టీమ్ ఇండియా క్రికెట్ ఆడితే ప్రతి ఒక్కరు టీవీకి అతుక్కుని కూర్చుంటారు ఖచ్చితంగా ఇండియన్ టీమ్ ని ప్రోత్సహిస్తూ ఉంటారు. క్రికెట్ ఆడడానికి చూడడానికి కూడా ఎంతో ఆసక్తిగా ఉంటుంది. పైగా క్రికెట్ ఆట కి కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు. అందరూ జట్టుని సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఐపీఎల్ మ్యాచ్లు అయితే నిజంగా ఆసక్తికరంగా ఉంటాయి.
ప్రతి ఒక్కరు కూడా ఐపీఎల్ ని ఇష్టపడుతూ ఉంటారు. వాళ్లకి నచ్చిన జట్టుని ప్రోత్సహిస్తూ ఉంటారు. క్రికెట్ ఆటలో చాలా రూల్స్ ఉంటాయి అయితే మనకి అన్నీ తెలియకపోవచ్చు.
కొన్ని కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. అప్పుడప్పుడు మనకి ఏదైనా రూల్ కానీ మనకి తెలియని ఏదైనా విషయం కానీ తెలిస్తే దాని వెనుక ఇంత కారణము ఉందా అని షాక్ అవుతూ ఉంటాము. క్రికెట్ ఆడేటప్పుడు ఆటగాళ్లు పిచ్ ని బ్యాట్ పెట్టి చూస్తూ ఉంటారు. మీరు దీన్ని ఎప్పుడు అయినా గమనించారా..? ఆటగాడు పిచ్ ని బ్యాట్ తో టచ్ చేసి చూస్తారు. క్రికెట్ ఆడేటప్పుడు మరి ఎందుకు ఇలా చేస్తారు దీని వెనక కారణం ఉందా లేదా అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.. బ్యాట్స్ మ్యాన్ బ్యాట్ తో పిచ్ ని చూస్తారు ఎందుకంటే క్రికెట్ ఆడేటప్పుడు పిచ్ అనేది ఒకేలా ఉండదు ఇది మారుతూ ఉంటుంది.
అయితే క్రికెట్ ఆడేటప్పుడు పిచ్ ని బ్యాట్ పెట్టి చెక్ చేస్తే వాళ్ళకి ఇది బాగా తెలుస్తోంది. ఇలా చెక్ చేసే పద్ధతిని ‘గార్డెనింగ్’ అని అంటారు. ఒకవేళ కనుక పిచ్ మీద ఉబ్బెత్తుగా ప్యాచ్ లు వంటివి ఉంటే బ్యాట్ తో వాటిని సరి చేయగలరు ఒకవేళ కనుక ఎక్కడైనా రఫ్ ప్యాచ్ లు వంటివి ఉన్నా కూడా బ్యాట్ ని పెట్టి వాటి మీద టచ్ చేయడం వలన అవి తొలగిపోతాయి. అలానే క్రికెట్ ఆడేటప్పుడు ఆటగాళ్ల మీద ఒత్తిడి ఎంత ఉంటుందో చెప్పక్కర్లేదు. ఆ ఒత్తిడిని దూరం చేయడానికి కూడా కొంతమంది బ్యాట్స్మెన్స్ ఇలా బ్యాట్ తో పిచ్ ని కొడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి దీని వలన బౌలర్ రిథమ్ దెబ్బతింటుంది అందుకని చాలామంది ఇలా చేస్తూ ఉంటారు.