‘అద్దురి’ సినిమాతో కన్నడ సినీ ఇండ్రస్టీలో అడుగుపెట్టాడు హీరో ధృవ సర్జా. శాండల్‌వుడ్ హీరో ధృవ యాక్షన్ కింగ్ అర్జున్ సర్జాకు మేనల్లుడు.
అలాగే స్వర్గీయ చీరంజీవి సర్జాకి తమ్ముడు కూడా. కన్నడ చిత్ర పరిశ్రమలో ధృవకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే.

అయితే ఈ ఇటీవల ధృవ చేసిన పనికి నెటిజన్లు ప్రశంసులు కురిపిస్తున్నారు. ప్రేమించి వివాహం చేసుకున్న ధృవకు ఒక పాప ఉంది. ఆమె భార్య ప్రేరణ మళ్లీ గర్భవతి. అయితే శ్రీ కృష్ట జన్మాష్టమి రోజు ధృవ తన భార్యకు సీమంత వేడుక నిర్వహించారు. దీనికి ఎందుకు నెటిజన్లు ప్రశంసిస్తున్నారని అనుకుంటున్నారా.. ఇందులోనే ఓ ట్విస్ట్ ఉంది.

తన అన్నయ్య చీరంజీవి మరణించిన సంగతి తెలిసిందే. అయితే తన భార్య సీమంత వేడుకను ధృవ ఫామ్ హౌస్‌లో చీరంజీవి సర్జా సమాధి దగ్గర జరిపించాడు. ఫామ్ హౌస్ మొత్తాన్ని పూలతో అలంకరించాడు కూడా. అలాగే పిల్లలకు కృష్ణుడి వేషం వేసి వేడుకగా జరుపుకున్నారు.

ఈ విషయాన్ని ధృవ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నెటిజన్లు అన్న మీద నీకు ఉన్న ప్రేమను చాటుకున్నావు. నువ్వు సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికీ సర్జా కుటుంబం చీరంజీవి మరణం నుంచి కోల్కోవటలేదు.




గుప్పెడంత మనసు స్టార్ మా లో ప్రసారం అవుతున్న సీరియల్. ఈ సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. రిషి, వసు లవ్ స్టోరీ, తల్లీకొడుకుల సెంటిమెంట్ ఆడియెన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఈ సీరియల్ కు వంద ఎపిసోడ్స్ వరకు కార్తీక దీపం సీరియల్ డైరెక్టర్ కాపుగంటి రాజేంద్ర తెరకెక్కించారు. ఆ తరువాత కుమార్ పంతం డైరెక్ట్ చేస్తున్నారు.
అప్పటి నుంచి ఈ సీరియల్ టాప్ రేటింగ్ లో కొనసాగుతున్న కార్తీక దీపం సీరియల్‌కి చాలా పోటీ ఇచ్చింది. ఒకానొక సమయంలో గుప్పెడంత మనసు ‘కార్తీక దీపం’ సీరియల్ ను మించుతుందేమో అనేట్టుగా కుమార్ పనిచేశారు. కార్తీక దీపం సీరియల్ కి ఎండ్ కార్డు పడిన తరువాత. అదే టైమ్ లో ప్రసారం అవుతున్న బ్రహ్మముడి సీరియల్ ను అద్భుతంగా కుమార్ తెరకెక్కిస్తున్నారు.
ఈ సీరియల్ గత కొన్ని నెలలుగా టీఆర్పీలో టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. కార్తీక దీపం సీరియల్ ను ఆడియెన్స్ ఎంతగా ఆదరించారో తెలిసిందే. ఆ సీరియల్ ను ప్రేక్షకులకు గుర్తు రాకుండా ఇంట్రెస్టింగ్ గా ఫ్యామిలీ ఎమోషన్స్ బ్రహ్మముడి దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. ఈ సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అతను ప్రముఖ సీరియల్ నటి కిరణ్మయి భర్త. ఆమె ఎన్నో సీరియల్స్ లో నటించింది.







ఈ ఏడాది విజయ్ దళపతి నటించిన వారసుడు వంటి రొటీన్ కంటెంట్ మూవీ అయినా తెలుగులో మంచి కలెక్షన్స్ సాధించింది. ఈ నేపథ్యంలో త్వరలో రిలీజ్ కాబోయే లియో మూవీ పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ మూవీ రైట్స్ కోసం సితార సంస్థ భారీ మొత్తాన్ని చెల్లించడం టాలీవుడ్ లో సంచలనంగా మారింది. తమిళ స్టార్ విజయ్ దళపతి, లోకేష్ కనకరాజ్ కాంబోలో ఈ మూవీ తెరకెక్కింది.
తాజాగా రిలీజ్ అయిన లియో ట్రైలర్ యూట్యూబ్ లో దూసుకెళ్తోంది. అయితే ఈ ట్రైలర్ లో అర్జున్ సర్జా, సంజయ్ దత్, హీరోయిన్ త్రిషతో పాటు కనిపించిన ఈ వ్యక్తి మరెవరో కాదు కోలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ మరియు నటుడు శాండీ మాస్టర్. అతను తమిళ సినీ ఇండస్ట్రీలో మరియు టెలివిజన్ లో కూడా పనిచేస్తున్నాడు. శాండీ 2005 లో కలైంజర్ టీవీలో ప్రసారమైన పాపులర్ డ్యాన్స్ షో ‘మానాడ మయిలాడ’ సీజన్ 1లో కొరియోగ్రాఫర్‌గా కెరీర్‌ను ప్రారంభించాడు.
ఆ షోలో విజేతగా నిలిచాడు. ఆ తరువాత ‘మానాడ మయిలాడ’ వివిధ సీజన్లలో న్యాయనిర్ణేతల ప్యానెల్లో ఒకరిగా పనిచేశారు. 2019లో జరిగిన బిగ్ బాస్ తమిళ వెర్షన్లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న తర్వాత శాండీ మాస్టర్ బాగా పాపులర్ అయ్యారు. స్టార్ హీరోల సినిమాలకి కొరియోగ్రాఫర్ చేస్తూనే సినిమాలలో కూడా నటించడం ప్రారంభించాడు. ‘ఇవనుకు తన్నిల గండం’ అనే తమిళ చిత్రంతో నటుడుగా కెరీర్ మొదలుపెట్టాడు. పలు సినిమాలలో గెస్ట్ రోల్ లో కనిపించిన శాండీ మాస్టర్ లియో మూవీలో నటించాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శాండీ మాస్టర్ ను ఇన్ స్టాగ్రామ్ లో 2 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.

















#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16


ఉత్తర్‌ప్రదేశ్ కేడర్ 2011 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ అభిషేక్ సింగ్ నటన మీద ఉన్న ఇష్టంతో సంచలన నిర్ణయం తీసుకుని, ఉద్యోగానికి రిజైన్ చేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు కూడా ధ్రువీకరించారు. అభిషేక్ సింగ్‌కు యాక్టింగ్, మోడలింగ్ అంటే చాలా ఆసక్తి ఉండడంతో ఒక వైపు ఐఏఎస్ అధికారిగా ఢిల్లీ సచివాలయంలో ముఖ్యమైనహోదాలో కొనసాగారు. మరో వైపు తనకు ఇష్టం అయిన నటన, మోడలింగ్ రంగాలలో రాణించారు.
అభిషేక్ సింగ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయిన ‘ఢిల్లీ క్రైమ్ సీజన్- 2’ లో ఇన్వెస్టిగేషన్ అధికారి క్యారెక్టర్ లో నటించి. మంచి గుర్తింపును తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఓటీటీలలో మంచి యాక్టర్ గా పేరు తెచ్చుకుంటూ, మోడల్ గా ఆకట్టుకుంటున్నారు. అభిషేక్ సింగ్ మొదటిసారి నటించిన షాట్ ఫిలిం ‘చార్ పండ్రా’. దీనిని టీ సిరీస్ సంస్థ రూపొందించింది.
ఈ సాంగ్ లో అభిషేక్ ప్రేమికుడిగా అద్భుతంగా నటించి, మెప్పించాడు. ఐఏఎస్ ఆఫీసర్ అయినప్పటికీ ఒక యాక్టర్ గా అద్భుత నటనను కనబరిచినందుకు ఆడియెన్స్ ఆయన నటనకు ఫిదా అయ్యారు. ఈ సాంగ్ రిలీజ్ అయిన 4 రోజులకే యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారింది. ఇక ఇప్పటి వరకు ఆ సాంగ్ కు యూట్యూబ్ లో 560 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అభిషేక్ సింగ్ కు ఇన్స్టాగ్రామ్ లో ఐదు మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.