కెరీర్ స్టార్టింగులో బి గ్రేడ్ షార్ట్ ఫిలిమ్స్ లో నటించడంతో అమ్మాయిల పిచ్చి ఉన్న వాడిగా దొరబాబుపై హైపర్ ఆది తో పాటు సహా పార్టిసిపెంట్స్ సెటైర్లు వేస్తూనే ఉంటారు ,ఆ విషయం అందరికి తెలిసిందే…కానీ ఆ తర్వాత అతను పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యాడు అనుకున్నాము. ఇప్పుడు ఇలా అరెస్ట్ అయ్యే సరికి పెళ్లయ్యాక కూడా ఇంకా అవేం పనులు అని తిడుతున్నారు అందరు.
దొరబాబు, పరదేశిలు వ్యభిచార గృహంలో పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన పోయిన సంగతి అందరికి తెలిసిందే. ఓ అపార్ట్మెంట్లో వ్యభిచార గృహంపై పోలీసులు జరిపిన దాడుల్లో జబర్దస్త్ కామెడీ షో ఆర్టిస్టులు దొరబాబు, పరదేశి పట్టుబడ్డారు.విశాఖపట్నంలోని మాధవధారలో ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందన్న పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ డీఎస్పీ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. ఇద్దరు వ్యభిచార గృహ నిర్వాహకులు సహా ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎయిర్పోర్టు పోలీస్ స్టేషన్లో వారిని విచారిస్తున్నారు.ఇది ఇలా ఉండగా…”ఆ కేసులో ఇరుక్కున్న దొరబాబు నేను కాదు” అంటూ మీడియా ముందుకు వచ్చి తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రముఖ ఆర్టిస్ట్ దావూద్. అచ్చం దొరబాబులా ఉండే మరో జబర్దస్త్ నటుడు దావుద్ కు కష్టాలు వచ్చి పడ్డాయి.ఆ కేసు చుసిన అందరూ కూడా దావుద్ ఏ ఆ దందాలో దొరికిపోయాడు అనుకున్నారు అంట. కొంత మంది అయితే అతనికి ఫోన్ చేసి మరి బండబూతులు తిడుతున్నారట.
హైపర్ ఆది స్కిట్లో దావూద్, దొరబాబు కలిసి కవల సోదరులుగా స్కిట్ కూడా చేసారు. దీంతో ఇప్పుడు దొరికింది దావుద్ అనుకున్నారు కొందరు. దీంతో “నేను పలు సినిమాల్లో మంచి పాత్రల్లో నటించాను.నేను ఇందాకే దొరబాబుకు సంబంధించిన వీడియో చూశాను.నాకు ఆయనుకు పోలికలు ఉండటం వల్ల నాకు ఫోన్ చేసి ఏంటి ఇదంతా అని అడుగుతున్నారు.మీ అందరికి ఒకటే చెప్తున్నా.ఆ వీడియోలో ఉన్నదీ నేను కాదు” అంటూ దావూద్ మీడియాకి తెలిపారు.