ప్రతివారం ఓటీటీలో కొత్త సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. అయితే వాటిలో ప్రేక్షకులను ఆకట్టుకునేవి మాత్రం కొన్నే ఉంటాయి. ఆసక్తికర చిత్రాలు మాత్రం తక్కువగానే ఉంటాయని చెప్పవచ్చు. ఐశ్వర్య రాజేష్ నటించిన ‘సొప్పన సుందరి’ అలాంటి తరహాలో ఉండే సినిమా.
హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన సొప్పన సుందరి అనే డబ్బింగ్ మూవీ మే 12 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ తెలుగులో కూడా ఉంది. ఏప్రిల్ లో కోలీవుడ్ లో రిలీజ్ అయిన ఈ మూవీ అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ కమర్షియల్ చిత్రాలలో నటిస్తూనే, మరో వైపు హీరోయిన్ ప్రాధాన్య సినిమాలలో కూడా నటిస్తున్నారు. తెలుగులో కూడా పలు సినిమాలలో నటించిన ఐశ్వర్య సొప్పన సుందరి సినిమాలో లీడ్ రోల్ లో నటించింది. ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే, మధ్యతరగతి కుటుంబానికి చెందిన అహల్య (ఐశ్వర్య రాజేష్) ఒక బంగారు షాపులో పని చేస్తుంటుంది. ఆమెకు అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రి, నాన్ స్టాప్ గా మాట్లాడే తల్లి, మాటలు రాని అక్క ఉంటారు. అన్నయ్య దొర(కరుణాకరన్) ప్రేమించి, పెళ్లి చేసుకుని వారికి దూరంగా వెళతాడు.
ఆ ఫ్యామిలీకి రోజు గడవడమే చాలా కష్టంగా ఉంటుంది. చాలా అప్పులు ఉండడడంతో కష్టంగా వారి జీవితం సాగుతుంటుంది. అలాంటి వాళ్ళకు ఒకరోజు హఠాత్తుగా ప్రముఖ నగల స్టోర్ లో తీసిన బంపర్ డ్రాలో పది లక్షలు విలువ చేసే కారు వస్తుంది. ఆ తరువాత వారి జీవితంలో ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? వారి జీవితంలోకి వచ్చే కొత్త వ్యక్తులు ఎవరు? దొర అతని బావ కలిసి ఏం చేశారు? చివరకు ఏం అయ్యింది? అనేది మిగతా కథ.
అహల్యగా నటించిన ఐశ్వర్య రాజేష్ పాత్రలో ఒదిగిపోయింది. మూవీ మొదలైనప్పటి నుండి ముగిసేవరకు డిఫరెంట్ వేరియేషన్స్ తో ఆకట్టుకుంది. డార్క్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం, థ్రిల్ కు గురి చేస్తూ కామెడీ పండించే విషయంలో దర్శకుడు విజయం సాధించాడు. ఈ మూవీ చూసినంతసేపు ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తారని చెప్పవచ్చు.

వర్షాకాలంలో ఎక్కువగా కండ్ల కలక వ్యాధి ఇబ్బంది కలిగిస్తుంది. ఈ వ్యాధి నాలుగు రకాలుగా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. బాక్టీరియా లేదా వైరస్, ఏదైనా ఫిజికల్ గాయం వల్ల లేదా ఎలర్జిక్ రియాక్షన్ వల్ల కూడా వస్తుంది. వర్షాకాలంలో బాక్టీరియా, వైరస్ లు పెరగడానికి అనువైన తేమతో కూడిన వాతావరణం ఉంటుంది. దీనివల్ల ఇవి వేగంగా విస్తరిస్తాయి. కండ్లకలకను ఐ ఫ్లూ లేదా పింక్ ఐ అని వైద్య పరిభాషలో పిలుస్తారు.
ప్రస్తుతం వేగంగా కండ్ల కలక విస్తరిస్తున్న నేపథ్యంలో కంటి ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరం అని డాక్టర్లు చెబుతున్నారు. ఇది అంటువ్యాధి కాబట్టి ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తుంది. ఈ కండ్ల కలక లక్షణాలు అందరిలో ఒకేలాగా ఉండక పోవచ్చు.
ఒక్కొక్కరిలో ఒక్కొలాంటి లక్షణాలు ఉంటాయి. అయితే అందరిలో కనిపించే కామన్ గా ఉండే లక్షణం అంటే జిగటగా ఉండే డిశ్చార్జ్ తో కళ్ళు ఎర్రగా మారుతాయి. కళ్ళు దురదగా అనిపించడం, కళ్ల నుంచి నీరు కారడం, లైట్ వెలుగును చూడలేకపోవడం, కళ్ళు తెరవలేకపోవడం, కళ్ల మంట, జ్వరం, గొంతునొప్పి వంటి లక్షణాలు కండ్ల కలక సోకినవారిలో కనిపిస్తాయి.
తీసుకోవలసిన జాగ్రత్తలు:
మనిషి అరచేతిలోని రేఖలు అతని భవిష్యత్తును ప్రభావితం చేస్తాయని చాలామంది నమ్ముతుంటారు. హస్తసాముద్రిక శాస్త్రం ప్రకారం చేతిలో ఉండే ప్రతి రేఖకు ఒక ప్రాముఖ్యత ఉంది. అరచేతిలో ఉండే రక రకాల గుర్తులు, రేఖలు ఫ్యూచర్ ను ప్రభావితం చేస్తాయి. కొంతమంది అరచేతిలో చేప గుర్తు ఉంటుంది. దీనిని మీనరేఖ అని కూడా పిలుస్తారు. ఇక హస్తసాముద్రికంలో చేప గుర్తు ప్రముఖమైనదని చెబుతారు. మీనరేఖ అనేది చాలా అద్బుతమైన రేఖ.
మరి అరచేతిలో ఉండే చేపగుర్తు వల్ల మంచి ఫలితాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. మీనరేఖ అరచేతిలో ఏ ప్రదేశంలో ఉన్నా, మంచి యోగదాయకంగా ఉంటుంది. ఏ ప్రదేశంలో ఉంటే ఆ ప్రదేశం యొక్క శుభ ఫలితాలు వస్తాయి. చంద్ర స్థానంలో మీనరేఖ ఉంటే మంచి ప్రేమకలవారు అవుతారు. శుక్రస్థానంలో మీనరేఖ ఉన్నట్లయితే మంచి భార్య వస్తుంది. గురు స్థానంలో మీనరేఖ ఉన్నట్లయితే మంచి విద్య లభిస్తుంది. అలాగే కుజ స్థానంలో మీనరేఖ ఉంటే మంచి యోగదాయకమైన ఉద్యోగం వస్తుంది.
బుధ స్థానంలో మీనరేఖ ఉంటే వ్యాపారంలో బాగుటుంది. ఈ విధంగా మీనరేఖ ఏ స్థానంలో ఉన్నప్పటికీ మంచి ఫలితాన్ని ఇస్తుంది. వీరు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఏ విషయానికి లొంగిపోరు, ఈ గుర్తు అరచేతిలో ఉన్నవారు అన్ని విషయాలలో విజయం సాధిస్తారని హస్తసాముద్రిక నిపుణులు చెబుతున్నారు.
శివజ్యోతి ఏ విషయం అయినా సరే సూటిగా మాట్లాడుతుంటారు. జ్యోతక్క అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టిన శివజ్యోతి తాజాగా తన ఛానెల్ లో హోం టూర్ వీడియోను చేసింది. మణికొండలో ఆమె తీసుకున్న ఫస్ట్ హౌజ్ గురించి వివరించింది. ఆ ఇంటిని 2019లో కొనుగోలు చేసినట్లుగా, ఫిబ్రవరి 2020లో గృహప్రవేశం చేశామని తెలిపారు.
కొద్ది రోజుల క్రితమే ఆ ఇంటికి మారినట్లుగా చెప్తూ తన ఇంటిని, ఇంటి లోపల అంతా చూపించింది. ఇంటి లోపలి ఇంటీరియర్ ను దగ్గరుండి మరి డిజైన్ చేయించుకున్నానని వెల్లడించింది. ఇక వీడియో చివర్లో ఇంటిని అమ్మాలని అనుకున్నట్లుగా, తాము ఆ ఇంట్లో ఉండట్లేదని, ఆ ఇంటిని చాలా ఇష్టంగా కొన్నట్లు తెలిపింది.
తాను న్యూస్ ఛానల్ మొదలు పెట్టానని, అయితే ఆ ఛానెల్ కి వ్యూస్ రాలేదని, డిప్రెషన్‌కు గురి అయ్యానని తెలిపింది. ఈ ఇల్లు లక్ అనుకున్నానని, అందుకే ఛానల్ సక్సెస్ అవుతుందని భావించాను. కానీ అలా జరగలేదని, రెండు ఇళ్ళ ఈఎంఐలు కట్టాలని. అందుకే ఈ ఇంటిని అమ్మాలని అనుకున్నట్లుగా వెల్లడించింది. ఊరికనే నన్ను తిట్టకండి. అలా చేయడం వల్ల చాలా ప్రభావం చూపిస్తుంది’ అని శివజ్యోతి కన్నీరు పెట్టుకుంది.
రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన అంజుకు పాకిస్తాన్ కి చెందిన నస్రుల్లాతో ఫేస్ బుక్ లో పరిచయం కావడం, ఆ తరువాత అది ప్రేమకు దారి తీసింది. ఈ క్రమంలో లవర్ ను కలుసుకోవడం కోసం అంజు దేశ సరిహద్దులను దాటి పాకిస్తాన్ కు వెళ్లింది. అక్కడ ఇస్లాం మతంలోకి మారి, పేరు సైతం ఫాతిమా మార్చుకుని, ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. మరో వారి పెళ్లి విషయం తెలిసిన అంజు ఆమె భర్త వారి పెళ్లి చెల్లదని చెబుతున్నారు. కానీ ఫాతిమా గా మారిన అంజు మాత్రం ఇక్కడి సంప్రదాయాలను మర్చిపోయి, అక్కడి వాటిని నేర్చుకునే ప్రయత్నం చేస్తోంది.
ఫాతిమా, నస్రుల్లా పెళ్లి చేసుకోవడంతో బంధువులే కాకుండా అక్కడి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కూడా వారి ఇంటికి వెళ్ళి మరి బహుమతులు ఇస్తున్నారు. తాజాగా పాకిస్థాన్ బిజినెస్ మెన్ మహమ్మద్ ఖాన్ అబ్బాసీ అంజుకి బహుమతుల అందచేశారు. ఆమెకు ఇల్లు కట్టుకోవడం కోసం స్థలం మరియు డబ్బును కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ ఇతర మతాల నుండి తమ మతంలోకి వచ్చే వారికి సౌకర్యాలు కల్పించడమే తమ ఉద్దేశమని వెల్లడించారు. ప్రస్తుతం అతను చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి.
ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధిక తన నటనతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అనేక తెలుగు చిత్రాలలో హీరోయిన్ గా నటించి, మెప్పించింది. ఎన్టీఆర్, ఆకకఎనేని నాగేశ్వర రావు, సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు వంటి అగ్ర హీరోలతో నటించింది. ఆమె తమిళ ఇండస్ట్రీలో అనేక చిత్రాలలో నటించారు. 1985లో రిలీజ్ అయిన తమిళ చిత్రం ‘మీందుం ఓర్ కాదల్ కతి’. ఈ చిత్రానికి మొదటిసారిగా ప్రతాప్ బోతన్ డైరెక్షన్ చేయగా, ఈ మూవీని రాధిక నిర్మించారు. ఈ మూవీ సమయంలోనే రాధికకు ప్రతాప్ పోతన్ తో పరిచయం ఏర్పడింది.
అంతేకాకుండా ఈ చిత్రంలో వీరిద్దరు జంటగా నటించారు. ఆ మూవీ షూటింగ్ సమయంలోనే వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. అలా అని అప్పట్లో వీరిద్దరి పై రూమర్స్ కూడా వచ్చాయి. వీరి ప్రవర్తన కూడా అలాగే ఉండేదని టాక్. ఈ మూవీ రిలీజ్ అయిన తరువాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే ప్రేమించుకున్న ఈ జంట మధ్య సఖ్యత లేకపోవడంతో పెళ్లి చేసుకున్న ఏడాదిలోపే విడాకులు తీసుకుని విడిపోయారు.
ఆ తరువాత రాధిక ఒక బ్రిటీన్ ఇండియన్‌ను వివాహం చేసుకున్నప్పటికి, అతనికి విడాకులు ఇచ్చి, ఆ తర్వాత సీనియర్ హీరో శరత్ కుమార్‌ను మూడవ వివాహం చేసుకుంది. ఇక ప్రతాప్ పోతన్ కూడా వీరు విడిపోయిన 5 ఏళ్ళకు రెండవ పెళ్లి చేసుకున్నాడు. పన్నెండు ఏళ్ల తర్వాత ఆమెకు కూడా విడాకులు ఇచ్చారు. ప్రతాప్ పోతన్ 2022లో కార్డియాక్ అరెస్ట్ తో కన్నుమూశారు.
ఇక బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేయడంతో విరాట కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ కి దిగడానికి రెడీ అయ్యారు. కానీ మొదటి వన్డేలో కోహ్లి బ్యాటింగ్ కి రాకముందే టీం ఇండియా విజయం సాధించింది. దాంతో విరాట్ బ్యాటింగ్ చూసే ఛాన్స్ అభిమానులకు దొరకలేదు. ఇక ఆ తరువాత జరిగిన రెండో వన్డేలో వీరిద్దరిని విశ్రాంతి పేరుతో మ్యాచ్ కు దూరంగా ఉంచారు. కానీ ఆ మ్యాచ్ లో భారత జట్టు ఘోరమైన పరాజయాన్ని పొందింది.
చివరిది అయిన మూడవ మ్యాచ్ లో కూడా మళ్ళీ వీరిద్దరికి విశ్రాంతినిచ్చారు. దీంతో ఈ సిరీస్ మొత్తంలో కోహ్లీ ఆటను చూడాలనుకున్న ఫ్యాన్స్ కు నిరాశే ఎదురయ్యింది. కానీ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో రెండో వన్డేలో పరాజయం పొందినా, మూడవ వన్డేలో మాత్రం 200 పరుగుల తేడాతో గెలిచి, సిరీస్ ను కైవసం చేసుకోవడంతో భారత క్రికెట్ ఫ్యాన్స్ సంతోష పడుతున్నారు.
ఇదిలా ఉండగా, మైదానంలో కోహ్లీ బ్యాటింగ్ చూడలేకపోయినా, మొదటి వన్డేలో వాటర్‌బాయ్ గా విరాట్ కోహ్లి కనిపించాడు. అలాగే ఆఖరి వన్డేలో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా వచ్చాడు. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోకి ‘‘కోహ్లీ గ్రౌండ్ లో ఉంటే చాలు, కానీ బ్యాటింగ్ మెరుపులను మిస్ అవుతున్నాం’’ అని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
దర్శకుడు మెహర్ రమేష్ తన సినిమాలలోని హీరోలను చాలా స్టైలిష్ గా చూపిస్తాడని తెలిసిందే. ఈ చిత్రంలో చిరు ను ఎలా చూపిస్తాడా అని మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ నుండి రిలీజ్ అయిన భోళా మానియా పాటలో మెగాస్టార్ చిరంజీవి లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
ఈ చిత్రంలో కీర్తి సురేష్ చిరంజీవి సిస్టర్ గా నటిస్తుండగా, యంగ్ హీరో సుశాంత్ ఆమెకి బాయ్ ఫ్రెండ్ గా కనిపించబోతున్నాడు. తాజాగా ఈ చిత్రం గురించి వస్తున్న ఇన్ సైడ్ టాక్ ప్రకారంగా, మూవీ అవుట్‌పుట్ ఎబౌవ్ యావరేజ్ అని, ఒక్కసారి చూడవచ్చు అని వినిపిస్తోంది. కలెక్షన్స్ పరంగా భారీ నష్టం రావడం వల్ల ఈ మూవీ ఫ్లాప్ కావచ్చు అని ఇన్సైడ్ టాక్.
ఇండస్ట్రీ లెక్కల ప్రకారం ఇప్పటికే ఈ మూవీకి రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి రూ.70 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. దర్శకుడు మెహర్ రమేష్ గత చిత్రాలు ప్లాప్ అవగా, వాటివల్ల భారీ స్థాయిలో నష్టాలు వచ్చిన విషయం తెలిసిందే. మొదటి షో మంచి టాక్ వస్తే, మూవీ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
‘బ్రో’ మూవీ తరువాత సాయిధరమ్ తేజ్ సంపత్ నంది దర్శకత్వంలో ఒక మూవీ చేయబోతున్నాడు. ఈ చిత్రానికి ‘గాంజా శంకర్’ టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా కన్నా ముందుగా సాయిధరమ్ తేజ్ ఒక షార్ట్ ఫిల్మ్‌తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. సాయిధరమ్ తేజ్ చాలా కాలం క్రితమే ‘సత్య’ అనే షార్ట్ ఫిల్మ్‌లో యాక్ట్ చేశాడు.
ఈ షార్ట్ ఫిల్మ్ కి యాక్టర్ సీనియర్ నరేష్ కుమారుడు నవీన్ విజయ్ కృష్ణ డైరెక్షన్ చేశాడు. నవీన్ నందిని నర్సింగ్ హోమ్, ఐనా ఇష్టం నువ్వు, ఊరంతా అనుకుంటున్నారు అనే చిత్రాలలో హీరోగా నటించాడు. వీటిలో ఐనా ఇష్టం నువ్వు మూవీ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన మొదటి చిత్రం. అయితే నవీన్ నటించిన సినిమాలు విజయం సాధించలేదు. దాంతో నటనకు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం అతను గుర్తు పట్టలేనంతగా, లావుగా మారిపోయారు.
ఇక వైరల్ అవుతున్న సాయిధరమ్ తేజ్ ఫోటోలో అతని పక్కన నలుపు రంగు టీషర్ట్‌లో ఉన్నది నవీన్. అతను లావుగా మారడంతో వెంటనే గుర్తుపట్టలేకపోయారు. ఇది ఇలా ఉంటే మంచు మనోజ్, నవీన్, సాయితేజ్ మంచి స్నేహితులు. వీలు దొరికినపుడల్లా ఈ ముగ్గురు కలుస్తుంటారని తెలుస్తోంది. నవీన్ హీరోగా సక్సెస్ కాలేకపోయినా, డైరెక్టర్ గా మారిపోయాడు. ఈ షార్ట్ ఫిల్మ్ త్వరలో విడుదల కానుంది అని తెలుస్తోంది.
హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ డిఫరెంట్ స్టోరీలను ఎంచుకుని, నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఆమె ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరో వైపు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నారు. అలా వచ్చిన వెబ్ సిరీస్ ‘సుడల్’. ఇది అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. గత ఏడాది రిలీజ్ అయిన ఈ సిరీస్ 8 ఎపిసోడ్లుగా రూపొందింది. దీనిని తెలుగుతో పాటుగా ఇతర భాషల్లోకి కూడా డబ్ చేశారు.
ఇక ఈ వెబ్ సిరీస్ కథ విషయాని వస్తే, షణ్ముగం(పార్తిబన్) చాలా కాలం నుంచి పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీలో పని చేస్తుంటాడు. ఆ ఫ్యాక్టరీలో ఊహించని విధంగా అగ్ని ప్రమాదం సంభవిస్తుంది. అయితే ప్రమాదం జరిగిన రోజే షణ్ముగం యొక్క చిన్న కుమార్తె నీలా కనిపించకుండా పోతుంది. ఫైర్ యాక్సిడెంట్ మరియు కనిపించకుండా పోయిన నీలా కేసులను సాల్వ్ చేయడం కోసం పోలీస్ డిపార్ట్మెంట్ రెజీనా(శ్రీయ రెడ్డి), చక్రి(కాథిర్) లను నియమిస్తుంది. ఈ కేసులను ఛేదించే క్రమంలో పోలీసులకు తెలిసిన షాకింగ్ విషయాలు ఏమిటి?
నీలా ఎందుకు మిస్ అయ్యింది? వారు ఈ కేసులను సాల్వ్ చేశారా లేదా అనేది మిగతా కథ. రొటీన్ స్టోరీ అయినప్పటికీ, గ్రిప్పింగ్ నరేషన్, ఇంటెన్స్ కథనంతో ఈ సిరీస్ ని తీర్చిదిద్దిన విధానం, ఆడియెన్స్ కి థ్రిల్ ని కలిగిస్తుంది. ఇక ఈ వెబ్ సిరీస్ లో కీలకమైన ట్విస్టులు, ప్రతి క్యారెక్టర్ యొక్క క్యారక్టరైజేషన్ కూడా ఇంపాక్ట్ కలిగిస్తాయి. ఈ సిరీస్ నిడివి ఎక్కువగా ఉండడం వల్ల సాగదీసిన భావన కలుగుతుంది.