భర్తలు భార్యలకంటే పెద్ద వారు అయ్యి ఉండాలి అంటారు… కానీ చిన్నవారిని చేసుకుంటే ఇన్ని లాభాలు ఉన్నాయా..?

భర్తలు భార్యలకంటే పెద్ద వారు అయ్యి ఉండాలి అంటారు… కానీ చిన్నవారిని చేసుకుంటే ఇన్ని లాభాలు ఉన్నాయా..?

by Anudeep

Ads

ప్రతి ఒక్కరి జీవితం లోను కళ్యాణం అనేది ఓ మధుర ఘట్టం. పెళ్లితో చాలా మార్పులు వస్తాయి. పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనది పెళ్లితో రెండు మనసులు దగ్గరవుతాయి. రెండు కుటుంబాలు ఒకటి అవుతాయి. అయితే చాలా మంది కలలు కన్నట్లు.. వాస్తవ జీవితం మాత్రం అలా ఎప్పటికీ ఉండదు.

Video Advertisement

 

ఈ బంధం ఇద్దరు మనుషుల మధ్య నిబద్ధత, ఇది వారిని జీవితాంతం ఒకరికొకరు అనుబంధంగా ఉంచుతుంది. ప్రతి సుఖం, దుఃఖంలో కలిసి నిలబడటానికి హామీ ఇస్తుంది. అయితే ప్రతి బంధం లోను ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఒక బంధం స్ట్రాంగ్ గా ఉండాలంటే దానికి ఎన్నో అంశాలు దోహదం చేస్తాయి. ఇప్పుడు అటువంటి విషయాల గురించి చర్చించుకుందాం..

reasons for women wants to marry young men..!!

మన సమాజం లో పెళ్ళికి ఎన్నో కట్టుబాట్లు విధించారు. అమ్మాయి అబ్బాయి కంటే వయసులో చిన్నదై ఉండాలి అనేది ఇందులో ఒకటి. కానీ ఒక బంధం లో ఒకరిపై ఒకరికి నమ్మకం, ప్రేమ ఉన్నప్పుడు వయసు అనేది పట్టించుకోవాల్సిన అంశం కాదు. ఈ నేపథ్యం లోనే ప్రస్తుత కాలం లో కొందరు మహిళలు తమకంటే చిన్నవారిని పెళ్లి చేసుకోవడానికి మొగ్గు చూపిస్తున్నారు. ఇప్పుడు దానికి కారణాలేంటో చూద్దాం..

 

  • తమకంటే తక్కువ వయసు ఉన్నవారిని పెళ్లి చేసుకోవడం వల్ల.. అమ్మాయిలు కూడా తమ భాగస్వామి వయసుతో కలిసి చలాకీగా ఉండగలుగుతారు.

reasons for women wants to marry young men..!!

  • భాగస్వామి తనకంటే చిన్నవాడు అయినప్పుడు.. ఇంట్లో నిర్ణయాలు తీసుకొనే అనుభవం, అధికారం ఆడవారికి ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఒక మహిళ వివాహబంధంలో తలెత్తే సమస్యలను చాకచక్యంగా పరిష్కరించగలుగుతారు. అందువలన, వీరిద్దరి మధ్య అవగాహన మరింత పెరుగుతుంది. వివాహబంధం పదిలంగా ముందుకు సాగుతుంది.

reasons for women wants to marry young men..!!

  • ఒక మహిళ తన రంగం ఒక మంచి పోసిషన్ కి చేరినపుడు తనకన్నా పెద్దవారిని చేసుకొనే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. వారికి అప్పటికే పెళ్లి అయ్యి ఉండవచ్చు. అందుకే తమని, తమ వృత్తిని స్వీకరించగలిగే వ్యక్తిని వయసుతో సంబంధం లేకుండా పెళ్లి చేసుకొనేందుకు ఇష్టపడతారు.

reasons for women wants to marry young men..!!

  • తమకన్నా పెద్దదైన ఒక మహిళను వివాహం చేసుకున్న పురుషుడు ఆ బంధాన్ని గౌరవించడం మొదలుపెడతాడు. తమ బంధానికి విలువనిస్తాడు. అహంకారపూరిత నిర్ణయాలు తీసుకొనేందుకు ఆస్కారం ఉండదు.

reasons for women wants to marry young men..!!

  • మరో ముఖ్య కారణం ఏంటంటే..యవ్వనంలో ఉన్న పురుషుడు ఆశావాద దృక్పథంతో ఉంటాడు. అందువలన, వారితో వివాహబంధంలోకి అడుగుపెట్టినప్పుడు సాధారణంగా వివాహ జీవితంలో ఎదురయ్యే కాంప్లికేషన్స్ అనేవి ఎదురవవు. వారు తమ భార్యను అర్థం చేసుకుంటారు.

reasons for women wants to marry young men..!!

  • తమ జీవిత భాగస్వామి తనకంటే పెద్దది అయినపుడు పరిణితి లేకుండా నిర్ణయాలు తీసుకోవడం అనేది తక్కువ సందర్భాల్లో జరుగుతుంది. ఆమె నిర్ణయాలపై ఆ పురుషుడికి నమ్మకం ఉంటుంది.

reasons for women wants to marry young men..!!


End of Article

You may also like