సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. హీరోయిన్స్ గ్లామర్ అట్రాక్షన్ గా నిలబడతారు. అందుకే సినిమాలో హీరోయిన్ ని సెలెక్ట్ చేసేటప్పుడు మూవీ టీం చాలా కేర్ తీసుకుంటుంది. ఎందుకంటే చాలామంది ఆడియన్స్ హీరోయిన్ కోసమే సినిమాకి వస్తూ ఉంటారు.
కొంతమంది హీరోయిన్స్ కేవలం గ్లామర్ రోల్స్ కు మాత్రమే పరిమితం అవుతారు. హీరోయిన్ ఎంత గ్లామర్ గా ఉంటే సినిమాకి అంత క్రేజ్ పెరుగుతుంది. అందుకే హీరోయిన్స్ తమ గ్లామర్ మెయింటైన్ చేయడం కోసం కఠిన నిబంధనలు పాటిస్తూ ఉంటారు.

ఎక్కువకాలం జిమ్ చేయడం, ప్రోటీన్ ఫుడ్ తినడం, డైట్ మెయింటైన్ చేయడం ఇలా అన్నీ కూడా క్రమం తప్పకుండా పాటిస్తారు. అలా చేస్తేనే వారి శరీరం ఆకృతి కోల్పోకుండా ఉంటుంది. హీరోయిన్స్ శరీరం సరైన ఆకృతంలో లేకపోయినా రూపం కోల్పోయిన కూడా వారిని మేకర్స్ పరిగణలోకి తీసుకోరు. అలాంటప్పుడు వారికి ఆఫర్స్ రావు. అలాగే కొంతమందికి హీరోయిన్ తాము ఇంకా మెరుగ్గా చూపించుకోవడం కోసం ప్లాస్టిక్ సర్జరీలను ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తమ ముఖ కవళికలను, బాడీ షేప్ ను మార్చుకుంటూ ఉంటారు.

ఇప్పుడు ప్రముఖ తమిళ హీరోయిన్ మహిమ నంబియార్ ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తన రూపాన్ని పూర్తిగా మార్చుకుంది. తన ముక్కుని అలాగే తన పెదాలను ప్లాస్టిక్స్ సర్జరీ ద్వారా మరింత అందంగా మార్చుకుంది. ఒక డాక్టర్ మహిమ నంబియార్ ఏ విధంగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది అనేది ఒక వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసింది. అప్పుడు మహిమా నంబియార్ ని,ఇప్పుడు ఉన్న మహిమ నంబియార్ ను చూసి ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురైపోతున్నారు. ఇంతలో ఎంత మార్పు అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.
watch video :
https://www.instagram.com/reel/Cz-Xd9ZJuNH/?igshid=NjZiM2M3MzIxNA==






















ఇక చెన్నై బ్యూటి త్రిష ఇండస్ట్రీకి ఇచ్చి ఇరవైమూడు ఏళ్లు గడుస్తున్నా వన్నె తరగని అందంతో ఇంకా నటిస్తూనే ఉంది. హీరోయిన్స్ పది ఏళ్లలోనే పరిశ్రమ నుండి ఫేడ్ అవుట్ అయ్యే రోజుల్లో కూడా 23 ఏళ్లుగా అగ్ర నటిగా నిలదొక్కుకున్న ఘనత త్రిషాకే దక్కింది. ఆ మధ్య సరైన హిట్స్ లేక కాస్త వెనక్కి తగ్గిన ఆమె ps-1 సినిమాతో కమ్‌బ్యాక్ అయ్యింది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా త్రిష కెరీర్‌ను మళ్ళీ మలుపు తిప్పింది. కుందవై యువరాణి పాత్రలో అద్భుతంగా నటించి మ్యాజిక్ చేసింది.
ఇక అసలు విషయంలోకి వస్తే త్రిష, ప్రకాష్ రాజ్ కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు.కానీ ఒకే హీరోయిన్ కి లవర్ గా, మామగా, నాన్నగా, అన్నగా ఇలా అన్ని పాత్రల్లోనూ చేసిన ఒకే ఒక నటుడు ప్రకాష్ రాజ్, ఆ హీరోయిన్ త్రిష. ఇలా వీరు నటించిన ఆ సినిమాల్లో వీరిద్దరూ పోటీ పడి నటించారు. ఆ ఘనత విరిద్దరికే దక్కుతుంది. ఆకాశమంతా సినిమాలో తండ్రి కూతుర్లుగా జీవించారు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీలో త్రిష ప్రేమించిన అబ్బాయి తండ్రిగా, కాబోయే కోడలికి మంచితనం గుర్తించే మామగా, సైనికుడు సినిమాలో విలన్ బావమరిదిగా, త్రిషకి వరుసకి అన్నగా చేసాడు.
తమిళంలో విజయ్ హీరోగా వచ్చిన గిల్లీ సినిమా,ఇది తెలుగులో మహేశ్ ‘ఒక్కడు’ సినిమాకి రీమేక్. ఇక్కడ హీరోయిన్ గా భూమిక నటించగా, తమిళ్ లో త్రిష నటించింది.త్రిషను ప్రేమించే విలన్ గా రెండు చోట్లా ప్రకాష్ రాజ్ నటించాడు. ఇలా తండ్రీ కూతుళ్లు గా, నాయికా ప్రతినాయకులుగా ఎలా కనిపించినా కూడా ప్రకాశ్‌రాజ్, త్రిష కాంబోను ఇటు తెలుగు ఆడియెన్స్ , అటు తమిళ ఆడియెన్స్ ఆదరించారు. తాజాగా వీరిద్దరు ముఖ్య పాత్రలు పోషించిన ‘పొన్నియిన్ సెల్వన్ 1’సూపర్ హిట్ అయ్యింది.