పెళ్లంటే నూరేళ్ల పంట అని పెద్దలు సాధారణంగా చెబుతుంటారు. అయితే కొందరు మాత్రం పెళ్లి పేరుతో మోసపోతున్నారు. ప్రస్తుతం పెళ్లి సంబంధాలను మాట్రిమోని వేదికగా వెతుకుతున్నారు. వాటిని ఉపయోగించుకున్న ఒక యువతి ఒకరికి తెలియకుండా ఇంకొకరి పెళ్లి చేసుకోవడం, ఆ తరువాత ఇంట్లో ఉన్న డబ్బు, బంగారాన్ని తీసుకొని పారిపోతున్న ఒక నిత్య పెళ్లికూతురు లీలలు వెలుగుకోకి వచ్చాయి.
అయితే తాజాగా ఆ నిత్య పెళ్లికూతురు వల్ల బాధితుడిగా మారిన వ్యక్తి ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు ఆ నిత్య పెళ్లికూతురు బండారం బయట పెట్టారు. ఇప్పటివరకు ఆమె నలుగురిని వివాహం చేసుకున్నట్లు తేలింది. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
వరంగల్ జిల్లాలోని నెక్కొండ మండలంకి చెందిన అనూష మ్యాట్రిమోనీ వెబ్సైట్ల ద్వారా పెళ్లి చేసుకోవాలనుకునే యువకులను పెళ్లి పేరుతో మోసం చేస్తుంది. ఒకరితో వివాహం అయిన తరువాత కొన్నాళ్ళు కాపురం చేసి, ఆపైన ఇంట్లో ఉన్న డబ్బు, బంగారాన్ని ఎత్తుకెళ్లడం. ఆ తరువాత మరొకరిని పెళ్లి చేసుకోవడం. ఇలా అనూష ఇప్పటిదాకా నలుగురిని పెళ్లి చేసుకుంది. అయితే ఆమెను పెళ్లి చేసుకుని మోసపోయిన సుద్దాల రేవంత్ అనే బాధితుడు అనూష పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాంతో అనూష బండారం బయటికి వచ్చింది. పెద్దపల్లికి చెందిన రేవంత్‌కు మ్యాట్రిమోనీ వెబ్సైట్ ద్వారా అనూషతో పరిచయం కలిగింది. పరిచయం పెరగడంతో వారు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే పెళ్లి జరగక ముందే అనూష అవసరం ఉందని అడగడంతో రేవంత్ రెండు లక్షల రూపాయలు ఆన్లైన్ లో పంపించాడు. 2022లో డిసెంబర్ 14న అనూష – రేవంత్ ల పెళ్లి జరిగింది. 70 వేల రూపాయల నగదు, నాలుగు తులాల బంగారం అనూషకు ఇచ్చాడు.
పెళ్లి అయిన తరువాత రేవంత్ తో 2 నెలలు కాపురం చేసిన తరువాత అనూష ఇంట్లోని డబ్బు, బంగారు నగలను తీసుకుని వెళ్లిపోయింది. దీంతో అనుషను వెతుక్కుంటూ ఆమె ఇంటికి వెళ్లడంతో ఆమెకు ఇదివరకే 3 పెళ్లిళ్లు అయినట్లు తెలియడంతో రేవంత్ షాక్ అయ్యిమోసపోయానని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also Read: కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఘటనపై CRS నివేదికలో బయటికి వచ్చిన నిజం..! తప్పు అక్కడే జరిగిందా..?

ఇటీవల చైతన్య తన తల్లిదండ్రులతో కలిసి తిరుమలకు శ్రీవారి దర్శనం కోసం వెళ్లారు. ఆ సమయంలో కూడా చైతన్య వెంట నిహారిక కనిపించలేదు. చైతన్య రీసెంట్ గా సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ కూడా వైరల్ అయ్యింది. ఈ క్రమంలో నిహారిక విడాకుల పై జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ విడాకుల కోసం కోర్టు మెట్లెక్కింది. నిహారిక కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టులో డైవర్స్ కోసం పిటిషన్ వేసింది. ఆ అప్లికేషన్ కు సంబంధించిన ఫోటో తాజాగా బయటకి వచ్చింది. ఆ అప్లికేషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయితే కోర్టు గత నెల జూన్ 5న విడాకులు మంజూరు చేసిందని తెలుస్తోంది. ఈ వార్తతో గత కొంతకాలంగా వస్తున్న విడాకుల వార్తలకు తెర పడినట్టు అయ్యింది. 2020 డిసెంబర్లో మెగాడాటర్ నిహారిక వివాహం, మాజీ ఐజీ జే ప్రభాకర్ రావు కొడుకు చైతన్య జొన్నలగడ్డతో జరిగింది.
వీరి వివాహం రాజస్థాన్‌లోని ఒబెరాయ్ ఉదయ్ విలాస్‌లో పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో మెగా, అల్లు కుటుంబాలతో పాటు సిని ఇండస్ట్రీ నుండి పలువురు సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. కానీ పెళ్ళి అయిన తరువాత రెండు సంవత్సరాలకే చైతన్య, నిహారిక మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినట్టు తెలుస్తోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్, నవదీప్ ప్రధాన పాత్రలలో నటించిన సినిమా ‘ఆర్య 2’. ఈ మూవీని ఆదిత్య బాబు ఆదిత్య ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు. శ్రద్ధా దాస్, బ్రహ్మానందం, ముఖేష్ రుషి కీలక పాత్రలలో నటించారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. 2009లో నవంబరు 27న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.
ఈ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ నిర్మాతలకు లాభాలను తెచ్చింది. ఈ మూవీ మలయాళంలో సేమ్ టైటిల్ తో అనువదించబడి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకాదరణ పొందాయి. తాజాగా ఈ మూవీలోని ఒక సన్నివేశాన్ని హాలీవుడ్ మూవీ అయిన ఇండియానా జోన్స్ 4 నుండి కాపీ కొట్టారని నెట్టింట్లో ఒక వార్త హల్చల్ చేస్తోంది. దానికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది.
ఈ వీడియో చూసిన నెటిజెన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. ఒకరు సుక్కు మావా నువ్వు కూడా కాపీ కోడతావా అని కామెంట్ చేస్తే, మరొకరు ఇండియానా జోన్స్ టాలీవుడ్ డైరెక్టర్లకి బాగా ఉపయోగపడిందని అని కామెంట్ చేశారు. ఇంకొకరు సుకుమార్ కూడా వాడేస్తాడా అంటూ కామెంట్ చేస్తున్నారు.
డెలివరీ తరువాత మహిళ శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. హార్మోన్స్ బ్యాలెన్స్ లో మార్పులు వస్తాయి. శారీరక పెయిన్స్ ఉంటాయి. డెలివరీ నుండి కోలుకోవాలంటే మానసిక స్థైర్యం చాలా ముఖ్యం. సింపుల్ గా అనిపించినా ఇది ఎంతో ముఖ్యమైన విషయం. ఎందుకంటే మహిళల ఆలోచనలే వారి శరీరంలో హార్మోన్స్ మార్పులకు కూడా కారణం అవుతాయి. కాబట్టి డెలివరీ అయ్యక ఒత్తిడికి గురి కాకూడదు. స్థిమితంగా ఉండాలి.
నాకు మాత్రమే ఎందుకు ఈ సమస్య అనుకోవద్దు. నేను ఇలాగే పుట్టానని, అందరికి పిల్లలు పుట్టారని, వారు కూడా ఇలాగే పెరుగుతారని అనుకోవాలి. బేబీ కేర్ పై దృష్టి పెట్టాలి. అన్నిటికీ ఇంటర్నెట్ సహాయం తీసుకోవద్దు. ప్రతి దానికి భయపడకూడదు. అలా అని చెప్పి పిల్లల్ని బయట తిప్పకూడదు. సమయానికి పడుకోవాలి. అది కూడా బేబీ పడుకున్న సమయంలోనే పడుకోవాలి. లోకంలో అందరు ఇలానే ఉంటారని అనుకోవాలి.ఇంట్లో పెద్దవారు ఎవరైనా ఉంటే బిడ్డ విషయంలో కాస్త దైర్యంగా ఉంటుంది. కాబట్టి డెలివరీ ముందు నుండే మానవ సంబంధాలు పెంచుకోవాలి.
అలా ఎదుటివారితో మాట్లాడుతున్నప్పుడే కొన్ని విషయాలలో నెమ్మది, మరి కొన్ని విషయాలలో సలహాలు, సూచనలు లభిస్తాయి. బిడ్డను ఎలా చూసుకోవాలనే విషయాలు కూడా అనుభవజ్ఞులైన వారు చెబుతూ ఉంటారు. డెలివరీ అయిన మహిళలకు భర్తతో పాటుగా, కుటుంబ సభ్యుల మద్ధతు కూడా దొరికినపుడే వారు ఈ సమస్యల నుండి త్వరగా బయటికి రాగలుగుతారు.
బాలీవుడ్ యాక్టర్ విందు ధారా సింగ్ ఆదిపురుష్ మూవీ యూనిట్ పై మండిపడ్డారు. విందు ధారా సింగ్ ఎన్నోసార్లు హనుమంతుడి పాత్రలో నటించారు. అతను మాత్రమే కాకుండా విందు ధారా సింగ్ తండ్రి, దివంగత యాక్టర్ ధారా సింగ్, రామానంద్ సాగర్ రూపొందించిన బుల్లితెర రామాయణంలో హనుమంతుడిగా నటించారు. ముఖ్యంగా హనుమంతుని క్యారెక్టర్ ను వక్రీకరించడం పై తీవ్ర అసంతృప్తిని తెలిపారు.
విందు ధారా సింగ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆదిపురుష్ మూవీ నిర్మాతల తీరుపై విమర్శలు చేశారు. అలాగే హనుమంతుడి పాత్రను పోషించిన దేవదత్తా నాగేపై సటైర్లు వేశాడు. హనుమంతుడు పాత్ర చేసిన దేవదత్తా నాగే హిందీలో సరిగ్గా మాట్లాడలేడు. ఇక అతడికి ఇచ్చిన డైలాగ్‌లతో హనుమంతుడి పాత్రను వేరే విధంగా చూపారు. ఈ విషయంలో ప్రొడ్యూసర్లు దారుణంగా ఫెయిల్ అయ్యారని విమర్శించారు. హనుమంతుడి క్యారెక్టర్ లో తన తండ్రి చరిత్ర సృష్టించాడని, ఆయన యాక్టింగ్ కు దరిదాపుల్లోకి సైతం రాలేరని మండిపడ్డారు.
‘మేకర్స్ చేసిన పనిని చూస్తే సిగ్గుగా ఉంది. వీళ్ళు మందు తాగి వచ్చారో? ఏం ఆలోచిస్తున్నారో కూడా వారికే తెలియదు. ఇంత భారీ బడ్జెట్ పెట్టి అద్భుతమైన మూవీ తెరకెక్కించే బంగారం లాంటి అవకాశాన్ని నాశనం చేశారు. రామాయణం స్టోరీతో ఆడుకున్నారు. అందువల్లే ఈ మూవీ తీవ్రంగా నిరాశపరిచింది’ అని అన్నారు.
1. బ్రహ్మానందం – రంగమార్తాండ:
2. ఎల్ బి శ్రీరామ్ – అమ్మో ఒకటో తారీఖు:
3. రఘుబాబు- మురారి:
5. వెన్నెల కిషోర్ – గూడాచారి:
6. వేణు మాధవ్ – అన్నవరం: 
పెద్దల సమక్షంలో నిహారిక, చైతన్య జొన్నలగడ్డల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. కానీ వీరిద్దరూ ప్రస్తుతం విడి విడిగా ఉంటున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో నిహారిక, చైతన్యలు ఒకరినొకరు అన్ ఫాలో కావడంతో వీరిద్దరూ విడిపోతున్నారనే వార్తలు మొదలు అయ్యాయి. అంతేకాక మెగా కుటుంబంలో జరిగే వేడుకల్లో చైతన్య లేకుండా నిహారిక మాత్రమే కనిపిస్తుండటం వల్ల ఈ జంట విడిపోతున్నారని ప్రచారం జరుగుతోంది.
రీసెంట్ గా జరిగిన నిహారిక అన్నయ్య వరుణ్ తేజ్, లావణ్యల ఎంగేజ్మెంట్ కి, అలాగే రామ్ చరణ్ ఉపాసనల పాప బారసాలలో కూడా చైతన్య లేకుండా నిహారిక ఒక్కరే హాజరు అయ్యారు. కానీ విడిపోతున్నారని వస్తున్న ప్రచారం పై అటు నిహారిక, ఇటు చైతన్య ఎక్కడా స్పందించలేదు. ఈ క్రమంలో చైతన్య సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. విడాకుల వార్తల తరువాత అతను సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం లేదు.
చైతన్య జొన్నలగడ్డ 4 నెలల అనంతరం ఒక మెడిటేషన్ సెంటర్ ఫోటోను షేర్ చేస్తూ, ‘నన్ను ఇక్కడికి నడిపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. గత 10 రోజులుగా, విపాసన యోగా చేయడంతో నా లైఫ్ లో కాస్త ఉల్లాసంగా ఉందని, ఎక్కడికైనా మనం ఎటువంటి ఆలోచనలు లేకుండా వెళ్ళినపుడు జ్ఞానంతో బయటకు వస్తాం. ఈ చోటు కూడా అలాంటిదే’ అని చైతన్య రాసుకొచ్చాడు.
దాంతో క్రమంగా ముఖేష్ ఆరోగ్యం పూర్తిగా పాడైంది. ఫ్యామిలీ మెంబర్స్ ఎంత చెప్పినా కూడా వినిపించుకోలేదు. ఆఖరికి ముఖేష్ ప్రాణాలను పోగొట్టుకున్నాడు. ఇక ఈ యాడ్ చేయడం కోసం కొంతమంది ముఖేష్ దగ్గరికి వెళ్లి అడిగిన సమయంలో ముఖేష్ మాట్లాడే కండిషన్ లో లేడు. ఆఖరికి ప్రకటన చేయడానికి అంగీకరించాడు.
ముఖేష్ అతి కష్టం మీద గుట్కా తినకూడదని, గుట్కా తినకూడదని, మానేయమని తన కుటుంబ సభ్యులు ఎన్నో సార్లు తనకు చెప్పారని,కొన్ని సందర్భాల్లో మా అమ్మ నన్ను కొట్టింది గుట్కా మానేయమని చెప్పింది. కానీ అప్పుడు ఎవరి మాట వినలేదు అని ముఖేష్ చెప్పడం జరిగింది. తాను ఆ విధంగా చెప్పడం వల్ల కొందరయినా మారుతారనే ఉద్దేశ్యంతో ముఖేష్ ఈ ప్రకటన చేయడానికి అంగీకరించాడట.
అతను 2009లో కన్నుమూశారు. అతను మరణించిన తరువాత 2011 నుండి ముఖేష్ యాడ్ ని ఉపయోగించడానికి ‘నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ టొబాకో ఏరాడికేషన్ సంస్థ’ అనుమతిని ఇచ్చింది. అప్పటి నుండి ప్రసారం అయిన ఈ యాడ్ 2013 దాకా కొనసాగించారు. తనలా మరొకరు మరకూడదు అనే మంచి ఉద్దేశ్యంతో మాట్లాడలేని స్థితి అయినప్పటికి ఈ ప్రకటన చేసిన ముఖేష్ ను చూసి అయినా ఇటువంటి చెడు అలవాట్లకు అందరు దూరంగా ఉంటే చాలా మంచిది.
మణికందన్, మీరా రఘునాథ్ ప్రధాన పాత్రలలో నటించిన ‘గుడ్ నైట్’ సినిమా ఈ ఏడాది మే 23న తమిళంలో రిలీజ్ అయ్యి, సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రానికి వినాయక్ చంద్రశేఖరన్ ద్రశకత్వం వహించారు. ఇక కథ విషయానికి వస్తే, సాఫ్ట్ వేర్ జాబ్ చేసే మోహన్ కు ఒక సమస్య ఉంటుంది. అతను నిద్రపోయాడంటే గురక రీసౌండ్ వస్తుంది. ఆ గురకకి పక్కింటివాళ్లు సైతం భయపడిపోవాలి. తన గురక వల్ల అందరూ తిడుతుంటారు.
ఒక రోజు ఊహించని పరిస్థితుల్లో అను పరిచయమవుతుంది. అందరితో అంతగా కలవని అను, మోహన్ ను ప్రేమిస్తుంది. కొద్ది రోజులకే వారి పెళ్లి జరుగుతుంది. మొదటిరాత్రి రోజు మోహన్ కు గురక సమస్య ఉందని అనుకు తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? చివరకు భార్యభర్తలు కలిశారా? లేదా అనేదే మిగతా కథ.
హీరోకు సమస్య ఉన్న కథతో టాలీవుడ్ లోనూ సినిమాలు వచ్చాయి. మహానుభావుడు, భలే భలే మాగాడివోయ్ వంటివి. ఆ కోవలో వచ్చిందే గుడ్ నైట్ మూవీ. హీరోకు ఉన్న గురక సమస్యతో ఇంట్లోవారు, పక్కింటివారు ఇలా అందరూ ఇబ్బందులు పడుతుంటారు. గురక సమస్యను హీరోకు పెట్టి, దర్శకుడు వినాయక్ చంద్రశేఖరన్ విజయం సాధించాడు. సినిమా మొదలవగానే హీరోకు గురక ఉందని అర్థమవుతుంది. గురకతో హీరో చుట్టు పక్కల వాళ్ళు పడే ఇబ్బందులను దర్శకుడు చక్కగా చూపించాడు. ఇక వాళ్లు అనే మాటలు నవ్విస్తాయి.
మెగా ఫ్యామిలీ నుండి నాగబాబు డాటర్ నిహారిక యాంకర్ గా సినీ పరిశ్రమ అడుగు పెట్టింది. ఆ తరువాత హీరోయిన్ గా పలు చిత్రాలలో నటించారు. కానీ నిహారిక నటించిన చిత్రాలు అంతగా విజయం సాధించలేదు. దాంతో ఆమె నిర్మాతగా ఇండస్ట్రీలో సెటిల్ అయ్యారు. నిహారిక సినిమాలు నిర్మిస్తూ, అప్పుడప్పుడు వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉన్నారు. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత ప్రస్తుతం ఇండస్ట్రీలో పనిచేస్తున్న సంగతి తెలిసిందే.
ఆమె కాస్ట్యూమ్ డిజైనర్ గా కొనసాగుతూ, ఆ తరువాత ప్రొడ్యూసర్ గా స్థిరపడ్డారు. అయితే సుస్మిత గతంలో ఒక సినిమాలో హీరోయిన్ గా నటించిందంట. చిరంజీవి సుస్మితను హీరోయిన్ పరిచయం చేయాలని అనుకున్నారంట. కానీ సుస్మితను ఇండస్ట్రీకి పరిచయం చేయాలనుకున్నప్పుడల్లా ఏదో ఒక అడ్డంకి వస్తుండడంతో ఆ ఆలోచనను చిరంజీవి పక్కకు పెట్టారని సమాచారం.
సుస్మిత హీరోయిన్ గా ఒక చిత్రంలో నటించారట. అయితే ఆ మూవీ షూటింగ్ మధ్యలోనే ఆగిపోవడంతో రిలీజ్ కు నోచుకోలేదు. ఈ సినిమాకి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఇందులో ఉదయ్ కిరణ్, సుస్మిత జంటగా నటించారట. ఈ మూవీ మొదటి సగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్నది. అయితే సెకండ్ హాఫ్ షూటింగ్ కంప్లీట్ కాలేదంట. దాంతో ఆ మూవీ రిలీజ్ కాలేదని తెలుస్తోంది.