2023 ప్రపంచ కప్ ఫైనల్ లో భారత్ పై విజయం సాధించిన ఆస్ట్రేలియా టీం లో కీలక పాత్ర పోషించింది మాత్రం బ్యాట్స్ మెన్ ట్రవిస్ హెడ్.తుది పోరులో 120 బంతుల్లో అతడు 137 పరుగులు చేయగా, అందులో 15 ఫోర్లు, నాలుగు సిక్స్‌లు ఉన్నాయి. ఫైనల్లో అతడే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌’.గా నిలిచాడు.ప్రపంచ కప్‌ ఫైనల్లో రికీ పాంటింగ్, ఆడమ్ గిల్‌క్రిస్ట్ తరువాత సెంచరీ చేసిన మూడో ఆస్ట్రేలియన్‌గా ట్రావిస్ హెడ్ రికార్డుల్లోకెక్కాడు.

Video Advertisement

వేలికి గాయం కారణంగా ప్రపంచ కప్‌లో మొదటి నాలుగు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. తర్వాత మ్యాచ్‌లకు అందుబాటులోకి వచ్చి న్యూజీలాండ్‌‌పై సెంచరీతో సత్తా చాటాడు.

head

సెమీఫైనల్లో కూడా దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా విజయం సాధించడం లో అతడు కీలక పాత్ర పోషించాడు. చేజింగ్‌లో 48 బంతుల్లో 62 పరుగులు చేసి జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రెండు వికెట్లు కూడా తీసి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’. అవార్డ్ పొందాడు.ఫైనల్ ఆస్ట్రేలియా మూడు వికెట్లు కోల్పోయి కష్ట సమయంలో ఉండగా హెడ్ మాత్రం నిలకడగా ఆడి ఒంటి చేత్తో టీం ని గెలిపించాడు.మార్నస్ లబుషేన్ తో కలిసి 192 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి లక్ష్యం దిశగా సాగిపోయడు.

భారత్‌పై ఆస్ట్రేలియా ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ గెలవడంలోనూ హెడ్ కీలక పాత్ర పోషించాడు. లండన్‌లోని ఓవల్ మైదానంలో జరిగిన ఆ మ్యాచ్‌లో 163 పరుగులు చేసి, టాప్ స్కోరర్‌‌గా నిలిచాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌’గా కూడా నిలిచాడు మళ్లీ ఇలాంటి అద్భుత ప్రదర్శనను రిపీట్ చేస్తూ, ఇప్పుడు వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.ఆదివారం ఫైనల్ ముగిశాక ట్రావిస్ హెడ్ మాట్లాడుతూ, “ఇది అద్భుతమైన రోజు. ఇందులో నేను భాగమైనందుకు థ్రిల్లింగ్‌గా అనిపిస్తోంది’’ అని చెప్పాడు.

 

Also Read:ఈ 4 “వరల్డ్ కప్ విన్నర్ కెప్టెన్స్” మధ్య… ఈ కామన్ పాయింట్ గమనించారా..? అది ఏంటంటే..?