యంగ్ హీరో నితిన్, శ్రీ లీల జంటగా నటించిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రం తాజాగా విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది. ప్రముఖ రైటర్ కం డైరెక్టర్ వక్కంతం వంశీ ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. నితిన్ సొంత బ్యానర్ పైన సుధాకర్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఫస్ట్ షో నుండి కూడా ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. కామెడీ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా బాగా పేలింది. తెలుగులో హిట్ అయిన సినిమాలను స్పూఫ్ చేసి సినిమాకి అనుగుణంగా మార్చుకోవడం కూడా మరొక బలంగా మారింది.

అయితే వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతున్న నితిన్ కి “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” కొంత ఊపిరి కోసింది అని చెప్పాలి. ఈ సినిమాలోని ఇతని హీరోగా కన్నా మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా నటించాడు. మరియు ముఖ్యంగా తన స్టేటస్ అంత పక్కన పెట్టి డైరెక్టర్ ఏం చెప్తే అది చేసుకుపోయాడు. దానివల్ల కామెడీ డైలాగులు బాగా పండి సినిమాకి మంచి టాక్ లభించింది. ఈ సినిమా మంచి హిట్ అవ్వడానికి కామెడీనే కారణమని కథ ఏమీ లేదని సీరియల్ లో పాత్రకి కూడా పెద్ద ప్రాధాన్యత లేదని విశ్లేషకులు అంటున్నారు. ఆ కామెడీ అంశం నితిన్ ఎంటర్టైనింగ్ పర్ఫామెన్స్ లేకపోతే సినిమా అట్టర్ ఫ్లాఫ్ గా మిగిలేదని చెబుతున్నారు.

మరోవైపు నాని నటించిన హాయ్ నాన్న చిత్రం కూడా మంచి టాక్ తో దూసుకుపోతుంది. ఆ సినిమా కూడా మంచి కలెక్షన్స్ రాబడుతూ ప్రేక్షకులకు మంచి అనుభూతిని కల్పిస్తుంది. ఏది ఏమైనా సరే నితిన్ తనకి బలమైన కామెడీని ఎంటర్టైన్మెంట్ ని నమ్ముకున్న ప్రతిసారి హిట్టు కొడుతున్నాడని ఆయన అభిమానులు చెబుతున్నారు. ఇకపై ఇలాంటి సినిమాలు చేస్తానని నితిన్ కూడా ప్రకటించాడు.




బాలనటిగా శ్వేత బసు మొదటి హిందీ సినిమా ‘మక్డీ’ లో డబుల్ రోల్ చేసి అలరించిడమే కాక, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్టుగా నేషనల్ అవార్డ్ కూడా అందుకుంది. సినిమాల్లో అవకాశాలు తగ్గుతున్న సమయంలో శ్వేత బసుకు జరిగిన ఒక ఇన్సిడెంట్ అప్పట్లో అందర్నీ షాక్ అయ్యేలా చేసింది. ఆ సంఘటన ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. అది జరిగిన తరువాత ఆమె బాలీవుడ్ కి వెళ్ళింది. అక్కడే ఉంటూ హిందీలో సీరియల్స్ లో నటిస్తూ, ఇంకో వైపు అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ పని చేసింది. శ్వేత బసు డిసెంబర్ 2018 లో ఫిల్మ్ మేకర్ రోహిత్ మిట్టల్ ని వివాహం చేసుకుంది.కానీ ఏం జరిగిందో కానీ ఏడాదికే విడిపోయారు.
అయితే ఇప్పుడు మళ్లీ తెలుగు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నట్టుంది. అందుకేనేమో ఇటీవల హాట్ ఫోటో షూట్లను షేర్ చేస్తూ, ఇన్‌స్టాలో హీట్ పెంచుతోంది. సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే సంపాదించింది. తాజాగా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కోసం గోవా వెళ్లిన శ్వేత బసు బీచ్‌లో సందడి చేసింది. ‘ఇండియా లాక్డౌన్’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మరియు ప్రమోషన్స్‌లోనూ అందాల ఆరబోతతో రచ్చ లేపింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్వేత బసును ఇన్‌స్టాగ్రామ్‌లో 440K ఫాలో అవుతున్నారు.






యానిమల్ సినిమాలో బాబి డియోల్ పాత్ర పేరు అబ్రర్. ముస్లిం కుటుంబానికి చెందిన వ్యక్తిగా అబ్రర్ మూడు పెళ్లిళ్లు చేసుకుంటాడు. అయితే ఇందులో అబ్రర్ రెండో భార్యగా నటించిన ఆమె కనిపించింది కొద్దిసేపైనా కూడా మంచి నటన కనబరిచింది. అబ్రర్ మిగతా భార్యలతో కలిసి వచ్చే సన్నివేశాలు, క్లైమాక్స్ లో వచ్చేసి సీన్స్ లో తన నటన అద్భుతంగా ఉంది. అయితే ఆమె ఎవరు అంటూ చాలామంది ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తున్నారు. ఆమె లండన్ కి చెందిన పాకిస్తానీ నటి షఫీనా షా..!




