బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, సౌత్ ఇండియా స్టార్ నయనతార నటించిన జవాన్ ఇటీవల రిలీజ్ అయిన విషయం తెలిసిందే. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో ముందుకు దూసుకెళ్తున్న ఈ సినిమాను స్టార్ డైరక్టర్ అట్లీ దర్శకత్వం వహించాడు.
తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళంలో కూడా ఈ సినిమా దుమారం రేపుతోంది. సినిమా రిలీజ్ అయిన పదిరోజులకే ప్రపంచ వ్యాప్తంగా 797.50కోట్లు వచ్చిందని జవాన్ టీమ్ తెలిపింది.
![]()
ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ అయిన దీపికా పదుకొనే, ప్రియమణి, విజయ్ సేతుపతి, సాన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్ వంటి ప్రధాన యాక్టర్లు కూడా ఉన్నారు. ఈ సినిమాలో దీపికా షారుక్‌కి జంటగా గెస్ట్ రోల్ చేసింది. షారుఖ్ సొంత బ్యానర్లో రిలీజ్ అయిన ఈ సినిమాకి అనిరుద్ద్ సంగీతం అందించాడు. అయితే థియేటర్లో సందడి చేస్తున్న ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందని చాలామంది ఎదురుచూస్తున్నారు.

దీనికి డైరక్టర్ అట్లీ స్పందిస్తూ.. షారుఖ్ ఖాన్ రన్ టైమ్, ఎమోషనల్ సీన్లతో జవాన్ సినిమాను థియేటర్లలో విడుదల చేశాం. ఇంకా కొన్ని సీన్లు మళ్లీ యాడ్ చేయాలని అనుకుంటున్నాం. ఓటీటీలో ఈ సినిమా మిమ్మల్ని సర్ప్రైజ్ చేసే విధంగా ఉంటుందని అట్లీ తెలిపారు. కానీ ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడొస్తుందని మాత్రం చెప్పలేదు.

ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. దీనికోసం సుమారుగా రూ.250కోట్లు వెచ్చించిందట. అయితే ఈ సినిమా నవంబర్ మొదటివారంలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి దీపావళి కానుకగా కూడా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. జవాన్ హిట్‌తో సంతోషంగా ఉన్న అట్లీ అల్లుఅర్జున్‌తో సినిమా చేయనున్నట్లు సమాచారం.




కుమార్తె మీరా మరణంతో విజయ్ ఆంటోనీ దుఃఖాన్ని ఆపడం ఎవరి వల్ల కావడం లేదు. పోస్ట్ మార్టం అనంతరం మీరా భౌతిక కాయాన్ని విజయ్ ఆంటోనీ దంపతులు ఇంటికి తరలించారు. మీరాను కడసారి చూడడం కోసం తమిళ ఇండస్ట్రీ ప్రముఖులు విజయ్ నివాసానికి తరలి వస్తున్నారు. విజయ్ ఆంటోనీని ఓదారస్తున్నారు. ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తమ అభిమాన హీరోకు ధైర్యం చెప్తూ పోస్ట్ లు పెడుతున్నారు.
మీడియాతో చాలా తక్కువగా మాట్లాడే విజయ్ ఆంటోనీ గతంలో ఆత్మహత్యకు వ్యతిరేక అవగాహన కలిగించే ప్రోగ్రామ్స్ కు ప్రచారకర్తగా పాల్గొన్నారు. అప్పుడు మాట్లాడిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కానీ ఆయన కుమార్తె అలా చేసుకోవడం అందరినీ వేదనకు గురిచేస్తోంది. మీరా మృతి పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో మీరా స్కూల్, ఆమె ఫ్రెండ్స్ ను విచారించారు. మీరా ల్యాప్‌టాప్ మొదలుకొని ఆమె ఉపయోగించే వస్తువులను పరీక్షిస్తున్నారు.
ఈ కేసు దర్యాప్తులో మీరా సోమవారం రాత్రి 11 గంటల వరకు తన ల్యాప్‌టాప్‌ను ఉపయోగించిందని, ఆ తర్వాత మీరా ఉరివేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది. మీరా పాఠ్యపుస్తకంలో ఒక లెటర్ దొరికిందని అంటున్నారు. ఆ లెటర్ లో మీరా తన ఫ్రెండ్స్ ను, టీచర్స్ ను మిస్ అవుతున్నానని పేర్కొంది. అందరూ సురక్షితంగా మరియు సంతోషంగా ఉండండి. లవ్ యూ ఆల్ !! థాంక్యూ ఆల్ !! అని రాసినట్టు చెబుతున్నారు.
అతిథి వెబ్ సిరీస్ ను ప్రవీణ్ నిర్మించగా, భరత్ వై.జి. తెరకెక్కించారు. హీరో వేణు తొట్టెంపూడి ప్రధాన పాతరలో నటించిన ఈ సిరీస్ లో అవంతిక మిశ్రా, అదితి గౌతమ్ ,వెంకటేశ్ కాకుమాను, రవి వర్మ కీలక పాత్రలలో నటించారు. ఇక ఈ సిరీస్ కథ విషయానికి వస్తే, స్టోరీ రైటర్ రవి వర్మ (వేణు తొట్టెంపూడి), సంధ్య (అదితి గౌతమ్) భార్యాభర్తలు. సంధ్య నిలయం అనే పెద్ద భవనంలో జీవిస్తూ ఉంటారు. రవివర్మ భార్య సంధ్యకు పక్షవాతం రావడం వల్ల బెడ్ కే పరిమితమవుతుంది. రవివర్మ భార్యకు సేవలు చేస్తూ, కథలు రాస్తూ జీవిస్తుంటాడు.
ఒక రోజు అతను రాసిన స్టోరీలోలానే వర్షం కురిసిన ఆ రాత్రి రవివర్మ బంగ్లాకి మాయ (అవంతిక) అనే యువతి వస్తుంది. మరోవైపు యూట్యూబర్ అయిన సవేరి (వెంకటేష్ కాకుమాను) దెయ్యాలు లేవనే కాన్సెప్ట్ తో వీడియోలు తీసి తన ఛానెల్ లో పెడుతుంటాడు. ఆ క్రమంలోనే సవేరి తనను దెయ్యం వెంబడిస్తుందనే భయంతో రవివర్మ బంగ్లాకి వస్తాడు. సవారి మాయను దెయ్యం అని సందేహపడుతాడు. కానీ ఆ ఇంట్లోనే మాయ మరణిస్తుంది. ఆమె చనిపోవడానికి కారణం ఎవరు? మాయ దెయ్యం అనుకున్న సవారి సందేహం నిజమైందా? ఆఖరికి ఏం జరిగింది అనేది మిగిలిన కథ.
ఆరు ఎపిసోడ్ లతో రూపొందిన ఈ వెబ్ సిరీస్ లో తొలి మూడు ఎపిసోడ్స్ క్యూరియాసిటీ కలిగేలా చేశాయి. అయితే ఆ తర్వాత ఎపిసోడ్ లు రొటీన్ ఫార్మేట్లోకి వచ్చిన భావన కలుగుతుంది. హీరో వేణు ఇప్పటివరకు కామెడీ పాత్రలను ఎక్కువగా చేశాడు. ఇందులో పూర్తిగా సీరియస్ పాత్రలో కనిపిస్తారు. రచయిత రవి వర్మగా సెటిల్డ్ గా నటించాడు. అధితి గౌతమ్ సంధ్యగా పర్వాలేదనిపించింది. మాయ పాత్ర చేసిన అవంతిక నటనతో ఆకట్టుకుంది.





షారుక్ ఖాన్, నయనతార జంటగా నటించిన జవాన్ మూవీ బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ సాధించి, వెయ్యి కోట్ల వసూళ్ల వైపు దూసుకెళ్తోంది. ఈ మూవీకి తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించారు. ఈ మూవీ విజయంతో అట్లీ సంతోషంలో మునిగిపోయాడు. ఈ క్రమంలోనే అట్లీ తన మూవీ జవాన్ ను ఆస్కార్ బరిలో దింపాలని కోరుకుంటున్నాడు. ఈ విషయం గురించి దర్శకుడు అట్లీ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అట్లీ మాట్లాడుతూ, ఏ దర్శకులకు అయినా అవార్డుల పైన ఆశ ఉంటుందని అన్నారు. జాతీయ అవార్డు, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్, ఆస్కార్ అవార్డ్ వంటివాటిని అందుకోవాలని కలలు కంటారని అన్నారు. అన్నీ కరెక్ట్ గా సెట్ అయితే, జవాన్ మూవీని ఆస్కార్ బరిలో నిలబెట్టాలని భావిస్తున్నామని, ఈ విషయం గురించి షారుఖ్ సర్ని అడగాలని, ఆయన ఎలా రెస్పాండ్ అవుతారో అని అట్లీ చెప్పుకొచ్చారు.
అయితే అట్లీ చేసిన ఈ కామెంట్స్ పై నెటిజెన్లు అట్లీని ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. కొందరు నెటిజెన్లు అన్నీ సినిమాలను కలిపి తీసావు. ఏ విభాగంలో ఆస్కార్ ఇవ్వమని అంటావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ వంటి మూవీ కేటగిరీలో ఆస్కార్ ఇస్తారా? అని, రకరకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు. అయితే జవాన్ మూవీని సౌత్ లో ఆదరించక పోయినా, బాలీవుడ్ లో ఈ మూవీని విపరీతంగా చూస్తున్నారు. దాంతో బాలీవుడ్లో అతిపెద్ద రికార్డులను సృష్టిస్తోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా క్రేజ్ ను తెచ్చుకున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఫ్లాప్ హీరోయిన్లకు కూడా తన సినిమాలలో అవకాశం ఇస్తుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. రామ్ చరణ్, కొన్ని సంవత్సరాల కిందట బ్రూస్ లీ అనే మూవీలో శ్రీను వైట్ల దర్శకత్వంలో నటించారు. ఈ మూవీలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. బ్రూస్ లీ మూవీ 2015లో అక్టోబరు 16న రిలీజ్ అయ్యి, ఫ్లాప్ గా నిలిచింది.
అయితే ఆ తరువాత కాలంలో రామ్ చరణ్ డైరెక్షన్ లో ధృవ మూవీలో నటించారు. ఈ మూవీలో రామ్ చరణ్ బ్రూస్ లీ మూవీ ఫ్లాప్ అయిన ఆ మూవీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు ధృవ మూవీలో అవకాశం ఇచ్చారు. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఇదే సెంటిమెంట్ ను పాటిస్తూ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాలో కియారా అద్వానీకి ఛాన్స్ ఇచ్చారని అంటున్నారు. ఎందుకంటే 2019లో రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన వినయ విధేయ రామ మూవీలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటించింది.
అయితే ఆ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఆ హీరోయిన్ కియారా అద్వానీకి గేమ్ ఛేంజర్ లో ఛాన్స్ ఇచ్చారు. దాంతో నెట్టింట్లో రామ్ చరణ్ ఫ్లాప్ సెంటిమెంట్లను పట్టించుకోరని, అందువల్లే ఫ్లాప్ మూవీ హీరోయిన్లకు తన చిత్రాలలో ఛాన్స్ ఇస్తున్నారని అంటున్నారు.
అక్కినేని నాగార్జున సోదరి నాగసుశీల తన కుమారుడు సుశాంత్ హీరోగా పలు చిత్రాలను నిర్మించారు. కరెంట్, అడ్డా, కాళిదాసు, ఆటాడుకుందాం రా వంటి సినిమాలను నిర్మించారు. అయితే ఈ చిత్రాలకు నాగసుశీలతో పాటు చింతలపూడి శ్రీనివాసరావు కూడా నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రాలు తీవ్ర నష్టాలను మిగిల్చాయి. దాంతో నాగసుశీల, శ్రీనివాసరావుకు 2017లో విబేధాలు వచ్చాయి. వీరిద్దరు పార్టనర్స్ గా ఉండి, కొన్న ల్యాండ్ విషయంలో ఇద్దరికీ గొడవలు జరిగాయి. నాగసుశీల నాంపల్లి 2017లో చింతలపూడి శ్రీనివాసరావు మీద కోర్టులో కంప్లైంట్ చేశారు.
కోర్టు ఆదేశాలతో పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. శ్రీనివాసరావు నాగసుశీల తన మీద తప్పుడు కేసులు పెట్టారని మీడియాకు చెప్పారు. నాగసుశీల శ్రీనివాసరావు పై సరి అయిన ఆధారాలు చూపించకపోవడంతో నాంపల్లి కోర్టు ఈ కేసును కొట్టివేసింది. అయితే ఇప్పుడు నిర్మాత నాగసుశీల పై అదే శ్రీనివాసరావు కేసు పెట్టాడు. నాగసుశీలతో పాటు మరో పన్నెండు మంది తన పై అటాక్ చేశారని శ్రీనివాసరావు తన కంప్లైంట్ లో పేర్కొన్నాడు.
శ్రీనివాసరావు, నాగసుశీలతో కలిసి కొనుగోలు చేసిన భూములను అప్పుడే పంచుకున్నామని, తన వాటా భూమిని ఒక ఆశ్రమానికి డొనేట్ చేశానని, ఆ స్థలంలో ప్రస్తుతం ఆశ్రమం నిర్మాణ పనులు జరుగుతున్నాయని అన్నారు. కానీ నాగసుశీల ఆ భూమి తనదేనని ఇప్పుడు గొడవ చేస్తున్నారని శ్రీనివాసరావు పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. నాగసుశీల, ఆమె కుమారుడు సుశాంత్, బౌన్సర్లు, కొంత మంది వచ్చి దౌర్జన్యం చేశారని, గొడవ చేశారని శ్రీనివాసరావు ఆరోపణలు చేస్తున్నారు.
మీరా మరణానికి కారణం చదువుల్లో ఒత్తిడి అని తెలుస్తోంది. అయితే ఈ వార్తల పైన, తన కుమార్తె మీరా చనిపోవడం పైన విజయ్ ఆంటోని ఇప్పటి వరకు ఎలాంటి ప్రకనట చేయలేదు. కుమార్తె చనిపోయి, బాధలో ఉన్న విజయ్ ఆంటోనికి ప్రముఖులు, ఫ్యాన్స్ ధైర్యాన్ని చెబుతున్నారు. మీరా మృతి పట్ల సంతాపాన్ని తెలుపుతూ, సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. అయితే గతంలో బలవన్మరణం ఆలోచనల గురించి విజయ్ ఆంటోని మాట్లాడిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. అసలు బలవన్మరణంకు ఎందుకు పాల్పడుతారు?