ప్రముఖ బుల్లితెర యాంకర్ ఓంకార్ డైరెక్టర్ గా మారి రాజు గారి గది సిరీస్ తో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. ఇప్పుడు మళ్లీ అదే జోనర్ లో అందర్నీ భయపెట్టడానికి మాన్షన్ 24 అనే వెబ్ సిరీస్ డైరెక్ట్ చేశాడు. తాజాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఆరు ఎపిసోడ్లుగా ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో రివ్యూ చూద్దాం….!
టీజర్, ట్రైలర్ల నుండి ఆకట్టుకున్న మాన్షన్ 24 వెబ్ సిరీస్ లో స్టార్ క్యాస్టింగ్ ఏ ఉంది. వరలక్ష్మి శరత్ కుమార్, సత్యరాజ్, రావు రమేష్, తులసి, అవికా గోర్, మానస్ నాగులపల్లి, రాజీవ్ కనకాల లాంటి సీనియర్ యాక్టర్లను సిరీస్ మొత్తం నింపేసాడు ఓంకార్ అన్నయ్య.

ఇంక కథ విషయానికొస్తే అమృత (వరలక్ష్మి శరత్ కుమార్) ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. అమృత తండ్రి కాళిదాస్ (సత్యరాజ్) పురావస్తు శాఖలో పనిచేస్తూ తవ్వకాల్లో దొరికిన విలువైన సంపదతో పారిపోయాడని కథనాలు పుట్టుకొస్తాయి. అతనిపై దేశద్రోహి అన్న ముద్ర కూడా పడుతుంది. అమృత కుటుంబం పైన సమాజం మానసిక దాడి చేస్తుంది. అమృత తల్లి (తులసి)హాస్పిటల్ పాలవుతుంది. అయితే అమృత మాత్రం ధైర్యంగా తన తండ్రి దేశద్రోహి కాదని ఒక నిజాయితీపరుడని అతని కూతుర్ని తాను అంటుంది.

అతని తండ్రిని నిర్దోషిగా నిరూపించాలని అతను చివరిగా వెళ్లిన ఊరికి ఉత్తరాన ఉన్న ఒక కొండపైన మాన్షన్ కి వెళ్తుంది. అక్కడ అమృతకి ఊహించని పరిస్థితులు ఎదురవుతాయి. ఆ పరిస్థితులు ఏంటి ?అమృత వాటిని ఏలా ఎదుర్కొంది. ఆ మాన్షన్ లో నిజంగా దెయ్యాలు ఉన్నాయా? అవే కాళిదాసుని చంపేశాయ? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే మాన్షన్ 24 సిరీస్ ను పూర్తిగా చూడాల్సిందే.

నటీనటుల పరిశీల విషయానికొస్తే వరలక్ష్మీ శరత్ కుమార్ నటనకు పేరు పెట్టడానికి ఏమీ లేదు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా బాగా చేసింది. క్లైమాక్స్ లో తన నట విశ్వరూపం చూపించింది. రావు రమేష్ నిడివి తక్కువ ఉన్న పాత్రలో నటించారు. సత్యరాజ్ పాత్ర చుట్టూ కథ తిరిగిన కూడా అంత ప్రాధాన్యత ఉండదు. మిగతా నటీనటులందరూ తమ పరిధిలో బాగానే నటించారు.

టెక్నీషియన్స్ విషయంలో మొదటగా మాట్లాడుకోవాల్సింది ఓంకార్ అన్నయ్య గురించి. రాజు గారి గది సీక్వెల్స్ హిట్ అయ్యింది అంటే దానికి ప్రధాన బలం కామెడీ. ఈ మాన్షన్ 24 లో ఓంకార్ అన్నయ్య కామెడీనే పక్కన పెట్టేసాడు. సీరీస్ ను కొత్తగా ప్రజెంట్ చేయడానికి బాగానే ట్రై చేశాడు. హర్రర్ సిరీస్ కి ట్విస్టులే కీలకం, ఈ సిరీస్ లో త్రిల్లింగా అనిపించే అంశాలు ఏమీ పెద్దగా ఉండవు.

పాటలను అనవసరంగా ఇరికించిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా సీరీస్ కు తగ్గట్టు ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే. ఫైనల్ గా చూస్తే ఈ మాన్షన్ 24 కొన్ని చోట్ల భయపెట్టింది. కొన్ని చోట్ల బోర్ కొట్టిస్తుంది. కాకపోతే బాగా ఎంగేజ్ చేస్తుంది.హర్రర్ సిరీస్ లను ఇష్టపడే ప్రేక్షకులు ఈ మాన్షన్ 24 పైన ఒక లుక్కు వెయ్యొచ్చు.
ALSO READ : సైలెంట్ గా రిలీజ్ అయిన విజయ్ ఆంటోనీ కొత్త సినిమా..! ఎలా ఉందంటే..?














సంగీత దర్శకుడిగా, నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా, మల్టీటాలెంటెడ్ స్కిల్స్ ఉన్నవ్యక్తి విజయ్ ఆంటోనీ. బిచ్చగాడు సినిమాలతో తెలుగులో కూడా అభిమానులను సంపాదించుకున్నాడు. ఆయన లేటెస్ట్ తమిళ మూవీ రత్తం అక్టోబర్ 6న రిలీజ్ అయ్యింది. ఈ చిత్రంలో నందితాశ్వేత, మహిమా నంబియార్, రమ్య నంబీశన్ కీలక పాత్రలలో నటించారు.
ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే, స్టోరీ పరంగా రత్తం కొంచెం డిఫరెంట్ లైన్. కోల్‌కతాలో గుర్రాల కాపరిగా పని చేస్తుంటాడు రంజిత్(విజయ్ ఆంటోనీ). గతంలో తనకు మీడియా గురువు అయిన రత్నం పాండియన్ (నిళల్ గళ్ రవి) కుమారుడు హ-త్య-కు గురవుతాడు. గురువు ఈ కేసును సాల్వ్ చేసేపనిని రంజిత్ కు అప్పగిస్తాడు. రంజిత్ చెన్నైకి వచ్చి ఆయన సంస్థలోనే జాయిన్ అవుతాడు.
మధుమిత(నందిత దాస్) దగ్గర అప్రెంటీస్ గా చేరి, ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టగా, అలాంటి హత్యలే రాష్ట్రంలో చాలా జరిగాయనే విషయం తెలుస్తుంది. మరి ఈ హ-త్య-ల వెనుక ఉన్న వ్యక్తి ఎవరు? ఎలాంటి ఆధారాలు లేకుండా దొరకకుండా చేస్తున్నది ఎవరు? ఈ మ-ర్డ-ర్స్ ఎందుకు చేస్తున్నారు? ఈ కేసును ఛేదించే క్రమంలో రంజిత్‌కు ఎటువంటి పరిణామాలు ఎదురయ్యాయి? రంజిత్ జర్నలిజం వృత్తికి ఎందుకు దూరంగా వెళ్ళాడు అనేది మిగిలిన కథ.
మైండ్‌గేమ్‌తో హీరో మరియు విలన్ ఒకరి పై ఒకరు వేసే ఎత్తులతో ఈ చిత్రం సాగుతుంది. ఈ మూవీలో ఇన్వేస్టిగేటివ్ జర్నలిస్ట్ రంజిత్‌కుమార్ గా విజయ్ ఆంటోనీ సీరియస్ పాత్రలో మెప్పించాడు. మహిమా నంబియార్ నటన ఆకట్టుకుంటుంది. రత్తం మూవీ ఒక విభిన్నమైన క్రైమ్ థ్రిల్లర్. కథతో పాటుగా విలన్ క్యారెక్టర్ కొత్తగా అనిపిస్తుంది. ఓపికగా చూడగలిగిన వారికి కొత్త అనుభూతిని ఇస్తుంది.

బుల్లితెర సెలెబ్రిటీలు శ్రీవాణి, విక్రమాదిత్య జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఈ జంట ‘మీ కడపునిండా’ అనే రెస్టారెంట్‌ను మొదలుపెట్టారు. ఈ రెస్టారెంట్ ఓపెనింగ్ కు ఏపీ మంత్రి రోజాను ఆహ్వానించారు. రోజా చేతుల మీదుగా ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. చాలా రోజులుగా బుల్లితెరకు దూరంగా ఉన్న రోజా, అక్కడికి వచ్చిన టెలివిజన్ సెలెబ్రిటీలతో సరదాగా ముచ్చటించారు. మీడియాతో కూడా మాట్లాడిన ఆమె వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం తెలిపారు.
రోజా మాట్లాడుతూ తనకు ఇష్టమైన వంటకాలు, డైట్ ప్లాన్ గురించి వెల్లడించారు. తనకు నాన్ వెజ్ ఎక్కువ ఇష్టమని, రొయ్యల ఇగురు, కీమల ఉండలు, పీతల ఫ్రై, చేపల పులుసు చాలా ఇష్టమని తెలిపారు. ఇక తన డైట్ ప్లాన్ గురించి కూడా చెప్పుకొచ్చారు. ప్రతి రోజూ ఉదయం ఓట్స్, దానిలో డ్రై ఫ్రూట్స్, ఆపిల్స్ కలిపి తింటానని తెలిపారు. ఇక మధ్యాహ్న భోజనంలో మాత్రం నాన్ వెజ్ తప్పనిసరని అన్నారు. కార్తీకమాసం లేదా దేవాలయానికి వెళ్లిన సమయంలో మాత్రం నాన్ వెజ్ తీసుకోనని తెలిపారు.
డిన్నర్ సమయంలో ఇడ్లీ లేదా దోశ లాంటి అల్పాహారాన్ని తీసుకుంటానని చెప్పుకొచ్చారు. విక్రమాదిత్య, శ్రీవాణి, కొత్త రెస్టారెంట్ ఓపెనింగ్ వేడుకలో టెలివిజన్ నటినటులు సందడి చేశారు. వీరిద్దరూ పలు సీరియల్స్, రియాల్టీ షోలు, ఈవెంట్లు, వారి సొంత యూట్యూబ్ ఛానెల్ ద్వారా అలరిస్తూ, బాగా సంపాదిస్తున్నారు. తాజాగా మొదలుపెట్టిన ఫుడ్ బిజినెస్‌లోనూ విజయం సాధించాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ప్రముఖ హాస్యనటుడు అలీ సినిమాలతో పాటుగా, బుల్లితెర పై పలు షోలలో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. ఆయన తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో నటించి, పాపులర్ అయ్యారు. పలు టెలివిజన్ షోలకు హోస్ట్ గా చేసిన అలీ పారితోషికం కూడా భారీగానే ఉందనే విషయం తెలిసిందే. ఆయన సతీమణి జుబేదా కూడా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు.
యూట్యూబ్ లో సొంత ఛానెల్ ప్రారంభించిన జుబేదా తక్కువ కాలంలోనే ఫేమస్ అయ్యారు. తన ఛానెల్ లో ఎక్కువగా వంటల వీడియోలు మరియు హోం టూర్ వీడియోలు అప్ లోడ్ చేస్తుంటారు. నటుడు అలీ, జుబేదా ఇద్దరు తాము సంపాదించిన దాని నుండి కొంత డబ్బుతో సేవా కార్యక్రమాల కూడా చేస్తుంటారు. ఏడు రోజుల క్రితం జుబేదా తన ఛానెల్ లో ఎగ్ ధమ్ బిర్యానీ వంటకాన్ని తయారు చేశారు. వంట పూర్తయ్యాక దానిని ప్యాక్ చేసి, కొంతమంది పేదవారికి పంచిపెట్టారు.
ఈ వీడియోకి ఏకంగా మిలియన్ పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో మరియు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజెన్లు జుబేదా చేసిన మంచి పనికి ఫిదా అవుతున్నారు. ఆమె ఇలాగే పేదలకు సహాయం చేయాలని కామెంట్లు చేస్తున్నారు. చాలా మందికి జుబేదా స్పూర్తిగా నిలిచారని కొందరు నెటిజెనలు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు అలీ కెరీర్ లో మరింత విజయాన్ని సాధించాలని కామెంట్స్ చేస్తున్నారు.