ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిన తరుణంలో ప్రతిదీ అరచేతిలో ప్రత్యక్షమవుతుంది. 2g, 3g, 4g,5g నెట్వర్కులు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. త్వరలో 6g కూడా రాబోతోంది. ఈ తరుణంలో ప్రతి ఒక్కరు చేతిలో ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటుంది. ఇందులో అనేక యాప్స్ ఉంటాయి. దీంట్లో మనం ప్రతిరోజూ ఉపయోగించేది వాట్సాప్. ఇందులో అనేక ఫీచర్లు కూడా వస్తున్నాయి.గతంతో పోలిస్తే వాట్స్అప్ కాల్స్ మాట్లాడుకోవడం ఎక్కువ అవుతోంది. వాయిస్ కాల్స్ తో పాటుగా వీడియో కాల్స్ కూడా మాట్లాడుకునే సౌకర్యం వాట్సాప్ లో ఉన్నది. లైవ్ లొకేషన్ షేర్ చేయడం, చాట్ చేసుకోవడం, వీడియోలు, ఫోటోలు, ప్రపంచంలో ఉన్న ఎక్కడి వారికైనా పంపడం క్షణాల్లో జరిగిపోతుంది. అయితే మనం స్మార్ట్ ఫోన్ నుంచి కాల్ చేస్తే రికార్డింగ్ ఆప్షన్ ఉంటుంది. ఇదే తరుణంలో వాట్సప్ యాప్ లో ఈ సదుపాయం లేదు కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవలసి ఉంటుంది. ముఖ్యమైన విషయాలు మాట్లాడే సమయంలో రికార్డింగ్ చేస్తే అది తర్వాత మనకు ఎంతో ఉపయోగకరంగా ఉండవచ్చు. అయితే మీ దగ్గర 2 స్మార్ట్ ఫోన్లు ఉంటే వాట్సాప్ కాల్ లో స్పీకర్ ఆన్ చేసి దాన్ని రికార్డ్ చేసుకోవచ్చు. మరి ఈ తరుణంలో ఆ విషయాలు ఎవరు వినకూడదు అనుకుంటే సీక్రెట్ ప్లేస్ కి వెళ్లి రికార్డింగ్ చేసుకోవాలి. మనం వీటికోసం థర్డ్ పార్టీ యాప్స్ ను యూస్ చేయడం సురక్షితం కాదు. కాబట్టి గూగుల్ ప్లే స్టోర్ కు వెళ్లి అక్కడ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇలా చేసుకునే ముందు ఆ యాప్ కింద దాన్ని ఉపయోగిస్తున్న యూజర్ల రివ్యూలు కనిపిస్తూ ఉంటాయి. వాటిని కొంత టైం కేటాయించి చదవాలి. దీనివల్ల ఆ యాప్ సురక్షితమా కాదా అనేది మనకు తెలుస్తుంది. అయితే కాల్ రికార్డింగ్ క్యూబ్ ఏసిఆర్ అనే ఒక యాప్ ఉంది. దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకుని ఆటోమేటిక్ గా వాట్స్అప్ కాల్స్ ను రికార్డింగ్ చేస్తుంది. అంతేకాకుండా ఫేస్బుక్, టెలిగ్రామ్, స్లాక్, సిగ్నల్ యాప్ ల నుండి చేసుకునేటువంటి కాల్స్ కూడా ఈ యొక్క యాప్ లో రికార్డు అవుతాయి. దీన్ని ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఏ యాప్ కు సంబంధించి రికార్డు చేసుకోవాలో తప్పకుండా తెలియజేయాలి.
Sunku Sravan
Sunku Sravan
సుంకు శ్రావణ్ కుమార్ 2018 నుంచి 'తెలుగుఅడ్డా' లో సబ్ ఎడిటర్ గా పని చేస్తున్నాను. నాలుగేళ్ల పాటు సినిమా, పాలిటిక్స్ తదితర విభాగాల్లో పని చేశాను. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన, జాతీయ, అంతర్జాతీయ వార్తలను,సినిమా వార్తలను అందిస్తూ ఉంటాను.
మనిషి పుట్టినప్పటి నుంచి ఏజ్ పెరిగినా కొద్దీ శరీరంలో రకరకాల మార్పులు వస్తాయి. పుట్టినప్పటీ నుంచి ఐదు సంవత్సరాల వరకు చాలా క్యూట్ గా కనిపిస్తారు. ఇంకా ఏజ్ పెరిగేకొద్దీ కాస్త చేంజ్ అవుతారు. 12 నుంచి 15 ఏళ్ల మధ్యలో మరిన్ని మార్పులు వస్తాయి. 15 నుంచి 25 ఏజ్ లో యువ రక్తంతో ఉరకలు వేస్తారు.. ఇంకా వయసు పెరిగే కొంచెం కొంచెం మనలో మార్పులు చాలా జరుగుతాయి.. ఎత్తు తగ్గడం అనేది ఇందులో ముఖ్యమైంది. అయితే దీనికి ప్రధాన కారణం జన్యు లోపం అనుకుంటారు. కానీ అనేక కారణాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. వైద్యులు చెప్పిన దాని ప్రకారం ఒక వ్యక్తి 18-20 ఏండ్ల వరకు మాత్రమే ఎత్తు పెరుగుతారు. ఆ తర్వాత మనం ఎంత ఎత్తు పెరిగితే అంతే ఎత్తుతో 30-40 ఏండ్ల వరకు ఉంటాం. ఆ తర్వాత ఏజ్ లో తగ్గడం మొదలవుతుంది. సైన్స్ ఏ బి సి నివేదిక ప్రకారం చూస్తే.. ఈ వయసు తర్వాత వృద్దాప్యానికి సంబంధించిన అన్ని ప్రభావాలు శరీరంపై కనిపిస్తూ ఉంటాయి. ఇందులో ప్రధానంగా ఎత్తు ఉంటుంది. ఒక నిర్దిష్ట వయస్సు వచ్చిన తర్వాత శరీరం కుచించుకుపోవడం స్టార్ట్ అవుతుంది..
30-40 ఏండ్ల మధ్యలో ఎత్తు తగ్గడం ప్రారంభమై 10 సంవత్సరాల పాటు తగ్గుతుంది.. ఒక వ్యక్తి తన పొడవులో పాదాలు, ఎముకలు, పుర్రె పై ఎటువంటి ప్రభావం చూపదు. కానీ వెన్నుపాము పొడవు మాత్రం తగ్గడం ప్రారంభం అవుతుంది. దానిలో ఉన్నటువంటి డిస్క్ సన్నబడడం మొదలవుతుంది. దీని యొక్క ఎఫెక్ట్ మన పొడవు పైనే పడుతుంది. దీనికి అనేక కారణాలున్నాయి.. అవి ఖనిజ లవణాల కొరత వల్ల సన్నగా మారడంతో వాటి పరిమాణం తగ్గడం మొదలవుతుంది. దీంతో పాటుగా పాదాల్లోని 2 ఎముకల మధ్యలో కదలికలను సులభతరం చేసే లిగమెంట్ కూడా బలహీనంగా అవ్వడం ప్రారంభమవుతాయి. పురుషులు గానీ స్త్రీలు గానీ ఏజ్ పెరిగే కొలది ఎత్తు తగ్గడం ప్రారంభం అవుతుంది.. సాధారణంగా పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ ఎత్తు తగ్గుతారు. అని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.
మానవ శరీరంలో కొలెస్ట్రాల్స్ అనేవీ రెండు రకాలుగా ఉంటాయి. మంచి చేసేది, హాని కలిగించేది. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే బ్రెయిన్ స్ట్రోక్, గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయితే చాలామంది శరీరంలో మంచి కొలెస్ట్రాల్ ను పెంచుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు.
మంచి కొలెస్ట్రాల్ ని హెచ్ డి ఎల్ అని, చెడు కొలెస్ట్రాల్ ని ఎల్ డి ఎల్ అని పిలుస్తారు. అయితే ఈ మంచి కొలెస్ట్రాల్ మన గుండెకు మేలు చేస్తుంది. ఇది రక్తం నుంచి కొవ్వును తగ్గించడంలో సహకరిస్తోంది. కాబట్టి శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరగాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం..!
ముఖ్యంగా ప్రతిరోజు వ్యాయామం చేయడం చాలా అవసరం. రోజూ అరగంటపాటు తప్పనిసరిగా చేయాలి. జాగింగ్, స్విమ్మింగ్, నడక, పరుగు లేదంటే జిమ్ కు పెళ్లి వ్యాయామం చేయవచ్చు. అలాగే ఫాస్ట్ ఫుడ్ కి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇందులో చెడు కొలెస్ట్రాల్ పెంచే సంతృప్త కొవ్వులు, ఫ్యాట్ ఉంటాయి. అందుకే ఈ ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలి. అలాగే చక్కెర పదార్థాలు కూడా తినడం మానుకోవాలి. ఇందులో ఉండే చక్కెర వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరగడం మొదలవుతుంది.
దీనివల్ల మంచి కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. దీనికి తోడుగా బరువు కూడా తగ్గించుకోవాలి. బరువు పెరిగితే అనేక రోగాల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి బరువు పెరగకూడదు. వీటికి తోడుగా ధూమపానం, మద్యపానం కూడా మంచి కొలెస్ట్రాల్ ను తగ్గించి చెడు కొలెస్ట్రాల్ ను పెంచుతుంది.
నందమూరి కళ్యాణ్ రామ్ ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నింటిలో యాక్షన్, మరియు లవ్ స్టోరీ లు మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కానీ ప్రస్తుతం కళ్యాణ్ రామ్ సరికొత్త పిరియాడికల్ మూవీ ‘బింబిసారా’ లో న్యూ లుక్ లో కనిపించబోతున్నారు.
ఇప్పటికే ఈ సినిమా కోసం ఆయన తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్నారు. కొత్త లుక్ లో నందమూరి అభిమానులందరిని అలరించ బోతున్నారు అని చెప్పవచ్చు.
ఇప్పటికే ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యి సోషల్ మీడియాలో చాలా పాపులారిటీ పెంచుతుంది. అయితే ఈ సినిమా మొత్తం క్రీస్తుపూర్వం 5వ శతాబ్దానికి చెందిన బింబిసారుడు చరిత్ర గురించి ఉండబోతుంది అనే విషయాన్ని గమనించవచ్చు. మరి బింబిసార అంటే ఎవరు? ఆయన చరిత్రలో ఎలా నిలిచిపోయారు? అనేదానిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
బింబిసారుడు అంటే ఎవరో చూద్దాం..! 5వ శతాబ్దంలో మగధ రాజ్యాన్ని పరిపాలించిన రాజు బింబిసారుడు. ఆయన హర్యాంక వంశానికి చెందిన రాజు. ఈయన బట్టియా అనే అధిపతికి జన్మించాడు. 15 సంవత్సరాల వయసులోనే సింహాసనం అధిష్టించిన వ్యక్తి. క్రీస్తుపూర్వం 543 నుండి 492 మధ్యకాలంలోనే మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. ఈ బింబిసారుడు కోసల రాజుల్లో, మహా కోసల కూతురైన కొసలా దేవిని వివాహం చేసుకున్నాడు.
అయితే ఇందులోనే ఒక మంచి పాత్రలో కళ్యాణ్ రామ్ నటిస్తుండడంతో ఈ మూవీపై భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ మూవీ తమ సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ లో తన బావ హరికృష్ణ నిర్మాతగా మూవీ నిర్మిస్తున్నారు. దీనికి భగీరథ, బన్నీ సినిమాలను ప్రొడ్యూస్ చేసినటువంటి నిర్మాత సత్య నారాయణ కొడుకు వశిష్టు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇది కళ్యాణ్ రామ్ కు 18వ మూవీ. ఈ మూవీ కోసం దాదాపుగా 40 కోట్లు ఖర్చు పెడుతున్నారని సమాచారం. ఈ కథ మీద నమ్మకంతోనే అంత ఖర్చు పెడుతున్నట్లు సినీ వర్గాలు తెలియజేస్తున్నాయి.
చెలరేగిన చెన్నై..DCపై CSK విజయంపై ట్రెండ్ అవుతున్న మీమ్స్..!!
ఇండియన్ ప్రీమియర్ లీగ్( ఐపీఎల్ ) ఆదివారం జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ జట్టుపై చెన్నై భారీ విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్ లో చెలరేగిన ధోనీసేన ఆ తర్వాత బౌలింగులో కూడా అదరగొట్టారు. కాన్వే (87)తో దూసుకుపోగా, రుతురాజ్ (41), శివం దుబే (32), ధోని (21) రాణించగా.. చెన్నై 208 పరుగుల భారీ స్కోరును చేసింది.
లక్ష్య సాధనలో ఢిల్లీ 117 పరుగులకే మొత్తం కుప్పకూలింది. దీంతో చెన్నై జట్టు 91 పరుగుల భారీ తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. ఆదివారం రాత్రి డాక్టర్ డీవై పాటిల్ స్టేడియంలో సూపర్ విక్టరీ అందుకున్న చెన్నై, అత్యధిక రన్ రేట్ సాధించి పాయింట్ల పట్టికలో ఒక్కొక్క స్థానాన్ని మెరుగుపరుస్తుంది. మిగతా మ్యాచ్ ల్లో కూడా ఈ విధంగానే కొనసాగితే ప్లే ఆప్స్ రేస్ కు చేరుకునే అవకాశం ఉన్నది.
208భారీ పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ తేలిపోయింది. చెన్నై బౌలర్ల ప్రతాపానికి ఢిల్లీ బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోయారు. వరుసగా పెవిలియన్ బాట పట్టారు. ఢిల్లీ బ్యాట్స్ మెన్లలో అత్యధిక వ్యక్తిగత స్కోరు మిచెల్ మార్స్ చేసినవి 25 పరుగులే.. ఈ విధంగా ఢిల్లీ పై చెన్నై సూపర్ కింగ్స్ భారీ విజయాన్ని అందుకుంది.
#1
#2
#3
#4
#5
“ధోని” బ్యాటింగ్ చేసేముందు బ్యాట్ కొరకడం వెనుక… ఇంత రహస్యం ఉందా..!!
ధోని బ్యాటింగ్ చేసేముందు బ్యాట్ ను ఎందుకు కోరుకుతాడో ఇప్పటి వరకు కూడా ఎవరికి తెలియదు. ప్రస్తుతం ఆయన బ్యాట్ కొరకే ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో చాలామంది నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అసలు బ్యాట్ ఎందుకు కొరుకుతాడో దాని వెనుక ఉన్న రహస్యం ఏంటో ఓ సారి చూద్దాం..!
ధోని బ్యాటింగ్ వచ్చే ముందు తన యొక్క బ్యాట్ ను ఎందుకు నోట్లో పెట్టుకుంటాడో అమిత్ మిశ్రా ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. మహేంద్రసింగ్ ధోని తన బ్యాట్ ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని కోరుకుంటాడు.
కాబట్టి మైదానంలోకి వచ్చేముందు బ్యాట్ పై ఉన్న టేప్ లేదా త్రెడ్ లాంటివి ఏవైనా ఉంటే వాటిని తొలగిస్తాడు. బ్యాట్ ను శుభ్రం చేసుకున్న తర్వాతే మైదానంలోకి అడుగు పెడతాడని అమిత్ మిశ్రా తెలియజేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ తో ఆదివారం రోజు జరిగే మ్యాచ్ లో చెన్నై కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఎనిమిది బంతుల్లోనే 21 పరుగులు చేశారు.. అప్పటివరకు 200 లోపు స్కోర్ చేసేట్టు కనిపించిన చెన్నై జట్టు చివరికి ఆరు వికెట్ల నష్టానికి 208 పరుగులు చేయగలిగింది.
దీని అనంతరం లక్ష్యసాధనలో ఢిల్లీ జట్టు 17.4 ఓవర్లలో 117 పరుగులు చేసి అవుట్ అవగా.. చెన్నై జట్టు 97 పరుగుల భారీ స్కోరుతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో నెంబర్ 5 లో బ్యాటింగుకు దిగిన ధోని.. రెండో బంతికి సిక్స్, మూడవ బంతికి ఫోర్ కొట్టాడు. మిచెల్ మార్స్ బౌలింగ్ లో క్రిజ్ వెలుపలికి వెళ్లి లాంగ్ ఆన్ దిశలో ధోని సిక్స్ కొట్టడం చాలా ఆసక్తి కరంగా మారింది. అయితే ఆ బంతిని క్యాచ్ గా మలిచేందుకు డేవిడ్ వార్నర్ బౌండరీ లైన్ వద్ద ఎంత ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది.
కోల్కత్తా తో ముంబై మ్యాచ్ ఓడిపోవడంపై ట్రెండ్ అవుతున్న 12 ట్రోల్స్.!
వరుసగా రెండు విజయాలు సొంతం చేసుకున్న తర్వాత ముంబై ఇండియన్స్ మళ్లీ పాత కథని రిపీట్ చేస్తోంది. స్టార్ పేసర్ జస్ప్రిత్ బూమ్రా (5/10)కెరీర్ బెస్ట్ బౌలింగ్ తో చెలరేగిన, బ్యాటింగ్ లో ఇషాన్ కిషన్ (43 బాల్స్ లో ఐదు పోర్లు, ఒక సిక్స్ 51) మినహా మిగతా బ్యాటర్లు, విఫలమవడంతో, ఐపీఎల్ లో ఒకే సీజన్ లో తొలిసారి 9 ఓటములు మూటగట్టుకుంది.
సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్ లో 52 రన్స్ తేడాతో ముంబైని ఓడించిన కోల్కత్తా నైట్ రైడర్స్ ప్లే ఆప్స్ రేస్ లో నిలిచింది. టాస్ ఓడిన కోల్కతా 20 ఓవర్లలో 165/9 స్కోర్ చేసింది. వెంకటేస్ అయ్యారు (24 బాల్స్ లో 3 పో ర్లు, 4 సిక్సర్లతో 43), నితీష్ రానా (26 బాల్స్ లో 3 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 43) మంచి ప్రదర్శన కనబరిచారు.
తర్వాత ముంబై 17.3 ఓవర్లలో 113 రన్స్ చేసి ఆలౌటైంది. ఇన్నింగ్స్ మొత్తంలో ఏడుగురు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. కమ్మిన్స్ 3, రసే ల్ రెండు వికెట్లు తీశారు. ఇందులో బూమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
“సర్కారు వారి పాట” మా మా మహేశా సాంగ్ వెనకాల ఇంత కథ ఉందా..? అలా చేసిన తర్వాత..?
గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో సర్కారు వారి పాట సినిమా గురించే చర్చలు జరుగుతున్నాయి.. ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో భాగంగా అనేక ఇంటర్వ్యూలు ఇస్తోంది.. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో హీరో మహేష్ ఒక సంచలన విషయాన్ని బయట పెట్టారు..
మామ మహేష్ సాంగ్ చేసేటప్పుడు ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో వివరించారు.. అది ఏంటో ఒక సారి చూద్దాం..!! ఈ సాంగ్ చేసే సమయంలో మహేష్ బాబు షెడ్యూల్ కూడా పూర్తయిందని, చివరి సమయానికి వచ్చామని కనీసం చేసేంత ఎనర్జీ కూడా లేదన్నారు.
అప్పటికి అంతా కంప్లీట్ అయిపోయింది డబ్బింగ్ కూడా చెప్పేశారు. కానీ ఎలాగైనా ఒక మాస్ సాంగ్ పెట్టాలని మూవీ యూనిట్ భావిస్తున్నారు. ఈ క్రమంలో మహేష్ బాబు మళ్లీ కన్విన్స్ చేసి, మళ్లీ ఆ పాట షూట్ షాట్ చేశారట.. సెట్స్ కూడా పది రోజుల్లో వేసి ఆ సాంగ్ చేశారని మహేష్ బాబు అన్నారు. దీనికి ప్రధాన కారణం ఆ సాంగ్ కు తమన్ అందించిన మ్యూజిక్ బాగా అట్రాక్ట్ చేసిందని తెలియజేశాడు. కనీసం ఓపిక లేకున్నా ఆ సాంగ్ కంప్లీట్ చేశానని దీంతో చాలా రెస్పాన్స్ వచ్చిందని, అన్నిటికంటే ఎక్కువ ఎనర్జీ అందులోనే కనిపించిందని అన్నాడు.
పది రోజుల్లోనే సెట్స్ వేశారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ లో ఐదు రోజుల్లో పూర్తి పాటను కంప్లీట్ చేసి మహేష్ బాబు ఐదవ రోజు అబ్రాడ్ వెళ్ళిపోయారు. ఈ సినిమాలో ఇప్పటివరకు ఏ మూవీలో చేయని విధంగా పాత్ర కొత్తగా ఉందని ఆయన అన్నారు.. మూవీ కోసం యూనిట్ అంతా చాలా కష్టపడ్డారని తెలియజేశారు. ఈనెల 12వ తేదీన మూవీ థియేటర్లలోకి రానుంది కాబట్టి దాని భవితవ్యమేమిటో తెలిసిపోతుంది..
“ఇప్పుడు ఇది చూసి నవ్వమంటారా.?” అంటూ F3 ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 ట్రోల్స్.!
హీరో వెంకటేష్ ఆల్ రౌండర్ యాక్టర్.. అలాగే మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ కూడా తన పర్ఫామెన్స్ తో హీరోగానే కాకుండా ఆల్ రౌండ్ యాక్టింగ్ తో అదరగొడుతున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఎఫ్2 మూవీ “ప్రస్టేషన్ ప్రస్టేషన్ అంటూ” మనల్ని కడుపుబ్బ నవ్వించింది. అయితే ఈ f3 సినిమా కోసం చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నాము. ఈ తరుణంలో మూవీ యూనిట్ సమ్మర్ సోగ్గాడు అనే పేరుతో ట్రైలర్ రిలీజ్ చేసింది. ఈ మూవీకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే మే 27వ తేదీన ఎఫ్ 3 సినిమా థియేటర్లలోకి రానుంది.
అయితే ట్రైలర్ విడుదలతో ప్రేక్షకులు విపరీతంగా ఆకట్టుకుంటోంది.. ఇది రిలీజ్ అయిన కాసేపటికే వేలల్లో వ్యూస్ వచ్చాయి అంటే వెంకి మామ కి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.. ఈ ట్రైలర్ చూస్తే మురళి శర్మ వాయిస్ ఓవర్ తో మొదలైంది.. ప్రపంచానికి తెలిసిన పంచభూతాలు ఐదు అంటూ.. కానీ ఆరో పంచభూతములు అంటూ చెప్పిన డైలాగ్ ఆ తర్వాత వరుణ్ తేజ్ వెంకటేష్ స్క్రీన్ మీదకు వచ్చారు.. దీని తర్వాత హీరోయిన్ లు తమన్నా,మెహరీన్ లను చూపించారు.
డబ్బు ఉన్నోడికి ఫన్ లేనివారికి ప్రస్టేషన్ అని మురళీ శర్మ నోటివెంట మరో డైలాగ్.. దీంతో కథ మొదలవుతుంది.. ఇందులో రేచీకటి ఉన్న వ్యక్తిగా వెంకటేష్, నత్తి ఉన్న వ్యక్తిగా వరుణ్ తేజ్ నా పాత్రలు ఉండబోతున్నాయి.. అయితే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో “వెంకీ కూడా ఓవరాక్షన్ స్టార్ట్ చేశాడా.. మాయల మరాఠీ దగ్గుబాటి, నెక్స్ట్ లెవెల్ ఓవరాక్షన్, అసలు కామెడీయేనా ఎఫ్ 2 చూడు, మరి కొంతమందేమో ట్రైలర్ చాలా బాగుంది అనిల్ రావిపూడి చేసిన ఈ మూవీ ఇండస్ట్రీలోనే చరిత్ర క్రియేట్ చేస్తుంది అంటూ” మీమ్స్ వైరల్ అవుతున్నాయి.
watch video:
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
రోహిత్ శర్మ కొట్టిన ఆ సిక్స్ కి 5 లక్షలు…అదెలాగో తెలుసా.? ఆ డబ్బు ఏం చేస్తారు.?
ప్రముఖ క్రికెట్ స్టార్ రోహిత్ శర్మ అంటే తెలియని వారు ఉండరు.. ఆయన ఆటకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు.. ఆయన బ్యాట్ పట్టాడంటే గ్రౌండ్ అంతా అదిరి పోవాల్సిందే.. అంతటి పర్ఫార్మర్ రోహిత్.. టీమిండియా స్టార్ క్రికెటర్ కెప్టెన్ రోహిత్ ఈమధ్య కొట్టిన ఒక సిక్స్ కు ఏకంగా 5 లక్షల రూపాయలు వచ్చాయట.. ఆ డబ్బులను ఖడ్గమృగాల సంరక్షణకు ఉపయోగిస్తారట..
హిట్ మాన్ కొట్టిన సిక్స్ టాటా స్పాన్సర్ కారుపై పడే విధంగా కొట్టడంతో 5 లక్షల రూపాయలు వచ్చాయి.. అయితే టాటా కంపెనీవారు గ్రౌండ్ లోని ఒక చిన్న పొడియంలో ఆ కారు ఉంచారు. అయితే ఆ కారుపై పడ్డ ప్రతి బాలుకు 5 లక్షల రూపాయలు అస్సాం రాష్ట్రంలోని కజిరంగా ఖడ్గమృగాల సంరక్షణకు విరాళంగా అందజేస్తామని తెలియజేశారు.. ఈ స్పాన్సర్లు మాట ఇచ్చినట్లే రోహిత్ కార్ మీద బాల్ పడేలా సిక్స్ కొట్టాడు..
దీంతో వారు ఐదు లక్షల రూపాయలు ఖడ్గమృగాల సంరక్షణకు అందించారు.. రోహిత్ పుణ్యమాని ఖడ్గ మృగాలు పూర్తిగా ఆహారాన్ని తింటాయి.. అయితే రోహిత్ కు ఖడ్గమృగాల అంటే చాలా ఇష్టం.. వీటి సంరక్షణకు గతంలో సహ కారం అందించాలని చాలామందికి విజ్ఞప్తి చేశారు.. ఇప్పుడు తన వల్లే జంతు వులకు మేలు జరుగుతుందని ఇంకా ఆనందంలో మునిగి పోతున్నాడు..
శుక్రవారం గుజరాత్ మరియు ముంబై కి జరిగిన మ్యాచ్ లో ఈ సిక్సర్లు కొట్టాడు. దీంతో ముంబై టీమ్ కు 200 సిక్సర్లు అందించి ఒకే ఫ్రాంచైజీలో 200 సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ళ క్లబ్ లో చేరిపోయాడు. ఈ ఫ్రాంచైజీ కి ఎక్కువ సిక్సర్లు కొట్టిన అయిదవ ప్లేయర్ గా రోహిత్ నిలిచారు.