క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసే పండగ వచ్చేస్తోంది.. ఈ ఏడాది సీజన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రికెట్‌ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెబుతూ ఐపీఎల్ 2020 షెడ్యూల్ ప్రకటించారు. డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ , చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఈ ఏడాది ఐపీఎల్‌ లో తొలి మ్యాచ్‌ ఆడనున్నాయి. మార్చి 29న ముంబై వేదికగా జరిగే ఈ మ్యాచ్‌ తో ఐపీఎల్‌ 13వ ఎడిషన్‌ షురూ కానుంది. ఈ సీజన్ మార్చి 29వ తేదీన ప్రారంభం కానుంది.. మే 24వ తేదీన ముగియనుంది. ఇక, గత సీజన్ల కంటే ఈ ఏడాది అదనంగా ఆరు రోజులు క్రికెట్‌ ఫ్యాన్స్‌కు పండగే.. మొదటి మ్యాచ్ మార్చి 29న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల  మధ్య వాంఖడే స్టేడియంలో జరుగనుండగా ఫైనల్ కూడా అక్కడే నిర్వహించనున్నారు..గత సీజన్‌లో 44 రోజుల పాటు ఐపీఎల్‌ మ్యాచ్‌లు నిర్వహించగా.. ఈ సీజన్‌లో 50 రోజులు మ్యాచ్‌లు కనువిందు చేయనున్నాయి. ఆదివారాలు రెండు మ్యాచ్ లు జరుగనున్నాయి.

Video Advertisement

#IPL2020 schedule