భారత దేశంలో ప్రసిద్ధి చెందిన ఆలయాలు చాలా ఉన్నాయి. వాటిలో వారణాసిలోని శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయం కూడా ఒకటి. కార్తీక మాసంలో శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అలాగే పెద్ద ఎత్తున భక్తులు కూడా పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది.
నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉండే వారణాసి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయం మూత పడనుంది. ఎంతో పవిత్రమైన కార్తీక మాసంలో ఆలయం ఎందుకు మూతపడనుండి..? దీనికి గల కారణం ఏమిటి..? మామూలుగా ఎన్నో ఆలయాలు పునరుద్ధరణ జరుపుకుంటూ ఉంటాయి. ఇందులో భాగంగా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం మూడు రోజుల పాటు మూసివేయనున్నారు.
నవంబర్ 29వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు భక్తులకి అనుమతి లేకుండా ఆలయాన్ని మూసివేయనున్నారు. ఇలా ఆలయాన్ని మూసివేయడం ఇది రెండవ సారి. కరోనా మహమ్మారి కారణంగా మొట్టమొదటిసారి ఆలయాన్ని మూసివేశారు. ఇప్పుడు రెండోసారి మూడు రోజులపాటు ఆలయాన్ని మూసివేయనున్నారు.