బుక్ మై షోలో టికెట్ ఎలా కాన్సల్ చేయాలి.? ఎలా రిఫండ్ పొందాలి.?

బుక్ మై షోలో టికెట్ ఎలా కాన్సల్ చేయాలి.? ఎలా రిఫండ్ పొందాలి.?

by Harika

Ads

ఆరోజుల్లో సినిమా చూడాలంటే.. థియేటర్‌కు వెళ్లి గంటలు తరబడి వెయిట్ చేసి, టికెట్ తీసుకుని సినిమా చూసేవాళ్లం. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. మనకి నచ్చిన టైంకి, నచ్చిన ప్లేస్‌లో స్మార్ట్‌ఫోన్‌ నుంచి క్షణాల్లో టికెట్ బుక్ చేసుకుంటున్నాం. కొన్నిసార్లు సినిమాకి వెళ్లడానికి వీలుకాక లేదా కొన్ని కారణాల వల్ల టికెట్ రద్దు చేయాల్సి వస్తుంది. మరి ఇలా క్యాన్సల్ చేస్తే టికెట్ డబ్బులు తిరిగి వస్తాయా లేదా అని కొందరు ఆందోళన చెందుతారు. ఇకపై మీకు ఆందోళన వద్దు. ఎందుకంటే టికెట్‌ను క్యాన్సల్ చేసుకుని ఈజీగా మీ డబ్బును పొందవచ్చు.

Video Advertisement

బుక్‌మైషోలో టికెట్ క్యాన్సల్ ఇలా చేయండి
-BookMyShow యాప్‌ని మొబైల్‌లో ఓపెన్ చేయాలి.
-ప్రొఫైల్ ఐకాన్‌పై క్లిక్ చేసి, Your Orders అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
-టికెట్ లిస్ట్ స్క్రీన్‌పైన వస్తుంది.. ఇక్కడ మీరు బుక్ చేసిన టికెట్ సెలక్ట్ చేసుకోవాలి.
-తర్వాత బుకింగ్ రద్దు చేయు అనే ఆప్షన్ వస్తుంది. దీనిని క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేయాలి.
-రీఫండ్ చెల్లింపు పద్ధతి అనే ఆప్షన్ ఉంటుంది. తర్వాత వాపస్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిని ఎంచుకోవాలి. అంతే ఇంకా మీ రిఫండ్ వచ్చేస్తుంది.

 

బుక్‌మైషో వైబ్‌సైట్‌లో ఇలా చేయండి
-అధికార వైబ్‌సైట్ ఓపెన్ చేసి, ఖాతా లాగిన్ చేయండి.
-తర్వాత కుడివైపున ఉన్న ప్రొఫైల్‌‌ని ఓపెన్ చేయండి.
-ఇంతకు ముందు ఉన్న టికెట్ కొనుగోలు లిస్ట్‌ను ఓపెన్ చేసి, టికెట్‌పై క్లిక్ చేయండి.
-స్క్రీన్‌పైకి స్క్రోల్ చేసి, టికెట్ రద్దు చేయు అనే ఆప్షన్ క్లిక్ చేయాలి.
-వాపస్ పద్ధతిని సెలక్ట్ చేసి, ధృవీకరించుపైన క్లిక్ చేస్తే అమౌంట్ రిఫండ్ వస్తుంది.
గమనిక: కానీ కొన్నిసార్లు ఈ వైబ్‌సైట్ పనిచేయకపోవచ్చు.

సూపర్ స్టార్ కస్టమర్ టికెట్‌లో ఎలా రద్దు చేయాలంటే?

BookMyShow సూపర్ స్టార్ కస్టమర్‌లకు ఎక్స్‌ట్రా బోనస్‌ను ఇస్తుంది. అదే ఏంటంటే? సూపర్ స్టార్ కస్టమర్‌ అయితే, టికెట్ కోసం పే చేసిన అమౌంట్ అంతా కూడా తిరిగి పొందుతారు. బుక్‌మైషో నుంచి సంవత్సరంలోపు 10కంటే ఎక్కువ టికెట్లు బుక్ చేస్తే వాళ్లను సూపర్ స్టార్ కస్టమర్ అంటారు. మరి ఈ సూపర్ స్టార్ కస్టమర్ తన టికెట్‌ను ఎలా క్యాన్సల్ చేయాలో తెలుసుకుందాం.
-బుక్‌మైషో యాప్ ఓపెన్ చేసి తర్వాత ప్రొఫైల్‌లోకి వెళ్లి టికెట్ ఆర్డర్‌ల ఎంపికపై క్లిక్ చేయాలి.
-టికెట్‌ను ఎంచుకుని సూపర్‌స్టార్ టికెట్ క్యాన్సల్‌పై క్లిక్ చేయాలి.
-వాపస్ పొందే ఆప్షన్‌పై క్లిక్ చేసి, టికెట్ క్యాన్సల్‌ను నిర్ధారించండి. అంతే ఇక మీరు ఇచ్చిన అకౌంట్‌లోకి డబ్బు జమ అవుతుంది.

ఇవి గుర్తుంచుకోండి BookMyShowలో టికెట్ క్యాన్సల్ చేయడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. టికెట్‌ను క్యాన్సల్‌ చేయాలంటే సినిమా 4గంటలు ముందే చేయాలి. లేకపోతే టికెట్‌లో 30% తీసి, మిగిలిన అమౌంట్ మీ అకౌంట్‌లోకి జమ అవుతుంది. అదే రిఫండ్ అమౌంట్ క్రెడిట్, డెబిట్ కార్డు లేదా నెట్ బ్యాకింగ్ పద్ధతిని ఎంచుకుంటే 7 నుంచి 10 రోజుల సమయం పడుతుంది. అదే బుక్‌మైషో వాలెట్‌కు కావాలని రిక్వెస్ట్ పెట్టుకుంటే కొన్నిగంటల్లోనే వాలెట్‌కి డబ్బు జమ అవుతుంది.


End of Article

You may also like