యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన ఆదిపురుష్ మూవీ రిలీజ్ అయ్యి సంచలన విజయాన్ని సాధిస్తుందని ఆశించినవారిని నిరాశపరిచింది. అది మాత్రమే కాకుండా తీవ్రమైన విమర్శలను, వివాదాలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. రిలీజ్ కు ముందు ఎంత హైప్ ఉందో, రిలీజ్ తరువాత అంతగా వివాదాలను తెచ్చుకుంది.
ఇక సోషల్ మీడియాలో ఆదిపురుష్ గురించి చర్చ ఎక్కువగా జరుగుతోంది. సామాన్యుల నుండి ప్రముఖుల వరకు రామాయణం ను అపహాస్యం చేశారని అంటున్నారు. అయితే కొందరు మాత్రం మూవీ యూనిట్ ను సమర్ధిస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ప్రభాస్, కృతి సనన్ లు సీతారాములుగా నటించిన ఈ చిత్రాన్ని తానాజీ వంటి బ్లాక్ బస్టర్ ను తెరకెక్కించిన దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించారు. 500 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ గా రూపొందించామని, రిలీజ్ కు ముందు మేకర్స్ అన్నారు. కానీ మూవీ రిలీజ్ అయిన తరువాత విజువల్ ఎఫెక్ట్స్ పైనా, పాత్రల వస్త్రధారణ పైన, ముఖ్యంగా రావణుడి పత్ర చిత్రీకరణ పైన తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. లంక సెట్ ను కూడా హాలీవుడ్ సినిమాల నుండి కాపీ చేశారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
రావణుడు వాహనంగా ఉపయోగించిన పక్షిని, రావణాసురుడి పది తలలను ఒకేవరుసలో చూపించకుండా ఒకదాని పైన మరొక వారుసను చూపించడాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు. అయితే ఈ విషయం గురించి సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ప్రభాస్ రాజు ఫ్యాన్ పేజ్ లో పోస్ట్ చేసిన ఈ వీడియో రావణాసురుడి తలలను అలా చూపించడాన్ని సపోర్ట్ చేసినట్లుగా ఉంది. ఆ వీడియోలో “మనకు తెలిసిన సింపుల్ విషయం.
అన్ని వందల కోట్లు పెట్టి సినిమా తీసిన దర్శకుడు ఓం రౌత్ కు తెలియదనుకోవాలా? అయితే దానికి కూడా ఒక ఆధారం ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన అంగ్కోర్ వాట్ టెంపుల్ గోడలపై రావణుడి దశకంఠ రూపం 10 తలలు అడ్డంగా ఒకేవరుసలో కాకుండా త్రికోణాకారంలో 3 అంచెలలో అమర్చబడి కనిపిస్తాయి. ఆదిపురుష్ సినిమాలో అంగ్కోర్ వాట్ టెంపుల్ గోడలపై ఉన్నట్టుగానే చూపించారు” అని చెప్పుకొచ్చారు.
https://www.instagram.com/reel/CtrTptCpGw-/?igshid=NjZiM2M3MzIxNA%3D%3D
Also Read: రావణుడు సీతని తీసుకెళ్ళేటప్పుడు గాలిలోనే ఎందుకు తీసుకెళ్ళాడు? తాకకపోవడానికి కారణం ఇదే.!

అనారోగ్యంతో హాస్పటల్ చేరిన గద్దర్, గుండెకు సంబంధించిన ఆపరేషన్ విజయవంతంగా జరిగినప్పటికీ, గతంలో ఆయకు ఉన్న లంగ్స్ సమస్య కారణంగా తిరిగి కోలేక, అపోలో హాస్పటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే ఆయన మరణించక ముందు జులై 31న తెలంగాణ ప్రజలను ఉద్దేశించి బహిరంగ లేఖ రాశారు. హాస్పటల్ ఉండగానే ఆ లేఖను విడుదల చేశారు.
అందులో గద్దర్ ఈ విధంగా రాసుకొచ్చారు. తన పేరు గుమ్మడి విఠల్. తన పాట పేరు గద్దర్ అని, తన బ్రతుకు సుదీర్ఘ పోరాటం అని, తన వయస్సు 76 ఏళ్ళు. తన వెన్నుముకలో ఉన్న బుల్లెట్ వయస్సు 25 ఏళ్లు. తాను ఇటీవల సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క నిర్వహించిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో పాల్గొన్నానని తెలిపారు.
గుండె సంబంధిత చికిత్స కోసం అమీర్ పేట్ లోని అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ లో చేరానని, జూలై 20 నుండి ఈరోజు వరకు పరీక్షలన్ని చేయించుకుని, ట్రీట్మెంట్ తీసుకుంటూ మెల్లగా కుదుట పడుతున్నాను. కొలుకుని, ఆరోగ్యంతో తిరిగి మీ వద్దకి వస్తానని, సాంస్కృతిక ఉద్యమంను తిరిగి మొదలుపెట్టి, ప్రజల యొక్క రుణం తీర్చుకుంటానని లేఖలో వెల్లడించారు. కానీ ఆయన హాస్పటల్ లోనే కన్నుమూసి, అనంతలోకాలకు వెళ్లిపోయారు. ఆ విషయాన్ని తలచుకుని మరింతగా గద్దర్ అభిమానులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.
పోకిరి వంటి ఇండస్ట్రీ హిట్ అనంతరం మహేష్ బాబు, పూరి జగన్నాథ్ కలయికలో వచ్చిన ‘బిజినెస్ మెన్’ మూవీ మహేష్ అభిమానులనే కాకుండా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో మహేష్ బాబు డైలాగ్ లు, యాక్షన్ సన్నివేశాలు ఆడియెన్స్ చాలా ఆకట్టుకున్నాయి. గత ఏడాది మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా పోకిరి మూవీ రీరిలీజ్ అయ్యింది. అప్పుడు మొదలైన రీరిలీజ్ ట్రెండ్ ఇంకా కొనసగుతూనే ఉంది. ఇక ఈ ఏడాది మహేష్ పుట్టినరోజు సందర్భంగా ‘బిజినెస్ మెన్’ రీరిలీజ్ కాబోతుంది.
ఇప్పటికే ఈ మూవీ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయంట. ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 1.36 కోట్ల గ్రాస్ వసూలు అయినట్లు తెలుస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ కే ఈ రేంజ్ లో వసూలు కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీలో కాజల్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో డబ్బు, స్టేటస్ అంటే చాలా ఇష్టపడే పాత్రలో నటించిన అమ్మాయి పేరు ఆయేషా శివ. ఈమె కెనడాలో జన్మించిన భారతీయ నటి.
ఈ మూవీలో తన డైలాగ్స్ తో ఆకట్టుకుంది. ఆయేషా బాలీవుడ్ లో పలు చిత్రాలలో నటించింది. అలా బాలీవుడ్ మూవీలో చూసి, పూరీ జగన్నాథ్ ఆయేషాను ఈ మూవీలో కాజల్ ఫ్రెండ్ క్యారెక్టర్ కి సెలెక్ట్ చేసాడు. బిజినెస్ మెన్ మూవీ తర్వాత ఆమె మళ్ళీ తెలుగులో నటించలేదు. రీసెంట్ గా ఆయేషాకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.
కరాటే కళ్యాణి ప్రజాకవి గద్దర్ మరణ వార్త తెలిసి, ముందుగా పద్ధతిగా ఆయన మరణానికి బాధపడుతూ ఒక పోస్ట్ ను సోషల్ మీడియాలో పెట్టారు. కాసేపటికి ఫేస్ బుక్ లో వివాదాస్పద పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ లో ‘బాలు గారు విశ్వనాథ్ గారు సిరివెన్నెల గారు వెళ్లిపోయిన రోజున ఎర్ర బ్యాచ్ ఏమన్నారు మర్చిపోలేదు కానీ పోయినోల్లని తిట్టే సంస్కారం మా ధర్మం లో లే’ అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్ తో గద్దర్ ఫ్యాన్స్ కరాటే కళ్యాణి పై మండిపడ్డారు.
తాను అయితే ఏ విషయం అయినా మొదట మనం పాటించి, ఆ తరువాత అమలు పరచాలని భావిస్తాను. కానీ గద్దర్ అందర్నీ అడవిదారి పట్టించి, తన కుమారుడిని మాత్రం అమెరికాకు పంపించారు. సోషల్ మీడియాలో పెట్టె పోస్ట్లన్ని అందరికీ నచ్చనవసరం లేదు. అందరికి నచ్చేలా పోస్ట్‌లు పెట్టలేం, తిట్టేవాళ్ళు తిడుతూనే ఉంటారు. అలాంటి వారి కోసం తన పద్దతిని మార్చుకోనని, ఎవరు తిట్టినా పట్టించుకోనని, తన పోస్ట్‌లు తన ఇష్టం అని చెప్పుకొచ్చారు.
హీరో మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలని ఒకే చేస్తూ, ఆ చిత్రాలలో నటిస్తూ ఉత్సాహంగా కొనసాగుతున్నారు. ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా తరువాత చిరంజీవి పలు చిత్రాలలో నటించినప్పటికీ, వాటిలో ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ఒక్కటే బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ ను సాధించింది. మెగాస్టార్ ‘భోళా శంకర్’ మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ మూవీ కోలీవుడ్ సూపర్ హిట్ ‘వేదాళం’ కు రీమేక్‌గా తెరకెక్కిన విషయం తెలిసిందే.
‘భోళా శంకర్’ సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడంతో ఆదివారం (ఆగస్టు 6న) ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక ఈ మూవీ 2 రోజుల క్రితమే సెన్సార్ పూర్తిచేసుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీని వీక్షించిన సెన్సార్ సభ్యులు ఈ మూవీకి యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ మూవీ నిడివి రెండు గంటల 39 నిమిషాల 49 సెకెన్లు ఉన్నట్లు తెలుస్తోంది.
తాజాగా ‘భోళా శంకర్’ సినిమాకి సెన్సార్ బోర్డు జారీ చేసిన రిపోర్టు బయటకు వచ్చింది. ప్రధానంగా ఈ చిత్రంలో మద్యపానానికి సంబంధించిన సన్నివేశాలకు వచ్చే సమయంలో ‘మద్యపానం ఆరోగ్యానికి హానికరం’ అనే హెచ్చరికను హైలైట్ చేశారు. అదే కాకుండా డ్రగ్స్ సన్నివేశాల సమయంలోనే కూడా ఇలాంటి హెచ్చరికను పెట్టించారు.
అంతేకాకుండా ఈ మూవీలో ఇంటర్వెల్‌కు ముందుగా వచ్చే సన్నివేశంలో హీరో చిరంజీవి విలన్ తలను నరకడం హింసాత్మకంగా ఉందని, 6సెకెన్లు ఉన్న ఈ సీన్ కట్ చేశారు. ఈ సీన్ ప్లేస్ లో చిరంజీవి, తమన్నా క్లోజప్ షాట్‌ను జతపరిచారు. అలాగే ఇటీవల దసరాలో కూడా ఉన్న ఒక పదంతో వచ్చే డైలాగును సెన్సార్ బోర్డ్ మ్యూట్ చేయించారని రిపోర్టులో చూపారు.
1. బండెనక బండి కట్టి – మా భూమి:
2007లో హీరో విజయ్ రాఘవేంద్ర, స్పందన వివాహం జరిగింది. స్పందన బెంగళూరు మాజీ పోలీస్ ఆఫీసర్ బీకే శివరామ్ కుమార్తె. ఈ జంటకి కుమారుడు శౌర్య ఉన్నాడు. విజయ రాఘవేంద్ర, స్పందన దంపతులకు కన్నడ పరిశ్రమలో భారీగా అభిమానులు ఉన్నారు. స్పందన 2016లో రిలీజ్ అయిన ‘అపూర్వ’ అనే కన్నడ చిత్రంతో పాటు పలు చిత్రాలలో నటించారు. అంతేకాకుండా భర్త విజయ్ రాఘవేంద్ర సినిమాలకు నిర్మాతగా స్పందన పలు సినిమాలను సైతం నిర్మించింది.
రీసెంట్ గా ఫ్యామిలితో కలిసి బ్యాంకాక్ టూర్‌కు వెళ్లిన స్పందన ఈరోజు (సోమవారం) ఉదయం గుండెలో నొప్పిగా ఉందని చెప్పినట్లు సమాచారం. ఆమెను హాస్పటల్ కి తరలించేలోపే స్పందన మరణించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే మరో 19 రోజుల్లో విజయ్ రాఘవేంద్ర, స్పందనల 16వ వివాహ వార్షికోత్సవం రానుంది. ఈ లోపే స్పందన మరణించడం అందరినీ కలచివేస్తోంది. స్పందన భౌతికకాయం మంగళవారంలోగా బెంగళూరుకు తరలించనున్నట్లు తెలుస్తోంది. స్పందన మరణం తీవ్రంగా కలచివేస్తోందని విజయ్ రాఘవేంద్ర సన్నిహితులు సామాజిక మధ్యమలలో పోస్టులు పెడుతున్నారు.
కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా విజయ్ ఫ్యామిలీకి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కన్నడ ఇండస్ట్రీలో పాపులర్ హీరో అయిన విజయ్ రాఘవేంద్ర దాదాపు 50 చిత్రాలకు పైగా నటించారు. 20కు పైగా సాంగ్స్ ను పాడారు. ప్రస్తుతం ఆయన పలు టెలివిజన్ షోలలోని డ్యాన్స్ ప్రోగ్రామ్‌లకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.
ప్రజా గాయకుడు గద్దర్ అసలు పేరు విఠల్ రావు. ఆయన 1949లో తూప్రాన్‌లో జూన్ 5న జన్మించారు. మూడు రోజుల క్రితమే గద్దర్ అపోలో హాస్పటల్ లో గుండెకు చికిత్సను చేయించుకున్నారు. ఈ క్రమంలో వైద్యులు గుండె ఆపరేషన్ విజయవంతం అయినట్టుగా ప్రకటించారు. అయితే అంతలోనే గద్దర్ మరణించడం విషాదకరంగా మారింది. ఇక ఆయన చనిపోవడానికి గల కారణాల గురించి డాక్టర్స్ బులెటిన్ రిలీజ్ చేశారు. గద్దర్ మరణానికి గల ముఖ్యమైన కారణాలను అందులో తెలిపారు.
గద్దర్ ముఖ్యంగా ఊపిరితిత్తులు మరియు మూత్ర సమస్యలతో మృతి చెందినట్లు డాక్టర్స్ వెల్లడించారు. తీవ్రమైన గుండెజబ్బుతో గద్దర్ జూలై 20న హస్పటల్ చేరగా, ఆగస్టు 3వ తారీఖు ఆయనకు బైపాస్ సర్జరీ చేశారు. అది సక్సెస్ అయినా కానీ, గతంలో గద్దర్ కు ఉన్న లంగ్స్ సమస్య వల్ల ఆయన, కోలుకోలేక కన్నుమూసినట్లు వైద్యులు బులెటిన్‌లో ప్రకటించారు.
విశాఖలోని వన్‌టౌన్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రమేష్ మర్డర్ కేసులో వీడియో లభించిన విషయం తెలిసిందే. అయితే ఆ వీడియో చూసిన పోలీసులు, రమేష్ వైఫ్ తెలివితేటలకు ఆశ్చర్యపోయారు. లవర్ రామారావుతో కలిసి రమేష్ భార్య మంగళవారం రాత్రి భర్తను ఊపిరాడకుండా చేసి చంపేసిన సంగతి తెలిసిందే. అయితే రమేష్ ను చంపడం కోసం ముందుగానే తన లవర్ తో కలిసి శివాని కుట్ర పన్నింది. హత్య విషయంలో తన పై సందేహం రాకుండా హత్య చేయకముందే రమేష్ తో చాలా ప్రేమగా ఉన్నట్లు వీడియో తీసింది.
మంగళవారం నాడు రాత్రి మటన్ కర్రీ చేసి, భర్తకు పెట్టి, మద్యం తాగించింది. తాను చాలా మంచిదని, మై వైఫ్, మై లైఫ్ అని రమేష్ తో చెప్పించి, వీడియోను రికార్డు చేసింది. ఆ తరువాత మద్యం మత్తులో ఉన్న భర్తను తీసుకెళ్ళి బెడ్ పై పడుకోబెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మర్దర్ కేసు తనపై పడకుండా ఉండడం కోసమే, తాను మంచిదాన్ని అని రమేష్ తో చెప్పించి, వీడియోను రికార్డ్ చేసినట్లు శివాని పోలీసులు ఎదుట ఒప్పుకుంది. దీంతో శివాని తెలివితేటలకు అందరూ షాక్ అవుతున్నారు.
విచారణలో శివాని తనకు పెద్దమ్మ కూతురు పైడమ్మ వల్లే రామారావుతో పరిచయం అయ్యిందని చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో రమేష్ మర్డర్ ఈ హత్య కేసులో పైడమ్మ హస్తం కూడా ఉందని శివాని పోలీసులను నమ్మించడానికి ప్రయత్నించిందని సమాచారం. ఇక ఈ కేసులో ప్రస్తుతం రమేష్ భార్య శివాని, ఆమె లవర్ రామారావు, మరియు అతని ఫ్రెండ్ నీలా మీద మాత్రమే కేసును నమోదు చేశామని పోలీసులు తెలిపినట్లు సమాచారం.
శాకుంతలం చిత్రంలో సమంత శకుంతలగా, దేవ్ మోహన్ దుష్యంతుడుగా నటించారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలకపాత్రలో నటించాడు. శకుంతల దుష్యంతుల కుమారుడు భరతుడిగా స్టార్ హిరో అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ నటించింది. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. కానీ వాటిని అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. ఫస్ట్ షోతోనే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. సమంత, దర్శకుడు గుణశేఖర్ విమర్శల పాలయ్యారు. సోషల్ మీడియాలో డైరెక్టర్ ను తీవ్రంగా ట్రోల్ చేశారు. సమంత ఆ పాత్రకు సెట్ అవలేదని విమర్శించారు.
ఈ చిత్రం ఓటిటిలో రిలీజ్ కాగా, అక్కడ కూడా డిజాస్టర్ గానే నిలిచింది. ఓటీటీ రిలీజ్ లోనూ ట్రోలింగ్ తప్పలేదు. అయితే ఈ చిత్రం ప్లాప్ అయిన భరతుడిగా అల్లు అర్హ నటనను, డైలాగ్స్ ను మాత్రం అందరు మెచ్చుకున్నారు. అల్లు అర్హకు బాలనటిగా ఇదే మొదటి చిత్రం. అయినప్పటికి ఎలాంటి భయం లేకుండా అద్భుతంగా నటించడంతో పాటుగా, తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకుంది. అర్హ నటించిన సన్నివేశాలు సినిమాకి హైలెట్ గా నిలిచాయి.
అయితే తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమాలోని ఒక వీడియో షికారు చేస్తోంది. దేవ్ మోహన్ అల్లుఅర్హను ఎత్తుకుని మాట్లాడుతున్న సన్నివేశంలో అల్లుఅర్హ వస్తున్న నవ్వును ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. దానిని చూసిన నెటిజెన్లు కొంచెం చూసుకోవాలి కదా ఎడిటర్ గారూ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.