రవి ప్రకాష్ గురించి కొత్తగా పరిచయం చెయ్యక్కర్లేదు. చాలా సినిమాల్లో రవి ప్రకాష్ నటించాడు మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో ఆఫర్లని అందుకుంటున్నాడు. నెగిటివ్ రోల్స్ పాజిటివ్ రోల్స్ ఇలా చాలా పాత్రలని ఇప్పటికే రవి ప్రకాష్ చేశాడు. తెలుగు మాత్రమే కాకుండా మలయాళ సినిమాలు, తమిళ్ సినిమాలలో కూడా నటించాడు.
మంచి గుర్తింపు కూడా రవి ప్రకాష్ కి వచ్చింది. ఏకంగా 200 కు పైగా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించాడు. ఇది మామూలు విషయం కాదు. హీరోగా కూడా రవి ప్రకాష్ చేశాడు.
ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై శుభవేళ అనే సినిమాలో హీరోగా నటించి మెప్పించాడు రవి ప్రకాష్. అయితే సినిమా అంత హిట్ అవ్వక పోయినా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రం మంచి గుర్తింపు వచ్చింది. ఈశ్వర్, సీతయ్య, ఘర్షణ, మొదటి సినిమా, 123 ఫ్రమ్ అమలాపురం, అతడు, షాక్ మొదలైన ఎన్నో చిత్రాల్లో నటించాడు. తాజాగా రవి ప్రకాష్ కి సంబంధించి కొన్ని విషయాలు బయట కి వచ్చాయి.
విశాఖపట్నం లో రవి ప్రకాష్ జన్మించాడు. పైగా విశాఖపట్నం లోనే ఉంటున్నాడు. మాస్కో లో రవి ప్రకాష్ ఎంబీబీఎస్ ని కంప్లీట్ చేశాడు. తర్వాత హైదరాబాద్ లో ప్రాక్టీస్ కూడా చేశాడు. ఈ విషయాలన్నీ రవి ప్రకాష్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు. సినిమాల్లోకి రాక ముందు రవి ప్రకాష్ డాక్టర్ గా సేవలను అందించాడు.