సినీ ఇండస్ట్రీ లోని అన్నదమ్ములు…లిస్ట్ లో ఉన్న 23 మంది అన్నదమ్ములు ఎవరో లుక్ వేయండి!

సినీ ఇండస్ట్రీ లోని అన్నదమ్ములు…లిస్ట్ లో ఉన్న 23 మంది అన్నదమ్ములు ఎవరో లుక్ వేయండి!

by Mohana Priya

Ads

ఒకే రంగానికి చెందిన తండ్రీకొడుకులు ఎలా ఉంటారో అదేవిధంగా ఏ రంగానికి చెందిన అన్నదమ్ములు కూడా ఉంటారు. మన సినిమా ఇండస్ట్రీలో అలా అన్నదమ్ములు ఇద్దరు ఇదే రంగంలో ఉన్న వాళ్లు చాలామంది ఉన్నారు.ఇద్దరూ నటనలోనే ఉండడం కాకుండా కొంతమంది ఒకళ్ళు నటనలో ఒకళ్ళు దర్శకత్వంలో అలా వేరే శాఖలో ఉన్న వాళ్లు కూడా ఉన్నారు. శాఖలు వేరే అయినా కానీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అన్నదమ్ములలో కొందరిని ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

#1 చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు

ముగ్గురూ సినిమాల్లో నటిస్తూ గుర్తింపును సంపాదించుకున్నారు. నాగబాబు సినిమాల్లో నటించడం, నిర్మించడమే కాకుండా రియాలిటీ షోలలో కూడా జడ్జి గా కనిపిస్తూ ఉంటారు.


#2 నందమూరి హరికృష్ణ, నందమూరి బాలకృష్ణ

ఇద్దరు హీరోలు గా ఎన్నో సినిమాలు చేశారు.


#3 సురేష్ దగ్గుబాటి, వెంకటేష్ దగ్గుబాటి

వెంకటేష్ సినిమాల్లో నటిస్తూ ఉంటే, సురేష్ వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ అయిన సురేష్ ప్రొడక్షన్స్ బాధ్యతలు నిర్వహిస్తారు.


#4 సూర్య, కార్తీ

సూర్య నటించిన యువ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరీర్ మొదలు పెట్టారు కార్తీ. తర్వాత పరుత్తి వీరన్ ఈ సినిమాతో హీరోగా అడుగు పెట్టారు. ఇద్దరూ చేసేవి తమిళ సినిమాలే అయినా అవి తెలుగులో డబ్ అవ్వడంతో ఇంకా ప్రజాదరణ పొందడంతో తెలుగు వాళ్ళకి కూడా ఎంతో చేరువయ్యారు.


#5 రమేష్ బాబు, మహేష్ బాబు

రమేష్ బాబు కొన్ని సినిమాల్లో హీరోగా నటించారు. తర్వాత మహేష్ బాబు నటించిన అతిథి సినిమాని నిర్మించారు.


#6 కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్

ఇద్దరూ కూడా వైవిధ్యమైన పాత్రలు చేస్తూ తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థాయిని,  ఇమేజ్ ని ఏర్పరుచుకున్నారు.


#7 సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్

సాయి ధరమ్ తేజ్ ఇప్పటికే హీరోగా నటించి పేరు సంపాదించుకున్నారు. వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.


#8 విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ

ఆనంద్ దేవరకొండ దొరసాని సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు.  తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాలో నటించాడు. ఇప్పుడు పుష్పక విమానం అనే మరొక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.


#9 రామ్ చరణ్, వరుణ్ తేజ్

వీళ్లు కూడా ఎవరి శైలిలో వాళ్ళు సినిమాలు చేస్తూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకున్నారు.


#10 అలీ, ఖయ్యుం

ఖయ్యుం కూడా బ్లేడ్ బాబ్జి, కెవ్వు కేక, ఇంకా చాలా సినిమాల్లో సహాయ పాత్రలు పోషించారు.


#11 ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్

ఆర్యన్ రాజేష్ ప్రస్తుతం సినిమాలనుండి విరామం తీసుకున్నారు. అల్లరి నరేష్ నటించిన బంగారు బుల్లోడు సినిమా, మరొక సినిమా నాంది ఇటీవల విడుదలయ్యి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.


#12 బెల్లంకొండ సాయి శ్రీనివాస్, బెల్లంకొండ గణేష్

పవన్ సదినేని దర్శకత్వంలో వచ్చే సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతున్నాడు బెల్లంకొండ గణేష్.


#13 నాగ చైతన్య, అఖిల్

నాగ చైతన్య ఇప్పటికే తనకంటూ ఒక ఇమేజ్ ని సంపాదించుకున్నారు. అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా షూటింగ్ దశలో ఉంది.


#14 అల్లు అర్జున్, అల్లు శిరీష్

గత సంవత్సరం ఏబిసిడి సినిమా లో కనిపించారు అల్లు శిరీష్. తర్వాత చేయబోయే సినిమా డిస్కషన్ దశలో ఉంది.


#15 పృథ్వీరాజ్ సుకుమారన్, ఇంద్రజిత్ సుకుమారన్

ఇద్దరూ మలయాళంలో స్టార్ హోదా సంపాదించుకున్నారు. పృథ్వి రాజ్ ని డబ్బింగ్ సినిమాల్లో మనం చూసే ఉంటాం. ఇంద్రజిత్ కూడా క్వీన్ వెబ్ సిరీస్ లో జిఎంఆర్ పాత్రలో నటించారు. క్వీన్ తెలుగులో కూడా అనువాదం అయ్యింది.


#16 సెల్వరాఘవన్, ధనుష్

సెల్వరాఘవన్ 7/G బృందావన్ కాలనీ, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే,ఎన్ జి కె వంటి ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించారు.


#17 వెంకట్ ప్రభు, ప్రేమ్ జీ అమరన్

వెంకట్ ప్రభు మంకాత్తా (తెలుగులో గ్యాంబ్లర్), మాస్ (తెలుగులో సూర్య నటించిన రాక్షసుడు), సినిమాలకు దర్శకత్వం వహించారు. రాక్షసుడు సినిమా లో సూర్య ఫ్రెండ్ గా కనిపించారు ప్రేమ్ జీ అమరన్. ప్రేమ్ జీ నటుడే కాకుండా రచయిత, గాయకుడు కూడా. అలాగే వీళ్ళకి యువన్ శంకర్ రాజా కూడా బంధువు అవుతారు.


#18 చిరంజీవి సర్జా, ధ్రువ సర్జా

చిరంజీవి సర్జా ఇటీవల గుండెపోటుతో మరణించారు. ధ్రువ నటించిన కన్నడ చిత్రం పొగరు ఈ సంవత్సరం మార్చిలో విడుదల అయ్యింది. ఇద్దరూ ఎన్నో సినిమాల్లో నటించారు.


#19 మంచు విష్ణు, మంచు మనోజ్

విష్ణు నటించిన మోసగాళ్లు సినిమా ఇటీవలే విడుదలయ్యింది. మనోజ్ నటిస్తున్న అహం బ్రహ్మాస్మి సినిమా షూటింగ్ దశలో ఉంది.

#20 మోహన్ రాజా, జయం రవి

ధ్రువ కి మాతృక అయిన తని ఒరువన్, ఈ చిత్రంలో హీరోగా నటించారు జయం రవి. ఆ సినిమాకి దర్శకత్వం వహించింది మోహన్ రాజా. జయం రవి ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న పొన్నియన్ సెల్వన్ చిత్రంలో నటిస్తున్నారు. మోహన్ రాజా తెలుగులో హనుమాన్ జంక్షన్ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ప్రశాంత్ హీరోగా ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లూసిఫర్ తెలుగు రీమేక్ కి కూడా దర్శకత్వం వహిస్తున్నారు.


#21 రానా దగ్గుబాటి, అభిరామ్ దగ్గుబాటి

అభిరామ్ దగ్గుబాటి కూడా త్వరలో సినిమాల్లో ఎంట్రీ ఇవ్వనున్నాడు.


#22 శివ రాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్

వీరిద్దరూ కన్నడ సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ఎంతో గొప్ప ఇమేజ్ ని ఏర్పరుచుకున్నారు.


#23 ప్రభాస్, ప్రమోద్ ఉప్పలపాటి

ప్రమోద్ యు.వి.క్రియేషన్స్ నిర్మాణ బాధ్యతలు చూసుకుంటారు.


#24 సాయి కుమార్, రవి శంకర్

రవి శంకర్ ఎంతో మంది ఆర్టిస్టులకు డబ్బింగ్ చెప్పడమే కాకుండా కన్నడ లో పెద్ద నటులు కూడా. భరత్ అనే నేను సినిమా లో ఒక ముఖ్య పాత్రలో నటించారు.

#25 రవితేజ, భరత్, రఘు 

అతడే ఒక సైన్యం, వెంకీ సినిమాలో నటించారు భరత్. 2017 లో ఒక రోడ్డు ప్రమాదంలో మరణించారు. రఘు 2006 లో వచ్చిన సక్సెస్ అనే సినిమాలో నటించారు.

#26 చారు హాసన్, కమల్ హాసన్

చారుహాసన్ కూడా ఎన్నో సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించారు. డియర్ కామ్రేడ్ సినిమా లో హీరో తాత పాత్రలో కనిపించారు.


End of Article

You may also like