“రోజా” ప్రతిరోజు ఎలాంటి ఆహారం తీసుకుంటారో తెలుసా..? ఆమె డైట్ ప్లాన్ ఎలా ఉంటుంది అంటే..?

“రోజా” ప్రతిరోజు ఎలాంటి ఆహారం తీసుకుంటారో తెలుసా..? ఆమె డైట్ ప్లాన్ ఎలా ఉంటుంది అంటే..?

by kavitha

Ads

ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా, ఆ తరువాత జబర్దస్త్ జడ్జ్‌గా, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మినిస్టర్ గా కొనసాగుతున్నారు  రోజా. ఆమె గురించి అందరికీ తెలిసిందే. సినిమాలకు, బుల్లితెరకు వీడ్కోలు చెప్పిన రోజా, తాజాగా టివి సెలెబ్రిటీలు  శ్రీవాణి, విక్రమాదిత్యల ఫుడ్ బిజినెస్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొని, వారి రెస్టారెంట్‌ను ప్రారంభించారు.

Video Advertisement

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మినిస్టర్ రోజా, వారు అడిగిన ప్రశ్నలకు సరదాగా జవాబు చెప్పారు. అలాగే ఇష్టమైన వంటకాలు, డైట్ ప్లాన్ గురించి కూడా రోజా వెల్లడించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.. బుల్లితెర సెలెబ్రిటీలు శ్రీవాణి, విక్రమాదిత్య జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఈ జంట ‘మీ కడపునిండా’ అనే రెస్టారెంట్‌ను మొదలుపెట్టారు. ఈ రెస్టారెంట్‌ ఓపెనింగ్ కు ఏపీ మంత్రి రోజాను ఆహ్వానించారు. రోజా చేతుల మీదుగా ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. చాలా రోజులుగా బుల్లితెరకు దూరంగా ఉన్న రోజా, అక్కడికి వచ్చిన టెలివిజన్ సెలెబ్రిటీలతో సరదాగా ముచ్చటించారు. మీడియాతో కూడా మాట్లాడిన ఆమె వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం తెలిపారు.
రోజా మాట్లాడుతూ తనకు ఇష్టమైన వంటకాలు, డైట్ ప్లాన్ గురించి వెల్లడించారు. తనకు నాన్ వెజ్ ఎక్కువ ఇష్టమని, రొయ్యల ఇగురు, కీమల ఉండలు, పీతల ఫ్రై, చేపల పులుసు చాలా ఇష్టమని తెలిపారు. ఇక తన డైట్ ప్లాన్ గురించి కూడా చెప్పుకొచ్చారు. ప్రతి రోజూ ఉదయం ఓట్స్, దానిలో డ్రై ఫ్రూట్స్, ఆపిల్స్ కలిపి తింటానని తెలిపారు. ఇక మధ్యాహ్న భోజనంలో మాత్రం నాన్ వెజ్ తప్పనిసరని అన్నారు. కార్తీకమాసం లేదా దేవాలయానికి వెళ్లిన సమయంలో మాత్రం నాన్ వెజ్ తీసుకోనని తెలిపారు.
డిన్నర్ సమయంలో ఇడ్లీ లేదా దోశ లాంటి అల్పాహారాన్ని తీసుకుంటానని చెప్పుకొచ్చారు. విక్రమాదిత్య, శ్రీవాణి, కొత్త రెస్టారెంట్ ఓపెనింగ్ వేడుకలో టెలివిజన్ నటినటులు సందడి చేశారు. వీరిద్దరూ పలు సీరియల్స్, రియాల్టీ షోలు, ఈవెంట్లు, వారి సొంత యూట్యూబ్ ఛానెల్ ద్వారా అలరిస్తూ, బాగా సంపాదిస్తున్నారు. తాజాగా మొదలుపెట్టిన ఫుడ్ బిజినెస్‌లోనూ విజయం సాధించాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Also Read: “రోజా, సెల్వమణి” పెళ్లి ఫోటోలు చూశారా..? వారి పెళ్లి ఎప్పుడు జరిగింది అంటే..?


End of Article

You may also like