పవన్ కళ్యాణ్ సినిమా “తమ్ముడు” అందరూ చూసే ఉంటారు. అందులో లెక్చరర్ ని బ్లాక్ మెయిల్ చేస్తూ తనకి పాస్ మార్కులు వేయించుకున్న సీన్ ఆ సినిమాకి హైలైట్. ఆ సీన్ చూసిన ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకున్నారు. అయితే ఇలాంటి సంఘటనలు కేవలం సినిమాలలో మాత్రమే జరుగుతాయి అనుకుంటే పొరపాటే.నిజ జీవితంలో కూడా ఇలాంటి స్టూడెంట్స్ చాలామంది ఉంటారు.
తాజాగా బీహార్ లో ఒక విద్యార్థి ఇంటర్ బోర్డు ఎగ్జామ్స్ రాస్తూ ఆన్సర్ షీట్ లో ఇలాగే ఒక రిక్వెస్ట్ పెట్టింది. అదేమిటో చూద్దాం. బీహార్ లో తాజాగా ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయి. ఇప్పుడు ఫలితాల కోసం పేపర్ ఇన్విజిలేషన్ జరుగుతోంది. అయితే అక్కడ కొందరు ఇన్విజిలేటర్లు విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఎందుకంటే ఆన్సర్ షీట్ లో ఆన్సర్స్ తో పాటు వాళ్ళ బాధలు, వాళ్ళ రిక్వెస్ట్ లు కూడా ఆన్సర్ షీట్స్ లో పొందుపరుస్తున్నారు. తాజాగా ఇంటర్మీడియట్ పరీక్షల ఫిజిక్స్ పేపర్ ఇన్విజిలేషన్ చేస్తున్న ఒక ఇన్విజిలేటర్ ఆన్సర్ షీట్ చూసి షాక్ అయ్యాడు ఎందుకంటే అందులో ఆ విద్యార్థి తను బాధలు చెబుతూ ఇలా రాశారు. నమస్కారం మేడం లేదా సార్.. నేను జ్యోతి, రీసెంట్ గా మా నాన్నగారు చనిపోయారు. నేను ఎగ్జామ్ కి ప్రిపేర్ కూడా అవ్వలేదు, నా ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు. దయచేసి నన్ను పాస్ చేయండి.
నా మాటలు మీరు నమ్మరని తెలుసు అయినా చెప్తున్నాను. అని రాసింది దీంతో అవాక్వవ్వడం ఇన్విజిలేటర్ వంతయింది. మరికొందరు విద్యార్థులు తమను పాస్ చేయాలి అని రిక్వెస్ట్ చేస్తే మరి కొందరు మాత్రం తాము ఫెయిల్ అయిపోతే జరిగే నష్టాలని వివరిస్తున్నారు. చాలామంది ఇన్విజిలేటర్లు ఈ పరిస్థితిని ఎదుర్కొన్నారు. విద్యార్థుల వింత పోకడలకు నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితిలో వున్నారు.

























స్త్రీలను అంత్యక్రియల్లో పాల్గొనడానికి, శ్మశాన వాటికకు వెళ్ళకుండా నిషేధించడం చాలామంది పురాణాల ఆధారంగా అధ్యయనం చేశారు. మహాభారత కాలంలో స్త్రీలు అంత్యక్రియల్లో పాల్గొనేవారని తెలుస్తోంది. భీష్ముడి దహన సంస్కారాల సమయంలో కౌరవులు, పాండవులు మాత్రమే కాకుండా మహిళలు సైతం పాల్గొన్నట్లు కనుగొన్నారు. పూర్వ కాలంలో మరణానికి, స్వర్గానికి కుమారుడు వారధి అని భావించేవారు. మరణించినవారికి అంత్యక్రియలు మరియు చితికి నిప్పు పెట్టడం వంటి ప్రక్రియ కుమారుడు చేస్తే ఆ వ్యక్తులకు స్వర్గప్రాప్తి కలుగుతుందని విశ్వాసించేవారు.
అందువల్ల కుమారుడు లేదంటే కుమారుడితో సమానమైనవారితో దహన సంస్కారాలు చేయించేవారు. పూర్వ కాలంలో స్త్రీలు చాలా సున్నితమైన వారు అని, త్వరగా భావోద్వేగానికి లోనవుతారని అనుకునేవాళ్ళు. అందువల్ల దహన సంస్కారాలను స్త్రీలు చూసి తట్టుకోలేరని, వాళ్లను అంత్యక్రియలకు దూరంగా ఉంచేవారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. స్త్రీలను స్మశాన వాటికకి రాకూడదు అనడం వెనుక ఉన్న కారణం ఏమిటి అంటే,
పూర్వకాలంలో అంత్యక్రియలు చేసేటపుడు, ఇంట్లో ఉండే వృద్దులను, పిల్లలను చూడడం కోసం. వచ్చినవారందరికి భోజన ఏర్పాట్లు చేయడం కోసం స్త్రీలు ఇంట్లోనే ఉండేవాళ్ళు. పురుషులు మాత్రమే స్మశానంకు వెళ్ళి అంత్యక్రియలు పూర్తి చేసేవారు. ఇక అంత్యక్రియలు చేసేటపుడు స్మశానంలో దుష్టశక్తులు కూడా ఉంటాయట. స్త్రీలు సున్నితంగా ఉండడం వల్ల వాళ్లను ఎక్కువ ఆకర్షించే అవకాశం ఉందని, మహిళలను స్మశాన వాటికలోకి నిషేధించారట. దహన సంస్కారాలకు వెళ్ళిన స్త్రీలు తమ వెంట్రుకలను తీసివేయాలట. ఆ కారణంగా కూడా స్త్రీలను నిషేధించారని తెలుస్తోంది.