అక్టోబర్ 25న సూర్యగ్రహణం.. ఈ ఏడాది ఇది రెండో సూర్యగ్రహణం కావడమే కాకుండా.. ఈ ఏడాదిలో ఆఖరి సూర్యగ్రహణం. అంతేకాకుండా ఇది పాక్షిక సూర్యగ్రహణం మాత్రమే. భారతదేశంలో మాత్రం కొన్ని చోట్ల మాత్రమే ఇది కనిపించే అవకాశం ఉంది.
జ్యోతిష్యం ప్రకారం సూర్య గ్రహణం లేదా చంద్రగ్రహణం ఏదైనా గానీ.. అవి కొందరికి మంచి ఫలితాలను ఇస్తూ ఉంటే.. కొందరికి మాత్రం మధ్యస్త ఫలితాలు, ఇంకొందరికి వ్యతిరేక ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఈ సూర్యగ్రహణం వివిధ రాశులపై వేర్వేరు ప్రభావాలను చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.అయితే ఏ రాశి వారికి మంచి ఫలితాలను, ఏ రాశుల వారికి మధ్యస్త, అశుభ ఫలితాలను అందిస్తుందో చూద్దాం..
జ్యోతిష శాస్త్ర పండితులు అంచనా ప్రకారం ఈ సూర్యగ్రహణం సింహ రాశి, ధనస్సు రాశి, మకర రాశి, వృషభ రాశి వారికి శుభప్రదంగా పరిగణించబడుతుంది. వారు పట్టిందల్లా బంగారం అవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇక సూర్య గ్రహణం మేష రాశి, కుంభ రాశి, మిధున రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది.
ఇవి కాకుండా ఈ గ్రహణం మిగిలిన 5 రాశులపై ప్రతికూల ప్రభావాన్ని సూచిస్తుంది. కర్కాటకం, కన్య, తుల, వృశ్చికము, మీన రాశి వారికి ప్రతికూలంగా ఉంటుందని, ఈ 5 రాశుల వారు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు ఈ గ్రహణాన్ని స్వాతి నక్షత్ర జాతకులు, తులారాశి వారు అసలు చూడకూడదని జ్యోతిష శాస్త్ర పండితులు చెబుతున్నారు.
సూర్య గ్రహణం సమయంలో తలస్నానం ఆచరించడం (పట్టు విడుపు స్నానాల చేయడం), సూర్య ఆరాధన చేసుకోవడం, రాహు జపం, దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల శుభ ఫలితాలుంటాయి. మోక్ష సాధకులకు సూర్య గ్రహణం సమయంలో చేసే ధ్యానానికి విశేష ఫలితాలు ఉంటాయి.