CHINNA REVIEW : “సిద్ధార్థ్” ఈ సినిమాతో తెలుగులో కూడా హిట్ కొట్టినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

CHINNA REVIEW : “సిద్ధార్థ్” ఈ సినిమాతో తెలుగులో కూడా హిట్ కొట్టినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya

Ads

తమిళ్ డబ్బింగ్ సినిమాల ద్వారా, డైరెక్ట్ తెలుగు సినిమాల ద్వారా లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకున్న హీరో సిద్ధార్థ్. గత కొంత కాలం నుండి సిద్ధార్థ్ కి సరైన హిట్ లేదు. ఇప్పుడు తన నిర్మాణంలోనే చిన్నా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తమిళ్ లో రూపొందిన ఈ సినిమాని తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. ఈ సినిమా ఇవాళ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

  • చిత్రం : చిన్నా
  • నటీనటులు : సిద్ధార్థ్, నిమిషా సజయన్.
  • నిర్మాత : సిద్ధార్థ్
  • దర్శకత్వం : ఎస్.యు.అరుణ్ కుమార్
  • సంగీతం : ధిబు నినాన్ థామస్
  • విడుదల తేదీ : అక్టోబర్ 6, 2023

chinna movie review

స్టోరీ :

ఈశ్వర్ (సిద్ధార్థ్) పురపాలక శాఖలో ఉద్యోగి. తన అన్నయ్య చనిపోవడంతో తన వదిన (అంజలి నాయర్), అన్నయ్య కూతురు చిట్టి అలియాస్ సుందరి (సహస్ర శ్రీ​) బాధ్యతలని ఈశ్వర్ తీసుకుంటాడు. చిట్టికి కూడా తన బాబాయ్ అంటే చాలా ఇష్టం. బాబాయ్ అయిన చిన్నాన్నను ముద్దుగా చిన్న అని పిలుస్తుంది. తన అన్నయ్య కూతురిని మాత్రమే కాకుండా అసలు పిల్లలని ఎంతగానో ఇష్టపడే ఈశ్వర్ మీద ఒక పడకూడదని నిందపడుతుంది.

chinna movie review

తన కుటుంబానికి చెందిన ఒక అమ్మాయిని ఈశ్వర్ వేధించాడు అని ఒక ఆరోపణ పడుతుంది. ఈ నింద వల్ల బాధలో ఉన్న ఈశ్వర్ కి మరొక బాధ ఎదురవుతుంది. తన అన్న కూతురు చిట్టి కనిపించకుండా పోతుంది. చిట్టి ఎటు వెళ్ళింది? అసలు ఈశ్వర్ మీద అలాంటి నింద ఎందుకు పడింది? అందులో ఎంతవరకు నిజం ఉంది? ఈశ్వర్ ఈ సమస్యలను ఎలా పరిష్కరించాడు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

chinna movie review

రివ్యూ :

చాలా సంవత్సరాల నుండి సిద్ధార్థ్ విరామం లేకుండా సినిమాలు చేస్తున్నా కూడా సరైన హిట్ లేదు. మధ్యలో గ్యాప్ తీసుకొని ఆ తర్వాత మహాసముద్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. చాలా అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులని నిరాశపరిచింది. సిద్ధార్థ్ ఎక్కువగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు మాత్రమే చేస్తారు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కూడా ఒక మంచి కాన్సెప్ట్, లేదా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటే మాత్రమే సినిమా చేస్తారు. ఈ సినిమా కూడా అలాంటి సినిమానే.

chinna movie review

సినిమా కథ డిఫరెంట్ గా ఉండడంతో, అది సిద్ధార్థ్ కి బాగా నచ్చడంతో ఈ సినిమాని తనే నిర్మించారు కూడా. కన్నడలో కూడా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. అక్కడ కూడా సిద్ధార్థ్ డబ్బింగ్ చెప్పుకున్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే సినిమా పట్ల సిద్ధార్థ్ కి ఎంత ప్రేమ ఉందో చెప్పకుండానే అర్థం అవుతోంది. ఇంక ఈ సినిమా విషయానికి వస్తే ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఈ సినిమా చాలా సహజంగా తీశారు. సినిమా చూస్తున్నంత సేపు కూడా ఒక సినిమా చూస్తున్నాం అనే ఫీలింగ్ రాదు.

chinna movie review

అంతే కాకుండా డబ్బింగ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. దాంతో దాదాపు ఒక తెలుగు సినిమాని చూసినట్టే అనిపిస్తుంది. సినిమాలో చాలా సెన్సిటివ్ విషయం గురించి డీల్ చేశారు. కాస్త అటు ఇటు అయినా కూడా ప్రమాదమే. కానీ అలా అవ్వకుండా ఇలాంటి టాపిక్ ని ధైర్యంగా తెర మీద చూపించినందుకు దర్శకుడిని మెచ్చుకోవాలి. ఇంక పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే సినిమాలో ఉన్న నటీనటులు అందరూ కూడా తమ పాత్రలకి తగ్గట్టు నటించారు. కానీ సినిమా మొత్తాన్ని సిద్ధార్థ్ తన భుజాల మీద నడిపించారు.

chinna movie review

ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో సిద్ధార్థ్ నటన చాలా బాగుంది. ఒక రకంగా చెప్పాలి అంటే తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇది అవుతుంది అని అనొచ్చు ఏమో. అలాగే చిట్టి పాత్రలో నటించిన పాప కూడా బాగా నటించింది. కానీ, సినిమాలో మెయిన్ పాయింట్ లోకి వెళ్లడానికి చాలా సమయం తీసుకున్నారు ఏమో అనిపిస్తుంది. సినిమా స్టార్ట్ అయ్యాక ఒక బాబాయికి, కూతురికి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో చూపించాలి అనుకున్నారు. కానీ ఆ చూపించడానికి తీసుకున్న సమయం వల్ల ఆ సీన్స్ అన్నీ కూడా సాగదీసినట్టు అనిపిస్తాయి.

chinna movie review

మెయిన్ పాయింట్ లోకి ఎంటర్ అవ్వడానికి సమయం పడుతుంది. దాంతో అసలు గొడవ ఎప్పుడు వస్తుంది అని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. సినిమాలో ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. ఇప్పటి కాలం పిల్లలకి తినకపోతే ఫోన్ చేతికి ఇచ్చేయడం​ వంటివి చేస్తూ ఉంటారు. దాని వల్ల ఎంత ప్రమాదం జరుగుతుంది అనేది ఈ సినిమా ద్వారా చూపించారు. కానీ అది చూపించడానికి కాస్త సమయం తీసుకున్నారు. ఎడిటింగ్ విషయంలో కూడా ఇంకా కాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

  • సిద్ధార్థ్
  • దర్శకుడు ఎంచుకున్న పాయింట్
  • నిర్మాణ విలువలు
  • సినిమాలో అందించిన మెసేజ్

మైనస్ పాయింట్స్:

  • సాగదీసినట్టుగా ఉండే కొన్ని సీన్స్
  • ఎడిటింగ్

రేటింగ్ :

3/5

ట్యాగ్ లైన్ :

కాస్త లెంత్ ఎక్కువగా ఉన్నా​ పర్వాలేదు, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమా చూద్దాం అనుకునే వారిని, సమాజంలో జరిగే విషయాల మీద వచ్చే సినిమాలని ఇష్టపడే వారిని​ ఈ సినిమా నిరాశ పరచదు. ఇటీవల కాలంలో వచ్చిన ఒక మంచి ప్రయోగాత్మకమైన సినిమాగా చిన్నా సినిమా నిలుస్తుంది.

watch trailer :

ALSO READ : “7/జి బృందావన్ కాలనీ” తెలుగు, తమిళ సీన్స్ లో… ఈ తేడా గమనించారా..?


End of Article

You may also like