చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి ఎన్నో సినిమాల్లో నటించింది అనిఖా సురేంద్రన్. 2007 లో ఒక మలయాళం సినిమాతో తన కెరీర్ మొదలు పెట్టింది అనిఖా. కానీ ఆ సినిమాలో తన పాత్రకి అంతగా ప్రాముఖ్యత లేదు. అంటే ఆ సినిమాలో అనిఖా ఉన్నట్టు కూడా కొద్ది మందికి మాత్రమే తెలుసు. అది ఒక అన్ క్రెడిటెడ్ రోల్. తర్వాత 2010 లో మరొక మలయాళం సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమైంది. ఆ తర్వాత కొన్ని మలయాళం సినిమాల్లో నటించింది.

2015 లో తమిళ్ స్టార్ అజిత్ హీరోగా, గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన యెన్నై అరిందాల్ సినిమాతో తమిళంలో కూడా పరిచయమైంది అనిఖా. ఈ సినిమాలో త్రిష కూతురుగా నటించింది అనిఖా. ఇదే సినిమా తెలుగులో ఎంతవాడుగాని పేరుతో డబ్ అయింది. అలా అనిఖా మనందరికీ కూడా సుపరిచితురాలు అయ్యింది.


తర్వాత కొన్ని తమిళ్, మలయాళం సినిమాల్లో నటించింది. 2019 లో అజిత్ హీరోగా వచ్చిన విశ్వాసం సినిమా తెలుగులో కూడా అదే పేరుతో డబ్ అయింది. ఈ సినిమాలో అజిత్ – నయనతార కూతురుగా నటించింది అనిఖా. అలా అనిఖా విశ్వాసం సినిమా ద్వారా మన అందరికీ ఇంకా చేరువైంది.


అలాగే జయలలిత గారి జీవితం ఆధారంగా వచ్చిన క్వీన్ వెబ్ సిరీస్ లో యంగ్ జయలలిత గారి పాత్ర పోషించింది అనిఖా. ఇన్ని సంవత్సరాల్లో తన నటనకి గాను ఎన్నో అవార్డులను కూడా అందుకుంది. ఇప్పుడు అనిఖా ఒక డైరెక్ట్ తెలుగు సినిమాతో మనల్ని పలకరించబోతోంది అనే వార్త వినిపిస్తోంది. ఈ ఏడాది మొదట్లో విడుదలైన మలయాళ సినిమా కప్పేలా.


ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్, నవీన్ చంద్ర హీరోలుగా నటించబోతున్నారు. మలయాళంలో అన్నా బెన్ పోషించిన హీరోయిన్ పాత్రని తెలుగులో అనిఖా చేయబోతోంది అని సమాచారం. కప్పేలా తెలుగు రీమేక్ కి సంబంధించిన వివరాలను ఇంకా ప్రకటించాల్సి ఉంది.

image credits: instagram/anikhasurendran




































































Actress Dharsha Gupta HD Images
