సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన దగ్గరనుంచి చెంబు,చాట దగ్గరనుంచి విఠలాచార్య సినిమాల వరకు అన్ని చూడవచ్చు, చూపించవచ్చు. ఇప్పుడు యువత వారి సమయాన్ని ఇందుకోసమే చాలా వరకు వినియోగిస్తున్నారు.అయితే ఇలా చేయటం వలన కొంత మంచి జరిగితే మరి కొంత చెడు జరుగుతుంది అని అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా పుణ్యమా అని మనము కళ్ళతో చూడలేని చాలా విషయాలను చాలా దగ్గరగా చూడగలుగుతున్నాము.

ఈ క్రమంలోనే అటు సినిమా స్టార్స్, పొలిటికల్ లీడర్ల ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని పోల్చుకోండి అంటూ ఛాలెంజ్ లు కూడా విసురుతున్నారు చాలామంది. ఈమధ్య అలాంటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. ఈ ఫోటోలో ఇద్దరు చిన్న పిల్లలు తమ నవ్వులని విరబూస్తూ చాలా ముద్దుగా ఉన్నారు.
వీళ్ళు ఎవరా అని ఆరా తీసిన వాళ్ళకి నిజం తెలిసి ఆశ్చర్యపోయారు. అవునండి నేను చెప్పేది నిజం.ఫోటోలో ఉన్నది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పిల్లలు వైఎస్ జగన్, వైఎస్ షర్మిల. వీరిద్దరి చిన్నప్పటి ఫోటో ఇది. కానీ నమ్మశక్యంగా అనిపించదు. ఎందుకంటే ఇప్పటి ఈ అన్నాచెల్లెళ్లకి అప్పటి అన్నా చెల్లెలకి అస్సలు పోలికే లేదు. 2012లో ఆస్తుల కేసుల్లో జగన్ను సీబీఐ అరెస్టు చేసినప్పుడు 16 నెలలు జైల్లో ఉన్నారు.
అప్పుడు పార్టీ గౌరవ అధ్యక్షులుగా విజయమ్మ పార్టీని ముందుకు నడిపిస్తే జగన్ కి మద్దతుగా షర్మిల పాదయాత్ర చేపట్టారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల హడావిడి నడుస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ ని గెలిపించడానికి షర్మిల ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్ ని ఓడించడానికి టిడిపి జనసేన బిజెపి లు కలిసి పోటీ చేస్తున్నాయి. మే 13 న ఎన్నికలు జరగనున్నాయి.


నెయిమర్ మూవీలో మాథ్యూ థామస్ , నస్లెన్, జానీ ఆంటోని, షమ్మీ తిలకన్, విజయరాఘవన్ కీలక పాత్రలలో నటించారు. ఈ చిత్రానికి సుధీ మాడిసన్ దర్శకత్వం వహించారు. ఇక కథ విషయానికి వస్తే, ఇద్దరు ఫ్రెండ్స్ కుంజవ (మాథ్యూ థామస్) మరియు సింటో (నస్లెన్ ) ఫుట్బాల్ అభిమానులు, అయితే వారి తండ్రుల ఒకప్పుడు మంచి మిత్రులు అయినప్పటికీ మనస్పర్ధలతో విడిపోతారు. కుంజవ, సింటో ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం చేయాలని భావిస్తారు. అదే సమయంలో కుంజవ డోనా అనే అమ్మాయిని ప్రేమిస్తాడు.
ఆమెకు కుక్కపిల్లలంటే ఇష్టమని తెలుసకుని ఒక వీధికుక్కను తీసుకుని వస్తాడు. దాని పేరే ‘నెయిమర్’. అది వచ్చిన తరువాత వారి జీవితాలలో వచ్చిన ఊహించని మలుపులు ఏమిటి అనేది మిగతా కథ. సినిమా మొదటి సగంలో, ప్రేక్షకులకు కుంజవా, సింటో మరియు వారి కుటుంబాలను పరిచయం చేశారు. ఆ తరువాత నెయిమర్ అనే కుక్క వారి జీవితంలోకి ఎలా వస్తుంది. ప్రతి ఒక్కరి పై ఎలాంటి ప్రభావం చూపింది. అనే విషయాన్ని వినోద భరితంగా సాగుతుంది.
సెకండాఫ్ గాబ్రియల్ కు వెంకట్ తో ఉన్న శత్రుత్వం మరియు ఒకరి మీద మరొకరు గెలవడానికి చేసే ప్రయత్నాలు. వారిద్దరి పరువు ప్రతిష్ఠలు ‘నెయిమర్’ తో ముడిపడి ఉండటం కొంచెం సస్పెన్స్ తో నడుస్తుంది. క్లైమాక్స్ లో డైరెక్టర్ సున్నితమైన భావోద్వేగాలతో ముడిపడిన అంశాలను చూపించారు. ఆ సీన్స్ సందేశాన్ని ఇవ్వడమే కాకుండా మూవీ చూసిన వారిని ఆలోచించెలా చేస్తాయి. కంటతడి పెట్టిస్తాయి.













