగా అభిమానులు సారా సారా అంటూ అరవగా విరాట్ కోహ్లీ వారిని కంట్రోల్ చేశాడు.

ఇప్పుడు ఇదే అదునుగా చేసుకుని అభిమానులు ఇంటర్నెట్ లో అప్పటి ఫోటోలను ఇప్పటి ఫోటోలను వైరల్ చేస్తున్నారు. అప్పుడు మామ సచిన్ నాలుగు పరుగులకే ఔట్ అయ్యాడు. ఇప్పుడు అల్లుడు గిల్ కూడా నాలుగు పరుగులకే అవుట్ అయ్యాడు అని కామెంట్లు పెడుతున్నారు.ఈ కంపేరిజన్ ఎలాగ ఉన్నా కూడా నాలుగు పరుగుల వద్ద అవుట్ అయినప్పుడు గిల్ బాగా నిరాశ చెందాడు. మంచి పెర్ఫార్మెన్స్ చేద్దామనుకున్న యువ ఆటగాడికి అలా అవుట్ అవ్వడం చాలా బాధ అనిపిస్తుంది. గిల్ మొహం చూసిన ఎవరికైనా అది స్పష్టమైనది.

 

Also Read:2006 లో ఆస్ట్రేలియా వాళ్ళు చేసిన దానికి… ఇప్పుడు మన వాళ్ళు పగ తీర్చుకున్నారా..? అసలు విషయం ఏంటంటే..?