బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఇక ముగింపు దశకు రాబోతోంది. కాజల్ ఇంటి నుండి వెళ్ళిపోయాక ప్రస్తుతం ఓటింగ్ వార్ లో ఐదుగురు టాప్ కంటెస్టెంట్లు పోటీ పడుతున్నారు. టాప్ లో సన్నీ మరియు షణ్ముఖ్ వున్నారు. అయితే ఫినాలే ఎపిసోడ్ గురించి అందరూ ఎదురు చూస్తున్నారు.
ఫినాలే ఎపిసోడ్ ఒక లెక్కలో ఉంటుందని అందరికీ తెలుసు. అయితే ఈ సారి గెస్టులకి సంబంధించి కొన్ని వివరాలు కూడా తెలుస్తున్నాయి. ఈసారి ఫినాలే ఎపిసోడ్ కి ఎవరు వస్తున్నారు అనే విషయంలోకి వస్తే…
గెస్టుల లిస్టులో రణ్వీర్ సింగ్, దీపికా పదుకొనె, అలియా భట్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రాబోతున్నట్లు తెలుస్తోంది. 83 సినిమా ప్రమోషన్ కోసం రణ్వీర్, దీపిక, ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ కోసం రామ్ చరణ్ అలియా భట్ రాబోతున్నట్టు సమాచారం. అంతే కాకుండా నాగార్జున, అలియా భట్ కలిసి బ్రహ్మాస్త్ర అనే హిందీ సినిమాలో కూడా నటించారు. అయితే మరి ఎప్పుడు కంటే కూడా ఈ ఫినాలే ఎపిసోడ్ బాగుంటుందా..? ఈసారి ఎలా ఆడియన్స్ ని అలరించబోతున్నారు అనేవి చూడాలంటె మరి కొన్ని రోజులు ఆగక తప్పదు.