





నితిన్ కల్యాణానికి ముహూర్తం కుదిరింది. దుబాయ్ వేదికగా పెళ్లి జరగనుంది. ఇప్పుడు నితిన్ చేస్తున్న ‘భీష్మ’ సినిమా ట్యాగ్‌లైన్ ‘ది బ్యాచ్‌లర్’. అయితే నితిన్ బ్యాచ్‌లర్ లైఫ్‌కి ఫుల్స్టాప్ పడబోతోంది. పెళ్లి పనులు స్టార్టడ్, మ్యూజిక్ స్టార్ట్స్ అని ట్విట్టర్ లో ట్వీట్ చేసి నిశ్చితార్థం ఫోటోలు పంచుకున్నాడు నితిన్.ఈ పోస్ట్ కి ఎంతో మంది సెలబ్రిటీస్ రిప్లైలు కూడా ఇచ్చారు, కంగ్రాట్స్ తెలిపారు.

ఇది ఇలా ఉండగా…నితిన్ కి కాబోయే భార్య గురించి తెలుసుకోడానికి నెటిజెన్లు ఎంతో సెర్చ్ చేస్తున్నారు. మరి షాలిని గురించి తెలుసుకుందాము రండి. ‘ఇష్క్’ (2012) సినిమా జరుగుతున్న సమయంలో కామన్ ఫ్రెండ్ ద్వారా నితిన్ షాలిని కలుసుకున్నారు. చూడగానే నా మనసుకు తను బాగా నచ్చింది. ముందు ఫ్రెండ్స్‌లానే ఉన్నాం. కొంత సమయం తరవాత ఒకరినొకరు అర్థం చేసుకున్నాక నెక్ట్స్ స్టెప్ తీసుకున్నాం. గత ఏడాది ఇంట్లోవాళ్లకు చెప్పాం. ఇంట్లోవారికి చెప్పగానే రెండు కుటుంబాలవారు ఎటువంటి అభ్యంతరం లేకుండా అంగీకరించారు అంటూ ఓ ఇంటర్వ్యూలో నితిన్ తెలిపారు.

ఇక షాలిని గారి విషయానికి వస్తే….ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కందుకూరులో 1989 సెప్టెంబర్ 27న షాలిని జన్మించారు. ఆమె తల్లిదండ్రులు డాక్టర్లు. షాలిని చిన్నతనంలోనే కుటుంబం హైదరాబాద్ వచ్చేసింది. సెయింట్ మేరీస్ హైస్కూల్లో చదివి తర్వాత గ్రాడ్యుయేషన్ కోసం లండన్ వెళ్లిపోయారు. యూనివర్సిటీ ఆఫ్ లండన్‌లో ఎంబీఏ పూర్తి చేశారు. ప్రస్తుతం ఒక ఎమ్.ఎన్.సి లో హెచ్ఆర్ గా చేస్తున్నారు.

నితిన్ షాలిని నాలుగు సంవత్సరాల నుండి ప్రేమించుకుంటున్నారు. ఈ విషయాన్ని నితిన్ చాలా సీక్రెట్‌గా ఉంచారు.మొదట నితిన్ కి పెళ్లి కుదిరింది అని వార్త రాగానే అందరు పెద్దలు కుదిరిచ్చిన పెళ్లి అనుకున్నారు. ఆయనే స్వయంగా లవ్ మ్యారేజ్ అని చెప్పేసరికి అందరు ఒక్కసారిగా అవాక్కయ్యారు.

దుబాయ్‌లోని పలాజో వెర్సాసెలో ఏప్రిల్ 15 వ తేదీన నితిన్ వివాహ వేడుక జరగనుంది. ఏప్రిల్ 16వ తేదీన రిసెప్షన్ నిర్వహించనున్నట్టు తెలిసింది. ఇది ఇలా ఉండగా…వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న భీష్మ చిత్రం ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకి రానుంది. నితిన్, రష్మిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై యువ నిర్మాత సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్నారు. మరి అటు సినిమా ఇటు లైఫ్ రెండు సక్సెస్ అవ్వాలని నితిన్ కి విషెస్ తెలుపుదాం.
ప్రపంచాన్ని వణికించిన కరోనా ఇండియాలోని కేరళ లోకి కూడా ప్రవేశించిన సంగతి తెలిసిందే. చైనాలోని వుహాన్‌లో మెడిసిన్ చదువుతున్న ముగ్గురు విద్యార్థులు… ఇటీవలే భారత్ తిరిగొచ్చారు. ప్రాథమిక వైద్య పరీక్షల్లో వారికి కరోనా సోకినట్టు గుర్తించారు. దీంతో వారిని కేరళలో కాసర్ గోడ్ జిల్లా కన్హంగాడ్‌లో చికిత్స నందిస్తున్నారు. అయితే వీరి గురించి ఓ మంచి వార్త మనముందుకు వచ్చింది.

ఆ ముగ్గురు ఇప్పుడు కోలుకున్నారు. వారిని డిశ్చార్జ్ కూడా చేసారు. ఈ నేపథ్యంలో ఇవాళ కేరళ ఆరోగ్యమంత్రి థామస్ ఐజక్ ట్విటర్లో ‘‘నిపా కేసులో మాదిరిగానే, కరోనా వైరస్‌పై పోరాటంలో కేరళ విజయం సాధించింది. కరోనా బారిన పడిన ముగ్గురూ పూర్తిగా కోలుకున్నట్టు కేంద్ర ప్రభుత్వ అధికారులు నిర్థారించారు. క్వారంటైన్ పరిశీలనలో వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతూ వస్తోంది. ఆరోగ్య శాఖకు అభినందనలు..’’ అని ట్వీట్ చేసారు.

వారిలో త్రిశూర్‌కు చెందిన ఓ విద్యార్థిని రక్త నమూనాలను తాజాగా అలెప్పీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో పరీక్షించగా.. వైరస్ జాడ కనిపించలేదని సీనియర్ వైద్యాధికారి ఒకరు తెలిపారు. దీంతో విద్యార్ధిని డిశ్చార్జ్ చేసినట్లు కాసర్ గోడ్ జిల్లా వైద్య అధికారి ఇన్ఛార్జ్ డాక్టర్ రామ్‌దాస్ తెలిపారు. 18రోజుల చికిత్స అనంతరం విద్యార్ధిని డిశ్చార్జ్ అయ్యారు. మరో పదిరోజులు ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోవాలని, ఎలాంటి మెడిసిన్ అవసరం లేదని రామ్ దాస్ చెప్పారు.
రష్మిక కుక్క బిస్కెట్ లు తింటుంది అని అందరు ట్రోల్ చేస్తూ ఉన్నారు. కానీ అసలు ఆమె ఏం చెప్పింది అనేది మాత్రం చాలా మందికి తెలీదు. నితిన్ , రష్మిక జంటగా నటించిన చిత్రం “భీష్మ”. ఈ సినిమా ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యం లో నితిన్ తో కలిసి రష్మిక కూడా ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తానె స్వయంగా కుక్క బిస్కెట్ తిన్నట్టు ఒప్పుకుంది రష్మిక. ఇక వివరాల లోకి వెళ్తే..

ఇంటర్వ్యూ లో భాగంగా “మీ గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పండి” అని యాంకర్ ప్రశ్నించగా.. ఈ కుక్క బిస్కెట్ల విషయం బయటికొచ్చింది.నితిన్ రష్మిక గురించి ఈ విషయం చెప్తుంటే నితిన్ ని రష్మిక అడ్డుకుంటూ వచ్చింది. లాస్ట్ కి తానె ఒప్పుకుంది. అప్పుడు అసలు కథ చెప్పింది. ఓ సారి షూటింగ్ లో నితిన్ కి రష్మిక కుక్క బిస్కెట్ లు తిన్నట్టు చెప్పింది అంట.

రష్మిక కి చిన్నప్పటి నుండి క్యూరియాసిటీ ఎక్కువ అంట. ఆ క్యూరియాసిటీ వల్లే ఇలా జరిగింది అని చెప్పింది. ఎప్పటినుండో అసలు కుక్క బిస్కెట్ ల టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అనుకుంది అంట. ఆ క్రమంలోనే ఓ సారి తిన్నా అని చెప్పుకొచ్చింది. అంతేకాదు టేస్ట్ కూడా పర్లేదు అని చెప్పింది రష్మిక. ఆ వీడియో మీరే చూడండి!
watch video:
విజయ్ దేవరకొండ, రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా వరల్డ్ ఫేమస్ లవర్. ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. దర్శకుడు మాధవ్ డిఫ్రెంట్ స్టోరీతో వచ్చినప్పటికీ క్లైమాక్స్ లో అదే మూసపద్ధతిలో ఎండ్ పలుకుతాడు. విజయ్, రాశి, ఐశ్వర్య రాజేష్ లు యాక్టింగ్ పరంగా వదిగిపోయారు.

ఫస్ట్ ఆఫ్ బాగున్నప్పటికీ సెకండ్ ఆఫ్ ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తుంది.సాంగ్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. దర్శకుడు సెకండ్ ఆఫ్ లో ఎమోషనల్ కాస్త ఎక్కువగా చూపించాలని ప్రయత్నించినప్పటికీ పండించటంలో నటి, నటులు ఫెయిల్ అయ్యారనిచెప్పాలి.ఈ సినిమా చూసిన ఆడియన్స్ మాత్రం పబ్లిక్ టాక్ లో దీనంత చెత్త సినిమా ఇప్పటివరకు చూడలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సహనానికి పరీక్ష పెట్టారు అంటున్నారు. ఇకనైనా విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి ఫీవర్ నుండి బయటకి వచ్చి వేరే జోన్ సినిమాలు చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు.

విజయ్ నటన బాగున్నప్పటికీ సినిమాలో కంటెంట్ లేకపోవడంతో ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. మొత్తం మీద ప్లాప్ అనే చెప్పాలి. మరి ఈ సినిమాని సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రోల్ల్స్ చేస్తున్నారో మీరే చూడండి. చూస్తే నవ్వకుండా ఉండలేరు. సినిమా చూడటం కంటే ఈ ట్రోల్ల్స్ చూడటం బెటర్ అనుకుంట.!
watch video:
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసే పండగ వచ్చేస్తోంది.. ఈ ఏడాది సీజన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెబుతూ ఐపీఎల్ 2020 షెడ్యూల్ ప్రకటించారు. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ , చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఏడాది ఐపీఎల్ లో తొలి మ్యాచ్ ఆడనున్నాయి. మార్చి 29న ముంబై వేదికగా జరిగే ఈ మ్యాచ్ తో ఐపీఎల్ 13వ ఎడిషన్ షురూ కానుంది. ఈ సీజన్ మార్చి 29వ తేదీన ప్రారంభం కానుంది.. మే 24వ తేదీన ముగియనుంది. ఇక, గత సీజన్ల కంటే ఈ ఏడాది అదనంగా ఆరు రోజులు క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. మొదటి మ్యాచ్ మార్చి 29న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య వాంఖడే స్టేడియంలో జరుగనుండగా ఫైనల్ కూడా అక్కడే నిర్వహించనున్నారు..గత సీజన్లో 44 రోజుల పాటు ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించగా.. ఈ సీజన్లో 50 రోజులు మ్యాచ్‌లు కనువిందు చేయనున్నాయి. ఆదివారాలు రెండు మ్యాచ్ లు జరుగనున్నాయి.

#IPL2020 schedule
తాగిన మందు తలకెక్కింది. ఇంకేముంది మత్తులో ఉన్న మందుబాబు డ్యూటీలో ఉన్న పోలీసులనే చెడుగుడు ఆడేశాడు. పోలీసులకు కొద్దిసేపు చిరాకు తెప్పించాడు ఆ మందు బాబు. బండి దిగు అంటే ఎందుకు దిగాలి , నాకేం అవసరం అంటూ గోల చేసాడు. అతన్ని బండి ఎక్కిద్దాం అని చూసిన పోలీసులకు చుక్కలు చూపించాడు. నన్ను పట్టుకుంటారు ఎందుకు అని సతాయించాడు. స్టేషన్ కి తీసుకెళ్లారు అంతేగా తీసుకెళ్లండి. నేనేం తప్పు చేయలేదు. మహా అయితే కొడతారు చంపుతారు అంతే గా అంటూ హడావిడి చేసాడు. ఈ వీడియో అక్కడి వారు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసారు. ఇది చూసిన వారు అందరు నవ్వుకుంటున్నారు. ఈ వీడియో ఇప్పుడు హల్చల్ చేస్తుంది. మీరు కూడా ఒక లుక్ వేసుకోండి.

గతంలో ఇలాగె ఒకడు తాగి పోలీసులకి దొరికి రాదు రాదు అనే డైలాగ్ తో ఎంత ఫేమస్ అయ్యాడో మీకు తెలిసిందే. గవర్నమెంట్ స్పెల్లింగ్ వచ్చా రాదు అనే డైలాగ్ ఎంతో మంది టిక్ టాక్ లో వీడియోలు కూడా చేసారు. మీకు కూడా గుర్తుండే ఉంటది.
watch video:
గతనెల మూడో తేదీన సోషల్ మీడియాలో ఓ పోస్టు బాగా వైరల్ అయ్యింది. ఓ మహిళ ముగ్గురు పిల్లలతో కలిసి ఇటుకల బట్టీ దగ్గర నిలబడిన ఫొటో అది.ఈ ఫొటో వెనుక గుండెను బరువెక్కించే విషాదకరమైన కథ ఉంది.ఆకలికి పేద గొప్పా తేడా తెలియదు. తినటానికి తిండి లేకపోయినా ఆకలి అనేది మనిషికే కాదు ప్రతీ జీవికి సర్వసాధారణం.అలా కడుపేదరికంలో మగ్గిపోతున్న ఓ తల్లి కడుపున బిడ్డలకు పట్టెడన్నం పెట్టటానికి చేసిన పని మనస్సుల్ని కలచివేస్తోంది.తమిళనాడులోని సేలంకు చెందిన సెల్వం, ప్రేమ దంపతులకు ముగ్గురు పిల్లలు. సెల్వం, ప్రేమ ఇటుక బట్టీలో పని చేస్తుండేవారు. సొంతంగా వ్యాపారం చేయడానికి సెల్వం అప్పు చేశాడు. వడ్డీతో కలిపి ఆ అప్పు రూ. 2.5 లక్షలు అయింది. వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. కొందరు మోసగించారు. దీంతో ఏడు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తల్లి ముగ్గురు బిడ్డలు వీదిన పడ్డారు.ఇంట్లో అన్ని అమ్మేసి అప్పులకు కట్టేసింది. తమకంటూ ఏమి మిగల్లేదు. ఉండటానికి గూడు తప్ప.. బంధువులు, ఇరుగుపొరుగు వారు పట్టించుకోలేదు.

బిడ్డల ఆకలి కేకలను చూడలేక అల్లాడిపోయింది. ఇంతలో వెంట్రకులు కొంటామంటూ పిలుపు వినిపించింది. అంతే.. ఇంట్లోకి పరిగెత్తుకెళ్లి తన జుట్టును కత్తిరించి తీసుకొచ్చి అమ్మేసింది. ఆ జుట్టుకు అతడు రూ.150 ఇచ్చాడు. పక్కనే ఉన్న దుకాణానికి వెళ్లి ఇంట్లోకి బియ్యం, సరుకులు తెచ్చింది. పొయ్యి వెలిగించి అన్నం వండి పిల్లలకు కడుపునిండా పెట్టింది.ప్రేమ ఆకలి కష్టాలు తెలుసుకున్న బాలా అనే గ్రాఫిక్ డిజైనర్ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో నెటిజన్లు చలించి ఆమెకు రూ.1.45 లక్షల వరకు ఆర్థిక సాయాన్ని అందించారు. ఆ మొత్తాన్ని ప్రేమకు ఇచ్చాడు.. ఇటుకబట్టీలో పనికి కూడా కుదిర్చాడు. ప్రేమ పరిస్థితి గురించి తెలిసిన సేలం జిల్లా అధికారులు కూడా స్పందించి వితంతు పింఛన్ మంజూర్ చేశారు. ప్రభుత్వం ప్రేమకు వితంతు పెన్షన్‌ను మంజూరు చేసింది.
నితిన్ కల్యాణానికి ముహూర్తం కుదిరింది. దుబాయ్ వేదికగా పెళ్లి జరగనుంది. ఇప్పుడు నితిన్ చేస్తున్న ‘భీష్మ’ సినిమా ట్యాగ్‌లైన్ ‘ది బ్యాచ్‌లర్’. అయితే నితిన్ బ్యాచ్‌లర్ లైఫ్‌కి ఫుల్స్టాప్ పడబోతోంది. పెళ్లి పనులు స్టార్టడ్, మ్యూజిక్ స్టార్ట్స్ అని ట్విట్టర్ లో ట్వీట్ చేసి నిశ్చితార్థం ఫోటోలు పంచుకున్నాడు నితిన్. పెళ్లి పనులు స్టార్టడ్ అని కూడా అన్నాడు. ఈ పోస్ట్ కి ఎంతో మంది సెలబ్రిటీస్ రిప్లైలు కూడా ఇచ్చారు, కంగ్రాట్స్ తెలిపారు.

ఇది ఇలా ఉండగా.. నితిన్, రష్మిక జంటగా నటించిన భీష్మ త్వరలో ప్రేక్షకుల ముందుకి రానున్న సంగతి అందరికి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాలోని రెండు పాటలు ప్రజాధారణ పొందాయి. ఇక అసలు విషయానికి వస్తే…మొన్నేమో నితిన్ భీష్మ సినిమాలోని “సింగిల్స్ ” సాంగ్ షేర్ చేసి ఫరెవర్ సింగల్ అన్నాడు. నిన్నేమో పెళ్లి పనులు స్టార్టడ్ అని పోస్ట్ చేసాడు. దీనిపై నెటిజెన్స్ ఫన్నీ ట్రోల్ల్స్ చేస్తున్నారు. అప్పుడు సింగల్ బెస్ట్ అని ఇప్పుడు పెళ్లి పనులు స్టార్టడ్ అంటావా అంటూ సరదా ఛలోక్తులు విసురుతున్నారు.

దుబాయ్‌లోని పలాజో వెర్సాసెలో ఏప్రిల్ 15 వ తేదీన నితిన్ వివాహ వేడుక జరగనుంది.
ఏప్రిల్ 16వ తేదీన రిసెప్షన్ నిర్వహించనున్నట్టు తెలిసింది. ఇది ఇలా ఉండగా…వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న భీష్మ చిత్రం ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకి రానుంది. నితిన్, రష్మిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై యువ నిర్మాత సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్నారు. మరి అటు సినిమా ఇటు లైఫ్ రెండు సక్సెస్ అవ్వాలని నితిన్ కి విషెస్ తెలుపుదాం.
ఉసేన్ బోల్ట్‌ను ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తిన రన్నర్‌గా అంతా గుర్తుపెట్టుకుంటారు. 100మీ. రేసును కేవలం 9.58 సెకన్లలోనే పూర్తి చేసిన ఒకేఒక్క అథ్లెట్‌గా నిలిచాడు. అయితే అతడిని మించిన వేగంతో శ్రీనివాస గౌడభారత్‌లో రాత్రికి రాత్రే సూపర్‌స్టారయ్యాడు.కర్ణాటకలోని మంగళూరు సమీపంలోని ఐకళ ప్రాంతంలో ఈ నెల 1న నిర్వహించిన కంబళ పోటీలో వంద మీటర్ల దూరాన్ని శ్రీనివాస గౌడ కేవలం 9.55 సెకన్లలో పరుగెత్తడం సంచలనంగా మారింది. ఐకళలో తన దున్నలతో కలిసి 142.50 మీటర్ల దూరాన్ని 28 ఏళ్ల శ్రీనివాస గౌడ 13.62 సెకన్లలో పరిగెత్తినట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ లెక్కన అతడు వంద మీటర్ల పరుగును కేవలం 9.55 సెకన్లలో పూర్తిచేసినట్లన్నమాట.

బురద మళ్లలో పోటీదారులు తమ దున్నలతో కలిసి వేగంగా పరిగెత్తాల్సి ఉంటుంది. నగదు బహుమతి రూ.లక్షల్లో ఉంటుంది. వేగంగా పరిగెత్తించేందుకుగాను దున్నలను పోటీదారులు కొరడాతో బలంగా కొడుతుండటంపై జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేయడంతో కొన్నేళ్ల క్రితం కంబళను నిషేధించారు. కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయ్యాక ఆ నిషేధాన్ని తొలగించారు.ఉడుపిలో ఈ పరుగు పందేలను ఏటా నిర్వహిస్తుంటారు. ఎవరైతే వాటిని వేగంగా పరిగెత్తించి లక్ష్యాన్ని చేరుకుంటారో వారే విజేతలుగా నిలుస్తారు. అయితే బోల్ట్‌తో పోలిక ఎలా ఉన్నా ఈక్రమంలో అతను కంబళ పోటీల్లో 30 ఏళ్ల రికార్డును బద్దలు కొడుతూ అత్యంత వేగంగా పరిగెత్తిన వ్యక్తిగా నిలిచాడు.
