బాలకృష్ణ తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించారు. అయితే సినిమా టైటిల్లో సింహా పేరుతో బాలకృష్ణ ఎన్నో సినిమాలు చేశారు. మరి ఆ సినిమాల జాబితా ఇప్పుడు చూద్దాం. యువరత్న బాలకృష్ణ సింహా పేరుతో సినిమాలు చేయడం వల్ల నటసింహం బాలకృష్ణగా మారి పోవడం జరిగింది. టైటిల్ లో సింహా పెట్టి పలు బ్లాక్ బస్టర్లు కూడా కొట్టేశారు.
#1. నరసింహ నాయుడు:

నరసింహ నాయుడు 2001 లో వచ్చింది. 9 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను చిత్రీకరించారు.
#2. జై సింహ:

జై సింహ సినిమా 2018 లో వచ్చింది బాలకృష్ణ సరసన నయనతార నటించారు. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం లో ఈ సినిమా వచ్చింది.
#3. సింహ:

2010లో సింహ సినిమా వచ్చింది ఈ సినిమా. ఇది కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది.
#4. సీమ సింహం:

2002లో బాలకృష్ణ హీరోగా ఈ సినిమా వచ్చింది. బాలకృష్ణ సరసన సిమ్రాన్, రీమాసేన్ నటించారు. రామ్ ప్రసాద్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.
#5. లక్ష్మీ నరసింహ:
ఈ సినిమా 2014లో వచ్చింది. ఇది సామి సినిమా రీమేక్.

#6. బొబ్బిలి సింహం:

ఈ సినిమా 1994 లో వచ్చింది ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. రోజా, మీనా బాలకృష్ణ సరసన నటించారు.
#7.సమరసింహా రెడ్డి:

1999 లో ఈ సినిమా వచ్చింది. అంజలా జవేరీ, సిమ్రాన్ బాలకృష్ణ సరసన నటించారు. ఆరు కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా థియేటర్ లో విడుదలయ్యింది.
#8. సింహం నవ్వింది:

1983లో ఈ చిత్రం వచ్చింది. బాలకృష్ణ, ఎన్టీఆర్‌తో కలిసి ఈ సినిమాలో నటించాడు.
#9. లయన్:

2015లో ఈ సినిమా వచ్చింది. లయన్ అని సింహం అర్ధం వచ్చేటట్టు సినిమా పేరు పెట్టారు.

ఇదిలా ఉంటే ఇటీవలే అఖండ చిత్రంతో భారీ సక్సెస్ సాధించారు బాలకృష్ణ. బాలకృష్ణ నటించిన ప్రాజెక్టుగా ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సారథ్యంలో, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం NBK 107. ఇది బాలకృష్ణ 107 వ చిత్రంగా రూపుదిద్దుకుంటుంది. ఈ చిత్రంలో బాలయ్య బాబు సరసన హీరోయిన్ గా శృతి హాసన్ కనిపించనుంది. వరలక్ష్మి శరత్ కుమార్ ఈ చిత్రంలో ఒక ముఖ్య పాత్ర పోషించనున్నారు. ఈ చిత్రంలో శాండిల్ వుడ్ హీరో దునియా ఫేమ్ విజయ్ విలన్ గా నటిస్తున్నారు.























టాలీవుడ్ లో ఇప్పటివరకు కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. వాటిలో ఎక్కువ శాతం సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. యువతను ఫిదా చేశాయి. అలాంటి సినిమానే మ్యాడ్. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ యూత్ ను ఆకట్టుకుంది. కాలేజీలో గ్యాంగ్స్, సీనియర్లు, జూనియర్లు, ర్యాగింగ్, గొడవలు. ప్రేమలు వంటివాటిని ట్రైలర్ చూపించారు.
నేడు ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. అయితే ఈ చిత్రంలో నటించిన ముగ్గురి హీరోలలో డీడీగా నటించిన యాక్టర్ తన నటనతో, కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడని టాక్. మూవీ చూసిన ఆడియెన్స్ సైతం అతని పై ప్రశంసలు కురిపిస్తున్నారు. రివ్యూయర్స్ సైతం ఆ కుర్రాడి స్టైల్, కామిడి టైమింగ్, డైలాగ్ డెలివరీ ని మెచ్చుకుంటున్నారు.
ఆ నటుడి పేరు సంగీత్ శోభన్. అతను ఇప్పటికే పలు వెబ్ సిరీస్ లలో నటించి అలరించాడు. మ్యాడ్ సినిమాలో తన కామెడీ టైమింగ్ తో తెలుగు ఇండస్ట్రీకి మంచి కామెడీ హీరో లభించాడు అనుకునేలా నటించాడు. సంగీత్ శోభన్ మరేవరో కాదు యంగ్ హీరో సంతోష్ శోభన్ తమ్ముడు మరియు దివంగత డైరెక్టర్ శోభన్ రెండవ కుమారుడు. అన్నయ్య సంతోష్ హీరోగా సీరిస్, సినిమాలలో నటిస్తుంటే, తమ్ముడు సంగీత్ కామెడీ సిరీస్ లలో, సినిమాలలో నటిస్తున్నాడు.
కలర్స్ స్వాతి యాంకర్, హీరోయిన్, సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పలు తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. 2018లో స్వాతి వికాస్ అనే వ్యక్తిని ఆగస్టు పెళ్లి చేసుకుని, ఇండస్ట్రీకి దూరం అయ్యింది. చాలా గ్యాప్ తరువాత మంత్ ఆఫ్ మధు మూవీ ద్వారా రీఎంట్రీ ఇచ్చారు.
ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే, వైజాగ్ లో నివసించే మధుసూధన్ రావు(నవీన్ చంద్ర) తన గవర్నమెంట్ జాబ్ ను పోగొట్టుకుంటాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య లేఖ (స్వాతి రెడ్డి) విడాకుల కోసం కోర్టుకు వెళ్తుంది. అయితే మధుసూధన్ తన భార్య ఎప్పటికైనా తిరిగి వస్తుందనే నమ్మకంతో వెయిట్ చేస్తుంటాడు. ఈ క్రమంలో అతను మద్యానికి బానిస అవుతాడు. ఇది ఇలా ఉంటే, యూఎస్ లో సెటిల్ అయిన మధుమతి(శ్రియ నవిలే) అనే అమ్మాయి బంధువుల ఇంట్లో వివాహానికి వైజాగ్ వస్తుంది.
అయితే ఒక సందర్భంలో మధుమతికి మధుసూధన్ తో పరిచయం అవుతుంది. ఒకసారి మాటల సందర్భంలో మధుసూధన్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఆమెకు తెలుస్తుంది. ఆ తరువాత ఏం జరిగింది? లేఖ ఎందుకు విడాకులు తీసుకోవాలనుకుంది? ఆఖరికి లేఖ మధుసూదన్ కలిశారా? అనేది మిగిలిన కథ. మంత్ ఆఫ్ మధు సినిమా అనేది అమెరికా నుంచి వైజాగ్ కి వచ్చిన మధుమతి నెల రోజుల్లో ఎదుర్కొన్న అనుభవాలే ఈ మూవీ.
“అఖండ” బ్లాక్ బస్టర్ హిట్ తరువాత దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన మరో మాస్ ఎంటర్ టైనర్ స్కంద. బోయపాటి శ్రీను మూవీ అంటే తప్పకుండా మాస్ ఎలిమెంట్స్ అధికంగా ఉంటాయి. ఊహకు అందని రీతిలో బోయపాటి తన చిత్రాలలో ఫిక్షన్‌ను జోడిస్తారు. కానీ, స్కంద మూవీలో అది అతి అయ్యిందని ప్రేక్షకుల నుండి విమర్శలు వినిపిస్తున్నాయి.
రొటీన్ స్టోరీని కూడా విపరీతమైన వయొలెన్స్‌తో చూపించారని, మూవీలో పెద్దగా ఏమీ లేదని నెటిజెన్లతో పాటు విమర్శకులు కూడా అంటున్నారని టాక్. స్కంద మూవీలో హీరో రామ్ రెండు పాత్రలు చేసినట్టు తెలుస్తోంది. ఒక పాత్ర కాలేజీలో చదువుకునే యువకుడిగా నటిస్తే, మరో పాత్ర మొరాకోలో పేరుగాంచిన హంతకుడు. కాలేజీ స్టూడెంట్ గా నటించిన పాత్ర పేరు భాస్కర్ రాజు.
తెలంగాణ ముఖ్యమంత్రి కుమార్తె శ్రీలీలా రెడ్డిని ప్రేమిస్తాడు. ఇక మొరాకో నుండి వచ్చిన రామ్ క్యారెక్టర్ పేరు మణికంఠ స్కందరాజు. శ్రీలీలా రెడ్డి క్యారెక్టర్ లో హీరోయిన్ శ్రీలీల నటించింది. ఈ మూవీ 7 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 31 కోట్ల షేర్ సాధించినట్టు తెలుస్తోంది. ఇక ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే 47 కోట్ల షేర్ కలెక్ట్ చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది.