కమల్ హాసన్ మొదలు కొని రాశి, తరుణ్, బాలాదిత్యా ఇలా ఎందరో సిని నటులు చైల్డ్ ఆర్టిస్టులుగా వారి ముద్రను వేసి తర్వాత సినిమాల్లో సెటిల్ అయ్యారు..చేసినవి ఒకట్రెండు సినిమాలైనా వారి ముద్దుముద్దుమాటలు, చేష్టలతో గుర్తుండిపోయిన చిన్నారి నటులు ఉన్నారు.. లిటిల్ సోల్జర్స్ లో నటించిన కావ్యా, గంగోత్రి మూవీలో నటించిన మరో చైల్డ్ ఆర్టిస్ట్ కావ్య, డాడీ సినిమాలో నటించిన అనుష్క ఇలా ఎందరో చైల్డ్ ఆర్టిస్టులు వారి నటనతో ఆకట్టుకున్నారు..ఆ కోవకు చెందిన చైల్డ్ ఆర్టిస్టే నేహా తోట..
Vikramarkudu Movie Child Actress Neha Thota
నేహా తోట అనే పేరు చెప్తే గుర్తు రాకపోవచ్చు కానీ, విక్రమార్కుడు లో నటించిన చిన్నారి అనగానే ఇట్టే గుర్తు పట్టేస్తారు..ఆ సినిమాలో అమాయకమైన చూపులతో ఆకట్టుకున్న నేహా, రాంగోపాల్ వర్మ రక్ష చిత్రంలో తన నటనతో ప్రేక్షకులను భయపెట్టింది. అమెరికాలో పుట్టిన నేహా తన మూడేళ్ల వయసులో తల్లిదండ్రులతో పాటు ఇండియాకి వచ్చింది. అప్పుడే విక్రమార్కుడికి ఆడిషన్స్ జరుగుతుంటే అనుకోకుండా వాటిల్లో పాల్గొని సెలక్ట్ అయింది.
Vikramarkudu Movie Child Actress Neha Thota
ఆ సినిమాకి చైల్డ్ ఆర్టిస్ట్ ని సెలక్ట్ చేయడం కోసం ఆడిషన్ ని ఏర్పాటు చేశారు రాజమౌలి.. అప్పుడు ఆడిషన్ కి అటెండ్ అయిన ఎంతో మంది పిల్లలు అల్లరి అల్లరి చేస్తుంటే నేహా మాత్రం ఒక మూలన సైలెంట్ గా కూర్చుందట, ఆ సినిమాలో తన పాత్ర కూడా అదే విధంగా ఉండాలనే ఉద్దేశ్యంతో వెంటనే నేహాని సెలక్ట్ చేశారట రాజమౌలి..ఈ విషయాన్ని జక్కన్నే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
Vikramarkudu Movie Child Actress Neha Thota
తన అమాయకత్వంతో ఛాన్స్ కొట్టేసిన నేహా, తర్వాత అదే నటనతో ప్రేక్షకుల్లో మార్కులు కొట్టేసింది..రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన రక్ష సినిమాలో దెయ్యం పట్టిన పిల్లగా నటించి ప్రేక్షకులను భయపెట్టి, విక్రమార్కుడులో అమాయకంగా కనిపంచిన ఆ అమ్మాయేనా ఈ అమ్మాయి అని ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా చేసింది.ఆ తర్వాత ఒకట్రెండు సినిమాలు చేసి, మళ్లీ తెరపైన కనపడలేదు.
Vikramarkudu Movie Child Actress Neha Thota
సినిమా ఛాన్సులు వచ్చినా కాదనుకుని పూర్తిగా స్టడీస్ పై కాన్సన్ట్రేట్ చేసింది. ప్లోరిడాలో బిజినెస్ మేనేజ్మెంట్లో MBA చేస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నేహా ఫోటోలను చూసి చాలామంది సినిమాల్లో ఎందుకు చేయట్లేదు అని కామెంట్ చేస్తున్నారు..స్టడీస్ కంప్లీట్ అయ్యాక సినిమా అవకాశాలు వస్తే నటిస్తానని,దానికి ఇంకా మూడేళ్లు టైం ఉందని చెప్తోంది ఈ చిన్నారి..ఓహ్ సారీ..ఈ అమ్మడు..