Nara Lokesh Brahmani Love Story: నారా లోకేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం లోకేష్ యువగళం పాదయాత్రను కొనసాగిస్తున్నారు. యువగళంలో భాగంగా లోకేష్ కొంత కాలం క్రితం సొంత నియోజకవర్గం అయిన మంగళగిరిలో పర్యటించారు.
అక్కడ నారా లోకేష్ విద్యార్థులు, మరియు యువతతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఈ సందర్భంగా ఒక యువతి బ్రాహ్మణితో వివాహం గురించి ముందుగా ఎవరు ప్రతిపాదన తెచ్చారని అడిగింది. అప్పుడు మీరేలా స్పందించారని అడిగింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
నారా లోకేష్ మంగళగిరిలో ఉమ్మడి గుంటూరు జిల్లా విద్యార్థులు మరియు యువతతో ఆగస్టు 16న ‘హలో లోకేష్’ పేరుతో ముఖాముఖి కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఉమ్మడి గుంటూరు, విజయవాడ నుండి పెద్ద సంఖ్యలో విద్యార్థులు, మరియు యువత తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో కొందరు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు నారా లోకేష్ జవాబు చెప్పారు.
ఈ క్రమంలోనే ఒక యువతి నారా లోకేష్ ను బ్రాహ్మణితో పెళ్లి విషయల గురించి అడిగింది. ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్తూ, నారా లోకేష్ తన భార్య బ్రాహ్మణితో లవ్ స్టోరీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. లోకేష్ మాట్లాడుతూ “తనది బ్రాహ్మణిది లవ్ ఎట్ ఫస్ట్ సైట్’ అని అన్నారు. అయితే ‘ముద్దుల మామయ్య (నందమూరి బాలకృష్ణ) దగ్గర అంత సాహసం చేసేవాడ్ని కాదని వెల్లడించారు.
ఇంట్లో అమ్మానాన్నవాళ్ళు ఒక వెకేషన్ కు వెళ్తే అక్కడ చెప్పారు. ఇలా మేము అనుకుంటున్నాం. నీ అభిప్రాయం ఏంటని అడిగారు. నా అభిప్రాయం మీకు తెలుసు కదా. వాళ్ళు ముందు అలా ప్రతిపాదించారు. బ్రాహ్మణి కూడా ఒప్పుకుంది. వివాహం జరగడం, ఆ తరువాత జరిగింది మీకు తెలిసిందే కదా” అంటూ చెప్పుకొచ్చారు. లోకేష్ ఈ విషయాలు చెప్తున్నంతసేపు ఆ ప్రాంగణమంతా అక్కడున్న విద్యార్థులు, మరియు యువత అరుపులతో మార్మోగిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
"Brahmani and I fell in love at first sight, When Brahmani accepted the marriage proposal, the rest became history" – #NaraLokesh pic.twitter.com/ab8Xg6d8G6
— Daily Culture (@DailyCultureYT) August 16, 2023
Also Read: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మాజీ ప్రధాని “మన్మోహన్ సింగ్”..! ఇలా అయిపోయారేంటి..?

అయితే విజయ్ కుమారి ముందుగా యోగా టీచర్ గా, బ్యాంకర్ గా, వాలంటీర్ గా పనిచేసేవారు. ఆమె సద్గురు భార్యగా అందరికీ పరిచయం. ఆమె కూతురు రాదే జగ్గి ఇండియన్ క్లాసికల్ డాన్సర్.



”గరుడ గమన వృషభ వాహన” మూవీ 2021లో నవంబర్ 19న రిలీజ్ అయ్యి, సంచలన విజయం సాధించింది. ఈ కన్నడ మూవీ షోలు హైదరాబాద్ వంటి పలు నగరాల్లోనూ వేశారు. ఈ మూవీ పై అంత హైప్ ఏర్పడింది. కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి, రాజ్ బి శెట్టి లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమాలో హీరోయిన్ లేదు. ఈ చిత్రానికి రాజ్ బి శెట్టి దర్శకత్వం వహించారు. థియేటర్లలో విజయం సాధించిన ఈ మూవీ ఆ తరువాత ఓటీటీలో రిలీజ్ అయ్యి, దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల ప్రశంసలు పొందింది.
ఈ మూవీ కథ విషయానికి వస్తే, ఇద్దరు మిత్రులు వారి శత్రువులను ఎదురించే క్రమంలో పెద్ద గ్యాంగ్ స్టర్స్ గా ఎదుగుతారు. ఈ నేపథ్యంలో వారిద్దరికీ ఎదురైన సమస్యలు, ఆ తరువాత వారి పతనానికి కారణం అయిన పరిస్థితుల ఏమిటనేది మిగిలిన కథ. రొటీన్ కథ అయినప్పటికీ కంప్లీట్ వయొలెంట్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డైరెక్టర్ రాజ్ బి శెట్టి మరియు రిషబ్ శెట్టిలు అద్భుతంగా నటించారు.
వారి నటనతో పాటు, యాక్షన్ సీన్స్ ఈ మూవీలో హైలైట్. మంచి కలెక్షన్స్ తో పాటు, ‘గరుడ గమన వృషభ వాహన’ విమర్శకుల ప్రశంసలను అందుకుంది. జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ విశేష ఆదరణ దక్కించుకుంది. ఈ మూవీకి జాతీయ అవార్డులలో గుర్తింపు దక్కలేదు. దాంతో ఇట్లాంటి సినిమాకి ఒక్క జాతీయ అవార్డు కూడా రాకపోవటం ఏంటి అని కామెంట్స్ చేస్తున్నారు.
టైటిల్ లో సూచించిన విధంగా ఈ మూవీ ముగ్గురు యువకుల కథ. రాబర్ట్ (షేన్ నిగమ్), డోని (ఆంటోనీ వర్గీస్) ఇద్దరు అన్నదమ్ములు, వీరి స్నేహితుడు జేవియర్ (నీరజ్ మాధవ్) తో కలిసి మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందుతారు. చర్చిలో జరుగిన పండుగలో తన తండ్రి పై చేయి వేశారని డోని రౌడీ గ్యాంగ్ ను చితకబాదుతాడు. ఆ రౌడీ గ్యాంగ్ అర్ధరాత్రి సమయంలో డోని ఇంటి పైకి వచ్చి కుటుంబంలో చిన్న పిల్లలతో పాటు అందరి పై దాడి చేస్తారు. వారికి తీవ్రమైన గాయాలు అవుతాయి.
డోని ఇంటి పై దాడి చేసిన గ్యాంగ్ ఎవరిది? ఆ గ్యాంగ్ కి డోని కుటుంబం పై ఉన్న పగ ఏమిటి? దాడి చేసిన తరువాత ఆ గ్యాంగ్ పై డోని, రాబర్ట్, జేవియర్ ఎలా పగ తీర్చుకున్నారు అనేది మిగిలిన కథ. డైనమిక్ ఫైట్ సీక్వెన్స్‌లు, హై-స్టేక్స్ స్టంట్స్, టెన్షన్-ఫిల్డ్ మూమెంట్స్ తో తెరకెక్కిన హై ఓల్టేజ్ యాక్షన్ సినిమా అని చెప్పవచ్చు. ఫ్రెండ్ షిప్, ఫ్యామిలీ, ఎమోషన్స్, మాస్, కామెడీ వంటివన్నీ ఈ చిత్రంలో ఉన్నాయి.
ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. షేన్ నిగమ్, ఆంటోనీ వర్గీస్ మరియు నీరజ్ మాధవ్ ముగ్గురు ఎక్కడా తగ్గకుండా పోటీ పడి నటించారు. విష్ణు అగస్త్య విలన్ పాత్రలో నటించాడు. విలన్ గా ఆయన లుక్స్, ఎక్స్ప్రెషన్స్ ప్రేక్షకులను సైతం భయపెట్టాయి. ఈ మూవీకి యాక్షన్ సీన్లు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ గా నిలిచాయి.



