తెలుగు సినీపరిశ్రమలో డ్ర-గ్స్ వినియోగం, ప్రమాదకర డ్రగ్స్ వ్యాపారంపై నార్కోటిక్స్ బ్యూరో పూర్తిగా దృష్టి సారించడంతో ఇప్పటికే పెద్ద డొంక కదిలింది. ఇటీవల కొన్ని వరుస ఘటనల్లో డ్ర-గ్ డీలర్లు పట్టుబడ్డారు. ఐదారు రోజుల క్రితం తెలంగాణాలో టాలీవుడ్ కి చెందినవారే ఎక్కువగా డ్ర-గ్స్ వినియోగిస్తున్నారని హైదరాబాద్ కమిషనర్ శ్రీనివాస రెడ్డి వ్యాఖ్యానించడం కలకలం రేపింది.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా శ్రీనివాసరెడ్డిని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇంతకుముందు ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ అధినేత రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసాక కమీషనర్ తొలి పెద్ద ప్రకటన టాలీవుడ్ కి పెద్ద షాకింగ్ గా మారింది. సినీప్రముఖులను తీవ్రంగా ఆశ్చర్యపరిచింది.

కొత్త కమీషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస రెడ్డి మొదట టాలీవుడ్‌ను టార్గెట్ చేయడం ఫిలింనగర్ లో చర్చకు తెర తీసింది. తెలుగు చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ మాట ఎక్కువ వినిపిస్తుంది అని, డ్రగ్స్ వాడకాన్ని టాలీవుడ్ ప్రోత్సహించ కూడదని కమీషనర్ శ్రీనివాస రెడ్డి ఘాటుగా స్పందించడంతో మరోసారి తెలుగు చిత్రసీమలో డ్రగ్స్ పై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారిస్తోందన్న చర్చా మొదలైంది.
భారీ డిమాండ్ ఉన్నందున హైదరాబాద్‌లో డ్రగ్స్ సరఫరా జరుగుతోందని కూడా శ్రీనివాస రెడ్డి అన్నారు. డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టేందుకు టాలీవుడ్ నాయకులు, సినీ పరిశ్రమ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయబోతున్నట్లు కమిషనర్ శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఈ డ్రగ్స్‌ను అడ్డుకునేందుకు పరిశ్రమలు కూడా చొరవ తీసుకుని సమావేశాలు నిర్వహించాలని సూచించా








రవితేజ హీరోగా హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ ఆదివారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. భాగ్యశ్రీ చీరకట్టులో ఉన్న ఫోటోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ ఫోటోలో ఆకట్టుకొనేలా కనిపించింది. ప్రస్తుతం ఆమె ఫోటో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
భాగ్యశ్రీ బోర్సే పూణెకు చెందిన నటి, మోడల్. 33 ఏళ్ళ భాగ్యశ్రీ మోడల్ గా రాణిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే నైజీరియాలో లాగోస్ లో చదువుకుంది. ఇండియా తిరిగి వచ్చిన తరువాత బిజినెస్ మేనేజ్మెంట్ డిగ్రీ పూర్తి చేసింది. ఆ టైమ్ లో మోడలింగ్ కెరీర్ గా ఎంచుకుంది. ఒక ఎజెన్సీతో పనిచేసింది. అలా పలు బ్రాండ్లకు భాగ్యశ్రీ అంబాసిడర్ గా పని చేసింది. క్యాడ్బరీ డైరీ మిల్క్ సిల్క్ ప్రకటనతో భాగ్యశ్రీ పాపులర్ అయ్యింది.
రీసెంట్ గా ‘యారియాన్ 2’ తో బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఈ చిత్రంలో రాజ్యలక్ష్మిగా తన నటనతో యూత్ ను ఆకట్టుకుంది. యారియన్ 2 మూవీలో భాగ్యశ్రీ బోర్సే నటన చూసి, హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ మూవీలో హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. మిస్టర్ బచ్చన్ సినిమా నుండి భాగ్యశ్రీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రముఖ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్ లో షారుక్ ఖాన్, తాప్సి జంటగా నటించిన సినిమా డంకీ. ఈ మూవీలో విక్కీ కౌశల్, బోమన్ ఇరానీ, విక్రమ్ కొచ్చర్ మరియు అనిల్ గ్రోవర్ కీలక పాత్రలలో నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్లు ఈ మూవీ పై ఆసక్తిని రేకెత్తించాయి. షారుక్ హీరోగా నటించడం, రాజ్ కుమార్ హిరానీ లాంటి దిగ్గజ దర్శకుడు దర్శకత్వం వహించడంతో ఈ మూవీ పై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ మూవీ డిసెంబర్ 21న ఆడియెన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలో డంకీ ఫస్ట్ రివ్యూ వచ్చింది.
ట్రైలర్ తో మూవీ పై ఆసక్తి ని క్రియేట్ చేసిన, రాజ్ కుమార్ హిరానీ ఆడియెన్స్ అంచనాలను మాత్రం అందుకోలేక పోయాడంటూ టాక్. ప్రధమార్ధం చెత్తగా ఉందని, ఇక ద్వితీయార్ధం ఎమోషనల్ సీన్స్ తో నెట్టుకొచ్చారట. కొన్ని సీన్స్, అలాగే ఎమోషనల్ సీన్స్ ఆడియెన్స్ కదిలిస్తాయని, మిగతాది బోర్ ఫీల్ అయ్యేలా ఉందట. హిరానీ ఎప్పటిలానే ఈ చిత్రంతో కూడా సందేశం ఇచ్చాడట.
మున్నాభాయ్ ఎంబీబీఎస్ నుండి సంజు వరకు అద్భుతమైన చిత్రాలు తీసిన రాజ్ కుమార్ హిరానీ ఈ సినిమా విషయంలో తడబడ్డట్టు సమాచారం. మరో వైపు డంకీ మూవీ పై బీఎఫ్ఎఫ్సీ సెన్సార్ రిపోర్ట్ ఇచ్చింది. ఈ మూవీలో బలమైన హిం-స, లైం-గి-క బెదిరింపులు, భయానక, ఆ-త్మ-హ-త్య, అడల్ట్ కామెడీ మరియు డ్రగ్స్ వంటి అంశాలు ఉన్నాయని షాకింగ్ సెన్సార్ రిపోర్ట్ ఇచ్చింది.