ఆర్ఆర్ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. రామ్ చరణ్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ 2024 లో వినాయక చవితి విడుదల కానుంది.
ఈ మధ్య కాలంలో రామ్ చరణ్ ముంబై ఎక్కువగా వెళ్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ఏదో బిజినెస్ పనులో వెళ్తున్నారు లేదా వ్యక్తిగత పని మీద వెక్తునారు అనుకున్నారు.కానీ ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ లో సినిమానే ప్లాన్ చేస్తున్నాడంటా…?ఇప్పుడు ఈ వార్త టాలీవుడ్ లో షికారు చేస్తుంది.

ఈ నేపథ్యంలో చరణ్ ‘ధూమ్-4’ లో నటిస్తున్నాడానే అన్న ప్రచారం కూడా తెరపైకి వస్తోంది. వార్ ప్రాంచైజీలో కి తారక్ వెళ్లినట్లే ధూమ్ ప్రాంచైజీలోకి రామ్ చరణ్ ఎంటర్ అవుతున్నాడా? అన్న సందేహం నెట్టింట అభిమానుల్లో చర్చకు దారి తీస్తోంది. అదే నిజమైతే చరణ్ అభిమానుల ఆనందానికి అవదులుండవ్. ధూమ్ ఏరేంజ్ సిరీస్ అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యశ్ రాజ్ బ్యానర్లో అదో స్పెషల్ సిరీస్. ధూమ్ వసూళ్లు ఓ సంచలనం. ఇందులో నటించిన ప్రతీ హీరో ఓ రేంజ్ లో ఫేమస్ అయ్యారు.ఈ న్యూస్ గనక నిజమైతే చరణ్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోతుంది అనడంలో సందేహం లేదు.గతంలో జంజీర్ రీమేక్ తో చరణ్ బాలీవుడ్ లో తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిం





బబుల్ గమ్ మూవీతో యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీలో తెలుగు అమ్మాయి మానస చౌదరి హీరోయిన్ గా నటించింది. ఈ మూవీలో హీరో హీరోయిన్ కన్నా ఎక్కువ పాపులర్ అయ్యింది హీరో తండ్రి చికెన్ కొట్టు యాదగిరి. ఈ పాత్రలో నటించిన యాక్టర్ పేరు చైతు జొన్నలగడ్డ.
ఈ పేరు వినగానే గుర్తొచ్చేది డిజే టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డ. ఆయన అన్నయే చైతు జొన్నలగడ్డ.హీరోకి తండ్రిగా చైతు జొన్నలగడ్డ ఆకట్టుకున్నాడు. హైదరాబాదీ యాసలో చికెన్ కొట్టు యాదగిరి అద రగొట్టాడు. ఈ మూవీలో తండ్రీ కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు యువతను అలరిస్తాయి. హీరోయిన్ ఇంటికొచ్చినపుడు ఈ హీరో, హీరో తండ్రి మధ్య జరిగే సంభాషణ ఆకట్టుకుంది.
ఈ మూవీలో తండ్రిగా నటించినా, చైతు జొన్నలగడ్డని స్క్రీన్ పై మొదటిసారి చూసినపుడు హీరో అన్నయ్యలా అనిపిస్తారు. చైతు జొన్నలగడ్డ ఎక్స్ప్రెషన్స్, స్లాంగ్, డైలాగ్ డెలివరీ ఇలా అన్ని హీరో సిద్దు జొన్నలగడ్డను గుర్తొచ్చేలా చేస్తాయి. ఈ మూవీ చైతు జొన్నలగడ్డ మొదటి చిత్రం, అయినప్పటికీ ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్ లా నటించారు.












