రణబీర్ కపూర్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్ మూవీ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీ ఇండియాలో రూ. 500 కోట్ల మైలురాయిని, ప్రపంచవ్యాప్తంగా రూ. 900 కోట్ల మార్కును చేరుకుంది.
ఈ మూవీ ఇంత పెద్ద విజయం సాధించడానికి కారణం నటన, డైలాగ్స్ లేదా సినిమాటోగ్రఫీ మాత్రమే కాదు. సంగీతం కూడా ముఖ్య పాత్ర పోషించింది. సినిమాలో పాటల నుంచి నేపథ్య సంగీతం వరకు అన్నీ సూపర్‌హిట్. రణబీర్ కపూర్ ఎంట్రీ సాంగ్ హిట్ అయ్యింది. ఆ పాట అంత హిట్ కావడం వెనుక ఉంది ఎవరో ఇప్పుడు చూద్దాం..
యానిమల్ మూవీ రిలీజ్ అయిన తరువాత ఎక్కువగా చర్చించబడిన అంశాలలో రణబీర్ కపూర్ ఎంట్రీ సాంగ్ ఒకటి. ఈ సాంగ్ ఎఆర్ రెహమాన్ స్వరపరిచిన రోజా, దిల్ హై చోటా సా మరియు భారత్ హమ్కో జాన్ సే ప్యారా హై లాంటి మాషప్ తో చేసిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కారణంగా ఈ సాంగ్ హిట్ అయ్యింది. ఈ సాంగ్ కు నేపథ్య సంగీతాన్ని అందించింది హైదరాబాద్‌కు చెందిన ప్రోగ్రెసివ్ రాక్ ఫ్యూజన్ బ్యాండ్ త్రీయరీ. ఈ పాటలో వీరు కనిపించారు.
త్రీయరీ బ్యాండ్ 2017లో హైదరాబాద్‌లో జరిగిన అర్జున్ రెడ్డి ఆడియో లాంచ్ ఈవెంట్లో లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆ పెర్ఫార్మెన్స్ కు సందీప్ రెడ్డి వంగా ముగ్ధుడై, యూట్యూబ్‌లో వారి పని కోసం వెతికాడు. వారు రూపొందించిన ఒక వీడియోను చూశాడు. యనిమాల్ హీరో ఎంట్రీ సాంగ్ కోసం వారిని తీసుకున్నాడు. తొమ్మిది మంది సభ్యుల గల బ్యాండ్ ఈ స్కోర్‌ను రూపొందించింది.
ఈ బ్యాండ్ ముగ్గురు వ్యక్తులతో 2013లో తెలంగాణలోని హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తెలుగు మరియు దక్షిణ భారత సంగీతంతో ప్రోగ్రెసివ్ రాక్ కలయికతో మ్యూజిక్ ను కంపోజ్ చేయడంలో వారికి మంచి నైపుణ్యం ఉంది. 2013 నుండి ఈ బ్యాండ్ తొమ్మిది మందికి పెరిగింది. ఈ గ్రూప్ లో కీస్పై మార్క్ టాలర్, వయోలిన్‌లో దత్త సాయి ప్రసా, డ్రమ్స్లో తరుణ్ విశాల్, డ్రమ్స్లో ఇంతియాకుమ్, గిటార్లో సెంటీలాంగ్ అవో, మహిళా గాయకుడిగా సింటీచే మోంగ్రో, పురుష గాయకుడు అఖిలేశ్వర్ చెన్ను, సితార్లో ఇర్ఫాన్ అహ్మద్, మరియు పవన్ కుమార్ ఎమ్.ఎస్. తబలా ఉన్నారు.
https://www.instagram.com/p/C0TM83PrkKh/?hl=en
Also Read: పల్లవి ప్రశాంత్ చేసిన తప్పు ఏంటి..? అసలు అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారు..?

















ఈ సిరీస్ కి శరత్ జోతి దర్శకత్వం వహించగా, ప్రభావతి నిర్మించారు. వీరప్పన్ స్వయంగా చెప్పిన విషయాల ఆధారంగా ‘కూసీ మునుసామి వీరప్పన్’ డాక్యుమెంటరీ సిరీస్ ను రూపొందించారు. 1993-1996 కాలంలో వీరప్పన్ ఇంటర్వ్యూ కోసం గోపాల్ అనే విలేకరి అడవిలోకి వెళ్లి, తీసిన వీడియోలు, తన గురించి తానే వీరప్పన్ చెప్పిన దాని ఆధారంగా ఆరు ఎపిసోడ్ లతో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు.
ఇక ఈ సిరీస్ కథ విషయానికి వస్తే, స్వయంగా వీరప్పన్ తన గురించి, తన లైఫ్ గురించి వివరించారు. వేటగాళ్ల ఫ్యామిలిలో కూసే మునిసామి వీరప్పన్ ఐదుగురు పిల్లలలో రెండో అబ్బాయిగా జన్మించాడు. చిన్నవయసులో తన ఆకలిని తీర్చుకోవడానికి కుటుంబ వృత్తి వేటాడడం ప్రారంభించాడు. మొదట్లో ఆకలి తీర్చుకోవడం కోసం వేటాడినా, కాలక్రమేణా దాని వల్ల కోట్ల రూపాయలు సంపాదించాడు. వీరప్పన్ దశాబ్దాల పాటు తమిళనాడు, కర్ణాటక బార్డర్ లోని అడవులను దోచుకున్నాడు.
వీరప్పన్ కనిపించిన గంధపు చెట్టునల్లా అమ్మడం, ఏనుగులను చంపి వాటి దంతాలు కూడా అమ్మడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో వీరప్పన్ వందలాది మందిని చంపేశాడు. అంతేకాకుండా తనకు వ్యతిరేకంగా ఉన్న పోలీసు ఆఫీసర్లను, పోలీస్ ఇన్ఫార్మర్ అనే సందేహం కలిగినా కూడా చంపేశాడు. తను ఇంతగా ఎందుకు మారాడు? వీరప్పన్ జీవితంలోని ముఖ్యమైన సంఘటనలను గురించి తానే స్వయంగా చెప్పాడు. ఆ విషయాలన్ని తెలుసుకోవాలంటే సిరీస్ చూడాల్సిందే..
బిగ్‌బాస్ 7 గ్రాండ్ ఫినాలే ఈవెంట్ ఈనెల 17న అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. విజేతగా పల్లవి ప్రశాంత్, రన్నర్ గా అమర్దీప్ నిలిచారు. ఈ సందర్భంగా వారిని కలవడానికి అన్నపూర్ణ స్టూడియో వద్దకు వచ్చిన పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కు, అమర్దీప్ ఫ్యాన్స్ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు అమర్దీప్ కారుపై రాళ్లు విసిరారు. మరో బిగ్‌బాస్ కంటెస్టెంట్ అశ్విని, గీతూ రాయల్ కారు అద్దాలను పగలగొట్టారు. అంతేకాకుండా రోడ్డుపై ఉన్న ఆర్టీసీ బస్సుల అద్దాలను కూడా ధ్వంసం చేశారు.
అక్కడికి బందోబస్తు కోసం వచ్చిన పంజాగుట్ట ఏసీపీ కారు అద్దం, బెటాలియన్ బస్సు అద్దాన్ని సైతం పగలగొట్టారు. దీంతో పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. ఈ దాడులకు కారణం పల్లవి ప్రశాంత్ అని తేల్చారు. చెప్పిన పట్టించుకోకుండా ఫ్యాన్స్ దగ్గరికి పల్లవి ప్రశాంత్ వెళ్లాడని పోలీసులు చెప్పారు. ఈ కేసులో ప్రశాంత్‌తో పాటుగా ఇంకో నలుగురిపై కూడా జూబ్లీహిల్స్ పోలీసులు కేసు ఫైల్ చేశారు.
ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం కేసులో ఏ1, ఏ2 లుగా ఉన్న ప్రశాంత్, అతని సోదురుడిని అరెస్టు చేశారు. వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఏ3, ఏ4ల నిందితులను ను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు పంపించారు. కాగా, పల్లవి ప్రశాంత్ మాట్లాడుతూ దాడి విషయంలో తన ప్రమేయం ఏం లేదని అన్నారు. ఫ్యాన్స్ తాను రెచ్చగొట్టలేదని వెల్లడించారు.







అలాగే ఇప్పుడు మరొక నటుడు పాత్ర కోసం 15 కేజీలు బరువు తగ్గి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. పై ఫోటోలో డీ గ్లామరైజ్ గా కనిపిస్తున్న ఈ హీరోని గుర్తుపట్టారా ఇప్పటివరకు మనం మాట్లాడుకుంటుంది ఈ హీరో గురించే. వెర్సటైల్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఇతను ఏ పాత్ర ఇచ్చిన అందులో ఇమిడిపోతాడు. ఇతను కేవలం నటుడే కాదు మంచి నిర్మాత అలాగే మంచి సింగర్ కూడా.


