టాలీవుడ్ లో డేరింగ్ అండ్ డాషింగ్, మాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు పూరీ జగన్నాథ్. ఎలాంటి హీరో అయినా పూరీ చేతిలో పడితే ఆటం బాంబ్ లా మారిపోతాడు. సిల్వర్ స్క్రీన్ పై డైరెక్టర్ పేరు పడితే విజిల్స్ పడేది ఒక్క పూరీ జగన్నాథ్ కి మాత్రమే.
పూరీ సినిమాలో హీరో చెప్పే ఒక్కో డైలాగ్ ను యూత్ అంతా ఓన్ చేసుకొని మన గురించే రాసాడురా అని ఫీల్ అవుతారు. హీరోకి ఏ మాత్రం తగ్గని కట్ ఔట్ థియేటర్ల ముందు దర్శనిమిస్తాయి. పూరీ సినిమాల్లో హీరో, హీరోయిన్ మరియు విలన్ మాత్రమే కాకుండా అంతకు మించి పవర్ ఫుల్ కారెక్టర్ కూడా ఉంటాయి.
అయితే పూరీ జగన్నాథ్ సినిమాల్లో హీరోయిన్ కంటే హైలెట్ అయిన ఫీమేల్ పాత్రలను ఒకసారి చూద్దాం . .
#1. అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి:
ఈ సినిమాలో జయసుధ పాత్ర హీరోయిన్ ఆసిన్ కంటే ఎక్కువ ప్రభావితం చేస్తుంది. రవితేజ తల్లిగా ఉన్న జయసుధ కారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది.
#2. కెమెరామెన్ గంగతో రాంబాబు:
ఈ మూవీలో హీరోయిన్ తమన్నా అయినా గుండక్క కారెక్టర్ (పొలిటీషియన్) లో ఉన్న శృతి కనిపించే కాసేపు తన కామెడీతో అందరిని నవ్విస్తుంది. కొంతమంది రాయకీయ నాయకులు ఎలా ఉంటారో ఆ పాత్ర ప్రతిబింబిస్తుంది.
#3. గోలీమార్:
గోలీమార్ లో ప్రియమణి హీరోయిన్ అయినప్పటికీ ప్రియమణి తల్లిగా అరుంధతి పాత్రలో ఉన్న రోజా హైలెట్ అవుతుంది.
#4. దేశముదురు:
దేశముదురులో హీరోయిన్ హన్సిక కానీ శివానీ క్యారెక్టర్ లో నన్ గా ఉన్న కోవై సరళ కామెడీతో ఆకట్టుకుంటుంది.
#5. లోఫర్:
లోఫర్ లో దిశా పటాని కథానాయిక అయినప్పటికీ వరుణ్ తేజ్ తల్లి పాత్రలో ఉన్న రేవతి లక్ష్మమ్మగా ఆకట్టుకుంటుంది.
#6. లైగర్:
ఇక లైగర్ విషయానికి వస్తే.. సినిమా విడుదల కాకుండానే.. ట్రైలర్ లో “ఒక లయన్ కి, టైగర్ కి పుట్టిండాడు. క్రాస్ బ్రీడ్ సార్ నా బిడ్డ” అంటూ రమ్యకృష్ణ చెప్పే డైలాగ్ ఒక్కటి చాలు ఇందులో రమ్యకృష్ణ గారిది ఎంత ముఖ్యమైన పాత్రో అర్థం చేసుకోవడానికి.. ఈ విధంగా పూరీ జగన్నాథ్ సినిమాల్లో కొన్ని ఫీమేల్ క్యారెక్టర్స్ హీరోయిన్ కంటే ఎక్కువ హైలెట్ అయ్యాయి.